railways plans to generate revenue ఆదాయం కోసం కొత్త ఆలోచనలతో రైల్వే పరుగులు..

Railways plan in train shopping to generate revenue

Mumbai, Railways, Shopping on trains, Central Railway, Western Railway,premium trains, Railway ministry, Shatabdi, Konark Express, foot massage at station, Indian Railways, revenue

Dreading that long train journey? From December, you may be able to spend some of your travel time shopping. The western and central railways plan to have items such as perfumes, bags, watches and travel essentials for sale.

ఆదాయం కోసం కొత్త ఆలోచనలతో రైల్వే పరుగులు..

Posted: 08/27/2018 02:02 PM IST
Railways plan in train shopping to generate revenue

సుధూర ప్రయాణాలు చేసే దేశ ప్రజలను వారి గమ్యస్థానాలకు అత్యంత తక్కువ ఖర్చులో చేర్చడమే పరమావధిగా ప్రారంభమైన రైల్వే.. తన అసలైన లక్ష్యానికి తూట్లు పోడుస్తూ.. ఆదాయ అర్జనే ధ్యేయంగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే అటు కార్గో ఇటు ప్రయాణికుల టిక్కెట్ ధరలను పెంచి ప్రజలపై భారం మోపిన రైల్వే.. ఇక రిజర్వేషన్ల ధరల్లోనే ధరలు సమయ అనుసంధాన ఖరీదు టికెట్లను తీసుకువచ్చి ప్రజలపై భారం మోపుతుంది. ఇది చాలదన్నట్లు దేశంలోని రైల్వే ప్రయాణికులపై భారం మోపుతూ.. గుజారత్ లోని బుల్లెట్ రైలుకు మళ్లిస్తుందా.? అన్న అనుమానాలు విమర్శలు వ్యక్తం అవుతున్న క్రమంలో అదాయం పెంచుకోవడం కోసమేనని రైల్వేశాఖ బదులిస్తుంది.

తాజాగా ఆదాయం పెంచుకోవడం కోసం మరో వినూత్న ఐడియాకు ప్రతిపాదన చేసిన రైల్వే.. దానిని ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది అరంభంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇంతకీ ఆ ఐడియా ఏంటంటారా.? ఇప్పటికే విమనాశ్రయాలలో అందుబాటులో వున్న విధంగా రైల్వే స్టేషన్లలో కూడా ఇక షాపింగ్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. మీకు కావాల్సిన వస్తువులను కొనుక్కోవచ్చు. ప్రయాణికులకు అవసరమైన కొన్ని వస్తువులను రైళ్లలోనే అమ్మే విధంగా రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. తొలుత పశ్చిమ, మధ్య రైల్వేల్లో ‘ఇన్‌ ట్రైన్‌ షాపింగ్’‌ను తీసుకువస్తున్నారు. డిసెంబర్‌ నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

రైల్వే శాఖ తన ఆదాయాన్ని పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. టికెట్‌ అమ్మకాల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా దాదాపు రూ.1200 కోట్ల ఆదాయాన్ని సమకూర్చాలని రైల్వే శాఖ ఇటీవల అన్ని జోనల్‌ రైల్వేస్‌ను కోరింది. ఇందులో భాగంగా రెవెన్యూను పెంచుకునేందుకు రైళ్లలోనే షాపింగ్‌ కార్యక్రమానికి ప్రణాళికలు చుట్టారు. రైళ్లలోనే ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అవసరమైన బ్యాగులు, గడియారాలు, సెంటులు తదితర వస్తువులను అమ్మేందుకు పశ్చిమ, మధ్య రైల్వేలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మొదటగా ప్రీమియం ట్రైన్‌లలో దీన్ని ప్రవేశపెట్టి.. ఆ తర్వాత దూర ప్రయాణ రైళ్లకు విస్తరించనున్నారు.

ఇందుకోసం పశ్చిమ రైల్వే సెప్టెంబర్‌లో టెండర్లను ఆహ్వానించనుంది. డిసెంబర్‌ నుంచి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అమ్మకాలు చేపట్టనుంది. మరోవైపు మధ్య రైల్వే అక్టోబర్‌ నుంచి కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై ఎక్స్‌ప్రెస్‌, ఎర్నాకులం-హజరత్‌ నిజాముద్దీన్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌లలో షాపింగ్‌ను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. విమాన ప్రయాణాల్లో ఇలాంటి సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు రైల్వే శాఖ ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai  Railways  Shopping on trains  Railway ministry  Shatabdi  Konark Express  foot massage  revenue  

Other Articles