CM's Relatives Mock Law, Threatens Cop బావమరిది హల్ చల్ పై స్పందించిన సీఎం..

Cm shivraj singh chouhan s relatives mock law threatens cop

#VVIPRacism, MP, shivraj singh chauhan, shivraj singh chouhan bhashan, traffic police, rajendra singh, traffic violations, cops, shivraj singh relatives, Deependra Swarnakar, Madhya Pradesh, latest news

Madhya Pradesh CM Shivraj Singh Chouhan's relative (Rajendra Singh Chauhan) found flouting the law, he not only openly violated traffic rules but when questioned by cops, he threw tantrums and refused to show the vehicle's papers #VVIPRacism

ITEMVIDEOS: బావమరిది హల్ చల్ పై స్పందించిన సీఎం.. విమర్శల పర్వం

Posted: 08/24/2018 04:21 PM IST
Cm shivraj singh chouhan s relatives mock law threatens cop

తాను ఏకంగా ముఖ్యమంత్రి బావమరిదిని అంటూ ఓ వ్యక్తి చేసిన హల్ చల్.. నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే ఈ విషయం ఏకంగా ముఖ్యమంత్రి దృష్టికి కూడా చేరింది. దీంతో ఈ దుమారంపై స్పందించిన ముఖ్యమంత్రి తనకు రాష్టంలో కోట్లాది మంది బావ, బావమరుదలున్నారని తనదైన శైలిలో చమత్కరించారు. అదెలా అన్న సందేహంపై కూడా ఆయనే స్వయంగా వివరిస్తూ రాష్ట్రంలో తనకు కోట్లాది మంది అక్కచెల్లెల్లు ఉన్నారని... వారి భర్తలంతా తనకు బావ, బావమరదులే అవుతారని తెలిపారు. అయితే దీనిపై అటు విపక్ష పార్టీలు ఇటు నెట్టింట్లో జనులు తీవ్రస్థాయిలో విమర్శలను గుప్పిస్తున్నారు.

ఇంతకీ ఎం జరిగిందంటే.. తాను సీఎం బావమరిదిని అంటూ ఓ వ్యక్తి రచ్చరచ్చ చేశాడు. రాష్ట్ర విధానసభ ముందు పోలీసులకు హెచ్చరికలు జారీ చేశాడు. సరిగ్గా విధాన సభ ఎదురుగా యధేశ్చగా ట్రాఫిక్ నిబంధనలకు నీళ్లువదిలి వెళ్లసాగాడు. దీంతో ఆ వ్యక్తి కారును పోలీసులు నిలువరించారు. చేసిన తప్పుకు ఫైన్ కట్టాలని చెప్పారు. దీంతో, సదరు వ్యక్తి రెచ్చిపోయాడు. ముఖ్యమంత్రి బావమరిదిని... నాకే ఫైన్ వేస్తారా? అంటూ పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. రోడ్డు మీదే ఆందోళనకు దిగాడు. అంతేకాదు, పోలీసులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో, పోలీసులు షాక్ అయ్యారు. ఇంతలో మరికోందరు పోలీసలు జోక్యం చేసుకని గొడవను తగ్గించారు.

ఆ ముఖ్యమంత్రి ఎవరు.. నెట్ జనులు ఎందుకు విమర్శలను గుప్పిస్తున్నారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయా.? ఆయన మరోవరో కాదు ఏకంగా మూడు పర్యాయాలు వరుసగా సీఎం పగ్గాలను అందుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్. అయితే నెట్ జనులు, విపక్ష పార్టీలు ఎందుకు ఆయనను విమర్శిస్తున్నారు అంటే.. ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా వెళ్లని వ్యక్తి నిజంగా ముఖ్యమంత్రి బావమరిదే కావడం విశేషం. ఆయన పేరు రాజేంద్ర సింగ్ చౌహాన్. ఆయనతో పాటు ఇద్దరు మహిళలు కూడా వున్నారు.

అయితే అసలు నిజాన్ని దాచి పెట్టిన ముఖ్యమంత్రి తనకు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మంది బావలు, బావమరదులు వున్నారని చమత్కరించడాన్ని తప్పుబడుతున్నారు నెట్ జనులు. దీనికి తోడు ముఖ్యమంత్రి తన బావలు, బావమరదులను చట్టాన్ని పాటించేలా ముందుగా ప్రతీణ చేయించాలని కొందరు కామెంట్లు పెడుతుండగా, మరికొందరు మాత్రం చట్టాన్ని ఉల్లంఘించన బావలు, బావమరదులపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles