MK Stalin appointed as DMK President అన్న హెచ్చరికల మధ్య.. డిఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్..

Mk stalin appointed as dmk president amid challenge from alagiri

Dravida Munnetra Kazhagam, DMK, MK Stalin, Alagiri, elder brother, readmitted, general council meeting, Karunanidhi, party president, chennai, tamil nadu, politics

M K Stalin was elected president of the DMK at the party’s General Council meeting. The 65-year-old, has been poised to take over the reins of the party from his father, the late M Karunanidhi amid his elder brother Alagiri warnings.DMK, MK Stalin, Alagiri, elder brother, readmitted, general council meeting, Karunanidhi, party president, chennai, tamil nadu, politics

అళగిరి హెచ్చరికల మధ్య.. డిఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్..

Posted: 08/28/2018 01:31 PM IST
Mk stalin appointed as dmk president amid challenge from alagiri

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతి తర్వాత ఆ పార్టీ అధ్యక్ష పగ్గాలను ఆయన రాజకీయ వారసుడు ఎంకే స్టాలిన్ ఇవాళ అందుకున్నారు. ఈ మేరకు పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో ఆయనను పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై వున్న సస్పెన్షన్ ను ఎత్తివేసి, తనను కూడా పార్టీలోకి చేర్చుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని కరుణానిధి పెద్ద తనయుడు అళగిరి హెచ్చరించకల మధ్య డీఎంకే కౌన్సిల్ సమావేశం కావడం. ఏకగ్రీవంగా స్టాలిన్ ను పార్టీ అధినేతగా ఎన్నిక చేయడం జరిగిపోయాయి.

స్టాలిన్ డీఎంకే పార్టీ అధినేతగా ఎన్నిక కావడంతో పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా స్వీట్లు పంచుకున్నారు. పలువురు నేతలు ఏకంగా పాఠశాలల్లో కూడా విద్యార్థులకు స్వీట్లను పంచిపెట్టారు. పార్టీ అధ్యక్ష పగ్గాలను ఏకగ్రీవంగా అందుకున్న తరుణంలో స్టాలిన్ కు పలువురు నేతల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లివిసిరాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ కేంద్ర అర్థిక శాఖ మంత్రి చిదంబరం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు మహిళా కాంగ్రెస్ నాయకురాలు కుష్భూ సుందర్, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్, తెలుగు చిత్రసీమ నటుడు మోహన్ బాబు తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా డీఎంకే పార్టీ కోశాధికారి పదవికి సీనియర్ నేత ఎస్.దురై కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన సమావేశంలో డీఎంకే వ్యవస్థాపక అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి భారత రత్న అవార్డును అందజేయాలని పార్టీ ఏకగ్రీవ తీర్మాణాన్ని చేసింది. ఈ తీర్మాణాన్ని వారు కేంద్రానికి కూడా పంపనున్నారని సమాచారం. ఇక ఇవాళ సాయంత్రం స్టాలిన్ తన పార్టీ ముఖ్యనేతలతో కలసి కరుణానిధి సమాధి వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తారని తెలుస్తుంది.

అయితే కరుణానిధి పెద్ద తనయుడు, ఆ పార్టీ బహిష్కృత నేత అళగిరి హెచ్చరికలను మాత్రం ఆ పార్టీ అసలుపరిగణలోకి తీసుకోలేదు. తనను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరికలను పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. డీఎంకే పార్టీని కాపాడుకోవాలంటే తాను తిరిగి పార్టీలో చేరడం తప్పనిసరి అని అళగిరి పేర్కొన్నారు.

తనను కనుక పార్టీలోకి తిరిగి తీసుకోవడానికి నిరాకరిస్తే జరగబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల అళగిరి మాట్లాడుతూ వచ్చే నెల 5న చెన్నైలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. దీంతో అళగిరి-స్టాలిన్ మధ్య ఆధిపత్య పోరు తప్పదని భావించారు. అళగిరి తాజా వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ 2014లో అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DMK  MK Stalin  Alagiri  Karunanidhi  party president  chennai  tamil nadu  politics  

Other Articles