TDP crorepathis dont donate for Amaravati, why.? హాట్ టాపిక్ గా వివిఆర్ కృష్ణంరాజు అరోపణలు

Ap editors association president allegations turn hot topic in state

Andhra Pradesh Editors Association, APEA President VVR Krishnam Raju, VVR Krishnam Raju allegations on TDP, VVR Krishnam Raju allegations Hot Topic, Ruling tdp party crorepathis, TDP Crorepathi's contribution, Amaravati, Andhra Pradesh, Politics

Andhra Pradesh Editors Association President VVR Krishnam Raju allegations on TDP party turn Hot Topic in State, as he Questions, why the Ruling tdp party crorepathis do not contribute volentarly to Amaravati.

టీడీపీ కోటీశ్వర నేతలు రాజధానికి విరాళాలు ఇవ్వరా.?

Posted: 08/23/2018 03:40 PM IST
Ap editors association president allegations turn hot topic in state

రాజధాని లేని రాష్ట్రంలో ఏర్పడిన అవశేష అంధ్రప్రదేశ్ లో ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించేందుకు ప్రజలు, ఉద్యోగులు నుంచి అన్ని వర్గాల వారు కదలిరావాలని పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు.. తన పార్టీ నేతలను మాత్రం ఎందుకు మినహాయించారు అన్నది అర్థం కాని ప్రశ్న. చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, చివరాఖరకు పార్టీ కార్యకర్తలు కూడా స్పందించి తమకు తోచినంత, తమకు సాధ్యమైనంత రాజధాని నిర్మాణం కోసం విరాళం ఇచ్చారు.

నవ్యాంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఉద్యోగులు ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని పెట్టి తమకు తోచిన విధంగా విరాళాలు ఇవ్వగా ఓ మహిళా ఉద్యోగి ఏకంగా తన వంటిమీదున్న బంగారం మొత్తాన్ని కూడా విరాళంగా సమర్పించుకుంది. తాజాగా ఓ కానిస్టేబుల్ కూడా తన జీతంలోంచి ఐదు వేల రూపాయలను సమర్పించుకున్నారు. చంద్రబాబు పిలుపుకు పాతిక వేల ఉద్యోగస్తులకే స్పందించి తమ జీతంలోని పావు శాతం విరాళంగా ఇస్తే.. పార్టీ నేతలు మాత్రం ఎందుకు స్పందించడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

రాజధాని నిర్మణం, పోలవరం, పట్టీసీమ ప్రాజెక్టు సహా ఇతరాత్ర అభివృద్ది కార్యక్రమాల పేరు చెప్పుకుని ప్రభుత్వం ప్రజలను బురిడీ కోట్టిస్తూ వారిని పక్కదోవ పట్టిస్తుందే తప్ప.. అసలు కోటీశ్వరులైన తమ పార్టీ నేతలను ఎందుకు విరాళాలు అడగటం లేదు.? కనీసం పార్టీ నేతలైన చంద్రబాబు నిత్యం అలపిస్తున్న ఆర్థిక ఇబ్బందుల పాటకు పల్లవి కడుతున్నారే తప్ప.. తమ వంతుగా ఏదైనా చేస్తామని ఎందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే పండగ చేసుకునే నేతలు.. ఏదో ఒక పని చేస్తూ వెనకేసుకుంటున్నారన్న అరోపణలు వినబడుతున్నా.. వాటిని తోసిరాజుతూ ఒక్క నేత కూడా కనీసం విరాళాన్ని ప్రకటించడం లేదు.

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో దోస్తీ చెడిన తరువాత.. నిధుల కోసం రాజధాని అమరావతి పేరిట బాండ్లకు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మదపరులకు వాటిని అందుబాటులో పెట్టే బదులు.. తమ పార్టీ నేతలకే వాటిని విక్రయించి సోమ్ముచేసుకోవచ్చును కదా.? ఈ క్రమంలో బాండ్ల విషయమై ప్రచారంలోకి వచ్చిన పలు కథనాలు, వార్తలు నిజం కాదని కూడా రుజువు చేసే అవకాశముంటుంది కదా.? అలా కాదాని పార్టీ నేతలను మాత్రం బాండ్లకు దూరంగా పెట్టి.. మదుపరులకు మాత్రమే వాటిని అందుబాటులో పెట్టడంతో వీటిపై ప్రచారంలోకి వచ్చిన కథనాలు సత్యమని భావించే అవకాశముంది.

నాలుగున్నరేళ్లుగా లేని విషయం ఇప్పుడే ఎందుకు చర్చనీయాంశంగా మారిందంటే.. ఇటీవల అధికార టీడీపీ పార్టీలోని కోటీశ్వరుల వివరాలను ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అద్యక్షుడు వివిఆర్ కృష్ణంరాజు వెల్లడించడంతో వారెందుకు రాజధాని కోసం విరాళాలు ఇవ్వరు అన్న డిమాండ్ తెరపైకి వస్తుంది. తమ పార్టీ నేత పిలుపును అందుకు స్వచ్చంధంగా వారే తొలుత విరాళాలు అందించాల్సిన నాయకులు ఎందుకు నాలుగున్నరేళ్లుగా మీనమేషాలు లెక్కపెడుతున్నారన్న విషయం ఇప్పడు ప్రజల్లో హాట్ టాపిక్ గా మారుతుంది.

ఇంతకీ తెలుగుదేశం పార్టీలో వున్న కోటీశ్వరుల సంఖ్య ఎంత.? అంటే కోటి రూపాయల నుంచి ఆపైన ఎంతమందికి వుందన్న అన్న ప్రాతిపదికన కాకుండా.. అలా అని పదికోట్ల రూపాయలు వున్నవారిని కూడా పక్కనబెట్టినా వేల సంఖ్యలోనే నాయకులు వున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మాత్రం వీరందరినీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం.. వంద కోట్లకు పడగలెత్తిన నేతలను మాత్రమే లెక్కించినా వారే 754 మంది వున్నారంటే విస్మయం చెందకుండా ఎలా వుండగలం.

ఔనండీ వివిఆర్ కృష్ణంరాజు తెలిపిన గణంకాల ప్రకారం.. టీడీపీ పార్టీలో రూ.100 కోట్లు పైగా ఆస్తి ఉన్న నేతల సంఖ్య 750 అని తేల్చారు. వీళ్లలో రూ.1000 కోట్లు పైన ఆస్తి ఉన్నవాళ్ల సంఖ్య కూడా 300 మందికిపైనే వుందని అన్నారు. ఇక ఏకంగా రూ.10, 000 ( పదివేలు ) కోట్ల పైన ఆస్తి ఉన్న నేతల సంఖ్య కూడా 20 మందికి పైగానే వుందని తేల్చారు. ఇంత మంది సంపన్నులు అధికార పార్టీలో వున్నా పార్టీకి, పార్టీ అధినేతకు, కనీసం రాష్ట్ర ప్రజలకు అండదండలను అందించాల్సిందిపోయి.. ఇంకా తమ వంతు విరాళాలు ఇవ్వడంలో తాత్సరం చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

అయితే కృష్ణంరాజు మాత్రం అధికార టీడీపీ నేతలు తమ ప్రభుత్వం అధికారంలో వుందని అడ్డగోలుగా అక్రమార్జనను ఆర్జిస్తున్నారని అరోపిస్తున్నారు. రాష్ట్ర ఆదాయమంతా వీరి ఖాతాల్లోకే వెళ్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల డబ్బును ఈ నేతలే అక్రమ మార్గాల్లో పోందుతున్నారని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగూణంగా ఆయన తన సందేహాలను కూడా వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై ప్రశ్నలు కురిపించారు.

రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడినాక నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టారని అన్నారు. ఒక్కో బడ్జెట్ సుమారుగా లక్షా యాభై వేల కోట్లుగా వుందని.. వాటన్నింటినీ ఏకమెత్తంగా చేస్తే నాలుగు సంవత్సరాలలో సుమారు 6 లక్షల కోట్ల రూపాయలని చెప్పారు. దీంతో పాటు ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన నిధులు ఒక లక్షా డెభై వేల కోట్ల రూపాయలని, దీనికి నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసని అప్పులు కలిపితే మరో లక్షా యాభై వేల కోట్ల రూపాయలని అన్నింటినీ క్రోడీకరిస్తే రూ. 9 లక్షల 25 వేల కోట్లని చెప్పారు. అయితే జీతాలకు ఏడాదికి లక్ష కోట్ల చోప్పున తీసేసినా.. నాలుగు లక్షల కోట్లు పోనూ మిగతా సోమ్మంతా ఈ 754 మంది కోటీశ్వర నాయకుల ఖాతాల్లోకే వెళ్లిందని కృష్ణంరాజు అరోపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : VVR Krishnam Raju  TDP  Amaravati  TDP Crorepathis  Amaravati  Andhra Pradesh  Politics  

Other Articles