Kerala CM Urges Centre For Additional Help కేరళ ప్రకృతి ప్రకోపం తాజా గణంకాలు వెల్లడించిన సీఎం..

Kerala cm pinarayi vijayan urges centre for additional help

Kerala Floods, kerala floods 2018, kerala rains, kerala floods, india, news, navy, rescue operations, kerala, Palakkad district, Thrissur district, pinarayi vijayan, Narendra Modi, Idukki district, Rahul Gandhi, appeals-people, contribute, CM's-relief-fund, crime

Kerala Chief Minister Pinarayi Vijayan announced that the severe inundation claimed atleast 370 lives from May 29 onwards. The CM further informed that the state has suffered a loss of Rs 19,512 crores due to floods.

కేరళ ప్రకృతి ప్రకోపం తాజా గణంకాలు వెల్లడించిన సీఎం..

Posted: 08/21/2018 10:52 AM IST
Kerala cm pinarayi vijayan urges centre for additional help

దేవుడి సొంతరాష్ట్రంగా ఖ్యాతి గడించిన కేరళపై వరుణుడు ప్రళయకాల రుద్రడిలా విరుచుకుపడటంతో.. రాష్ట్రం చిన్నాభిన్నమైంది. అనేక మంది బతుకులు చిధ్రమైయ్యాయి. ఏకంగా 10 లక్షల మంది నిరాశ్రయులైయ్యారు. వందేళ్లుగా కనివిని ఎరుగని రీతిలో జలప్రళయం విరుచుకుపడటంతో.. కేరళవాసుల బతుకు చిత్రంపై కూడా పెను ప్రభావాన్ని చూపుతుంది. పది రోజుల క్రితం ఉన్నత మధ్యతరగతిగా బతికిన వారు ప్రస్తుతం ఇళ్లు, వాకిళ్లూ కూడా లేకుండా పూర్తిగా బికారులుగా మారి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.

వరదల బీభత్సంతో కుటంబాలలో సంపాదించే వారని కూడా కోల్పోయిన కుటుంబాలు.. ఒక్కసారిగా తమ వారిని కోల్పోవడంతో..కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇక తమ బతుకులకు అధారం ఏవరని తమను తాము ప్రశ్నించుకుంటూ దు:ఖసాగరంలో మునిగిపోతున్నారు. తమ పంట పోలాలు అంటూ ఎంతో శ్రద్దగా రబ్బురు తోటలు, కొబ్బరి తోటలు వేసిన రైతులు కూడా తమ పంట అంతా కొట్టుకుపోయిందని అంగలార్చుతున్నారు. ప్రకృతి విలయతాండవంలో విరిగిపడిన కొండచరియలతో, వరదలతో పొలాలకు పోలాలే కొట్టుకుపోయాయని కన్నీటిని దిగమింగుతున్నారు.

గతంలో ఎన్నడూ లేనంతగా జల విలయంలో చిక్కుకున్న కేరళలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కేరళ వరదలను కేంద్రం ‘తీవ్ర విప్తతు’గా ప్రకటించింది. సోమవారం ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ వరదల నష్టంపై తాజా గణంకాలను వెల్లడించారు. వరదల కారణంగా 370 మంది ప్రాణాలు కోల్పోయారని, పది లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. నిరాశ్రయులందరూ 3,274 సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నట్టు వివరించారు.

సోమవారం 602 మందిని రక్షించినట్టు సీఎం తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో కేరళ వార్షిక వ్యయం రూ.37,248 కోట్లని, ఇప్పుడు వరదల కారణంగా సంభవించిన నష్టం ఐదేళ్ల ప్రణాళిక వ్యయం కంటే ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి ఇప్పటి వరకు రూ.210 కోట్లు వచ్చాయని, మరో 160 కోట్లు రానున్నాయని తెలిపారు. కాగా, వరదల కారణంగా రూ.20 వేల కోట్ల నష్టం వాటిలినట్టు అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles