porn video in Ola cab, woman complaints police మహిళా ప్రయాణికురాలి ఎదుటు పోర్న్ వీడియో.. జిప్ తీసి..

Ola driver played porn video in cab alleges bengaluru woman

Ola cab, ola porn, OLA DRIVER, cab porn, porn video, misbehaviour, masturbating, sexual harrasment, woman, bengaluru, crime

An Ola cab driver allegedly misbehaved with a woman by playing a porn video on his mobile and masturbating when she was in the cab.

మహిళా ప్రయాణికురాలి ఎదుట పోర్న్ వీడియో.. జిప్ తీసి..

Posted: 08/27/2018 02:46 PM IST
Ola driver played porn video in cab alleges bengaluru woman

భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఓ ఓలా క్యాబ్ డ్రైవర్ రెచ్చిపోయాడు. కారెక్కిన మహిళ ను కంగారు పెట్టించాడు. కారును తక్షణం నిలిపేయాలని అమె గట్టిగా అరిచిన అరుపులను కూడా లక్షపెట్టకుండా అమెను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. నీచంగా ప్రవర్తిస్తూ.. వెకిలి చేష్టలతో పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తనకు ఎదురైన ఈ భయానక అనుభవాన్ని పోలీసులకు తెలిపేందుకు మహిళ ధైర్యం కూడగట్టుకునేందుకు సమయం పట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని కటకటాల వెనక్కి నెట్టే పనిలో ఉన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. గురువారం ఉదయం 6.28 నిమిషాల ప్రాంతంలో ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని యెలహంక న్యూ టౌన్ నుంచి జేపీ నగర్ వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. ఆ కారులో మహిళ ఒక్కతే వుండటంతో క్యాబ్ డ్రైవర్ అమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. క్యాబ్ సరిగ్గా క్వీన్స్ సర్కిల్ దగ్గరకు రాగానే డ్రైవర్ మహిళను అదో రకంగా మహిళను చూశాడు. అతడి చేష్టలతో అప్పటికే ఆమెకు అనుమానం కలిగింది. తర్వాత కారు కొద్ది దూరం వెళ్లగానే డ్రైవర్ తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు.

తన దగ్గరున్న ఫోన్ లో ఏకంగా పోర్న్ వీడియో ప్లే చేశాడు. దానిని మహిళకు కనబడేలా వుంచాడు. మహిళ తన తలను తిప్పుకుని కిటికీలోంచి బయటకు చూస్తూ వుండిపోవడంతో.. అతని పైశాచికత్వం మరింత పెరిగింది. ఏకంగా తన ఫ్యాంటు జిప్ తీసి నీచంగా ప్రవర్తించాడు. అతడి చేష్టలతో షాకైన ఆ మహిళకు ఏం చేయాలో కూడా అర్థంకాలేదు. కారు ఆపమని పెద్దగా కేకలు వేసినా అతడు పట్టించుకోలేదు. చివరికి కారును తీసుకెళ్లి జేపీ నగర్లో ఆపేశాడు. భయంతో ఆమె కారు దిగి దిగగానే పరిగెత్తుతూ వెళ్లిపోయింది.

అయితే అమెకు జరిగిన ఘటనపై పోలీసులకు చెప్పేందుకు తనంతట తానుగా ధైర్యం కూడగట్టుకుని.. శనివారం  కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. క్యాబ్ వివరాలను వారికి అందించడంతో కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ఆ డ్రైవర్‌ను దేవసమోలియాగా గుర్తించారు. త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామంటున్నారు పోలీసులు. మరోవైపు ఈ ఘటనపై ఓలా సంస్థ ప్రతినిధి స్పందించారు. ఓలా వినియోగదారులే తమకు చాలా ముఖ్యమని.. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని.. తాము పోలీసులకు సహకరిస్తామంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ola cab  DRIVER  porn video  misbehaviour  masturbating  sexual harrasment  woman  bengaluru  crime  

Other Articles