Woman paraded naked in Bihar బిహార్ లో అమానవీయం.. మహిళ నగ్న ఊరేగింపు..

Woman paraded naked in bihar shops trains attacked

bihiya, The Angry Mob, Bimlesh Kumar, Lalu Prasad Yadav, Ganesh Shah,Shahpur police station, Woman paraded naked, Women pareded nude in Bihar, Tejashwi Prasad Yadav, Bhojpuri region, Arrah, Bihar, crime

A woman was thrashed and paraded naked by a mob on Monday morning in Bhojpur district on the suspicion of being involved in the murder of a local youth.

బిహార్ లో అమానవీయం.. మహిళ నగ్న ఊరేగింపు..

Posted: 08/21/2018 09:52 PM IST
Woman paraded naked in bihar shops trains attacked

బిహార్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాహార్ రాష్ట్రంలోని భోజ్ పూర్ జిల్లాలోని బహియా పోలీస్ స్టేషన్ పరిధిలో సభ్య సమాజం తలదించుకునేలా.. కొందరు వ్యక్తులు ఓ మహిళను వివస్త్రను చేసిన నగ్నంగా ఊరేగించారు. ఓ యువకుడిని చంపిందనే నెపంతో మహిళపై అగంతకులు ఆటవికంగా దాడి చేశారు.  వివరాల్లోకి వెళ్తే... దామోదర్ పూర్ కు చెందిన విమలేష్ షా అనే వ్యక్తి సోమవారం నుంచి కనిపించకుండా పోయాడు. నిన్న ఉదయం అతని మృత దేహం సమీపంలోని రైల్వే స్టేషన్ స్టేషన్ వద్ద కనిపించింది. దీంతో, గ్రామస్తులు అక్కడకు వెళ్లారు.

విమలేష్ మృతి చెందిన ప్రాంతానికి దగ్గర్లోనే రెడ్ లైట్ ఏరియా ఉంది. దీంతో, ఇతని మృతికి రెడ్ లైట్ ఏరియాలో ఉండే ఓ మహిళల కుటుంబమే కారణం కావచ్చని గ్రామస్తులు భావించారు. దీంతో సదరు మహిళను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి, ఆమెపై రాక్షసంగా దాడి చేశారు. వస్త్రాలను తొలగించి, నగ్నంగా ఊరేగించారు. అంతేకాదు, ఆమె ఇంటికి, ఒక మోటార్ బైక్ కు నిప్పంటించారు. దీంతో, అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.

సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ అక్కడకు చేరుకుని, గాల్లోకి కాల్పులు జరిపి, మూకను చెదరగొట్టారు. భారీఎత్తున బలగాలను దింపి, అల్లర్లను అదుపులోకి తెచ్చిరు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. అలసత్వం వహించిన 8 మంది పోలీసులను సస్పెండ్ చేశామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihiya  The Angry Mob  Bimlesh Kumar  Lalu Prasad Yadav  Ganesh Shah  Bhojpuri region  Arrah  Bihar  crime  

Other Articles