BJP, RSS dividing India: Rahul in Berlin ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి తీరుతాం: రాహుల్

Spl status for ap when cong comes to power in 2019 rahul

Rahul Gandhi, Demonetisation, RSS, BJP, PM Modi, RBI Governor, finance ministry, mahatma gandhi, london, Guru Nanak, amarinder singh, Special category status, Berlin, England, congress overseas wing, Andhra Pradesh, latest news

Congress president Rahul Gandhi on Friday said in Berlin, the moment the Congress party comes to power in 2019, it will grant the Special Category Status to Andhra Pradesh.

ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి.. మాట నిలుపుకుంటాం: రాహుల్

Posted: 08/24/2018 05:29 PM IST
Spl status for ap when cong comes to power in 2019 rahul

బీజేపి, ఆరెస్సెన్ లు దేశప్రజల మధ్య విభజనను తీసుకువచ్చి విఛ్చిన్నకరమై విధానాలను అవలంభిస్తున్నాయని ఇదే దేశ ప్రగతికి ఎంతమాత్రం సముచితం కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల విభాగం (ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్) అధ్వర్యంలో నిన్న జర్మనీలో కొనసాగించిన ఒరవడినే ఆయన ఇవాళ ఇంగ్లాండ్ లో కూడా కొనసాగించారు. తమ కాంగ్రెస్ పార్టీ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రజలందరి మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తుంటే.. బీజేపి, ఆర్ఎస్ఎస్ లు మాత్రం ప్రజల మధ్య వైషమ్యాలను పెంచుతూ, రెచ్చగొడుతూ వారిని విడదీస్తుందని ఆరోపించారు.

అబద్దాలు నిజాలు వెళ్లినంత వేగంగా ప్రజల్లోకి వెళ్లలేవని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ తనను, తనతో పాటు ప్రతిపక్ష నేతలను విమర్శిస్తూ, మారు పేర్లతో పిలుస్తున్నారని అన్నారు. కానీ వాళ్లు చేసిన దూషణలు వేగంగా ప్రజల్లోకి వెళ్లాయా? అని ప్రశ్నించారు. తాను మోదీని ఆలింగనం చేసుకున్న ఘటన ప్రజల్లోకి వెళ్లిందా?’ అని రాహుల్ ప్రశ్నించారు. సాధారణంగా ప్రజలు ఎక్కడైనా న్యాయం కోసం కోర్టుకు వెళతారనీ, మోదీ హయాంలో మాత్రం ఏకంగా జడ్జీలే న్యాయం కోసం ప్రజల ముందుకు వచ్చారని రాహుల్ ఎద్దేవా చేశారు.

దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ, ఆరెస్సెస్ నాశనం చేస్తున్నాయని అరోపించిన ఆయన దేశంలోని ప్రజా ప్రభుత్వం వెనుక ఇవాళ ఆర్ఎస్ఎస్ పెత్తనం నడుస్తుందని దుయ్యబట్టారు. నోట్ల రద్దు నిర్ణయం కూడా తీసుకున్నది ఆర్ఎస్ఎస్ మాత్రమేనని, దానినే కేంద్రప్రభుత్వం అమలు పర్చిందని అన్నారు. దీంతో ఆర్బీఐ కానీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ కానీ ఉత్సవ విగ్రహాలుగా మారాయని ఆయన విమర్శించారు. ఇదే కొనసాగితే దేశంలోని వ్యవస్థలన్ని నిర్వీర్యం అవుతాయని అందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రజాస్వామ్య దేశానికి ముప్పును వాటిల్లే ప్రమాదముందని అన్నారు.

దేశంలో ప్రస్తుతం బీజేపి పాలిత, బీజేపి యేతర పాలిత రాష్ట్రాల మధ్య వత్యాసం స్పష్టంగా కనిపిస్తుందని అరోపించారు. బీజేపియేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమను కనబరుస్తుందని విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాలకు కేంద్రం నిధుల విషయంలో కూడా ఎంతో వత్యాసం చూపుతుందని అరోపించారు. ఇక ఇచ్చిన హామీలను నిలుపుకునే విషయంలో కూడా కేంద్రంపై అర్ఎస్ఎస్ ప్రభావం చూపుతుందని అన్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అంధ్రప్రదేశ్ రాష్ట్రంగా పేర్కోన్నారు రాహుల్.

అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్రులకు మాట ఇచ్చామనీ, దాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే నిలబెట్టుకుంటామని వెల్లడించారు. ‘ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా మాట ఇచ్చిందని.. ఇచ్చిన మాటను అంత తేలిగ్గా మర్చిపోబోమని, 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ అంద్రప్రదేశ్ ప్రజలకు మరోమారు మాటిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Berlin  Andhra Pradesh  spl status  RSS  PM Modi  BJP  Congress  politics  

Other Articles