East Godavari congress president Nanaji to join Janasena జనసేనలోకి సీనియర్ కాంగ్రెస్ నేత నానాజీ..

Pawan kalyan emotional speech prof sudhakar rao superannuation feliciation

pawan kalyan, janasena, east godavari, congress, pantham Nanaji, HCU, sudhakar rao, nomadic tribes, ethnography, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan gives Emotional Speech at Prof. Sudhakar Rao Superannuation Feliciation, says he is talking with experience but not by detailed subject,

ITEMVIDEOS: మరోమారు తన వ్యక్తిత్వాన్ని చాటుకున్న జనసేనాని..

Posted: 08/20/2018 12:12 PM IST
Pawan kalyan emotional speech prof sudhakar rao superannuation feliciation

రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ.. వామపక్ష పార్టీలతో కలసి ఈ సారి ఎన్నికలలో ప్రత్యక్షపోరులోకి దిగనుంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ.. అక్కడి సమస్యలను అకళింపు చేసుకుంటున్న జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. అదే సమయంలో తన పార్టీని కూడా బలోపేతం చేసుకుంటున్నారు. అధికార, విపక్ష పార్టీల తప్పిదాలను ప్రశ్నిస్తూ.. తమ పార్టీ ఏం చేస్తుందన్న విషయాన్ని ప్రజలకు ఎక్కడికక్కడ స్పష్టం చేస్తున్నాడు. అధికారంపై తనకు మోజు లేదని, అదే సమయంలో డబ్బు సంపాదించేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని తేల్చిచెప్పారు.

అయితే పాలనలో పారదర్శకత, అవినీతి రహిత సమాజస్థాపన, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం.. పర్యావరణం పరిరక్షణ ఇలా తమ పార్టీ సిద్దాంతాలకు లోబడే తమ పార్టీ ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటుందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇదే క్రమంలో పవన్ సిద్దాంతాలకు అకర్షితులవుతున్న పలువురు నేతలు జనసేనలోకి చేరుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీకి చెందిన పలువురు నేతలు జనసేన తీర్థాన్ని పుచ్చుకోగా, పలువురు అధికార పార్టీ నేతలు కూడా ఎన్నికల సుముహూర్తం వచ్చే వరకు అగి ఆ తరువాత కండువాను మార్చే పనిలో వున్నారని సమాచారం. తాజాగా తూర్పు గోదావరికి చెందని కాంగ్రెస్ నేత కూడా అదే బాటలో పయనిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ.. ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పి.. త్వరలోనే జనసేనలో చేరబోతున్నారు. ఈ మేరకు కాకినాడ మీడియా ప్రముఖుల సమావేశంలో ఆయన ప్రకటించారు. పవన్ కల్యాణ్ విధివిధానాలు, పార్టీ సిద్దాంతాలు తనకు నచ్చడంతోనే ఆ పార్టీలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే జనసేనలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. అయితే, పార్టీ టికెట్‌ను మాత్రం ఆశించడం లేదని పేర్కొన్న నానాజీ జనసేన విధివిధానాలు తనకు నచ్చాయని పునరుద్ఘాటించారు. పవన్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన సమక్షంలో పార్టీలో చేరుతానని నానాజీ తెలిపారు.

అయితే తనకు సముచిత స్థానం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి మనుగడ కష్టంగా మారిందని,.. అయినా ఐదేళ్ల పాటు పార్టీలోనే తాను కొనసాగుతూ వచ్చాననని చెప్పారు. తనకు కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని నానాజీ తెలిపారు. రాష్ట్ర విభజనతో పార్టీ తన అదరణను కోల్పోయిందని అన్నారు. కాంగ్రెస్‌ను వీడుతున్నా తన వెంట ఒక్క కార్యకర్తను కూడా తీసుకెళ్లడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో 32 ఏళ్ల పాటు పనిచేశానని, ఎన్నో పదవులు అధిష్ఠించానని నానాజీ వివరించారు.

మరోమారు తన ఔనత్యాన్ని చాటుకున్న పవన్..

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పవాడు అన్న అత్తారింటికి దారేది చిత్రంలోని డైలాగ్ గుర్తుందా.? ఈ డైలాగ్ తెలియడం కాదు.. అందులోని పరమార్థం తెలియడం విశేషం.. దానిని అచరరించడం గోప్పదనం.. అదే జపసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాన్ చేసి చూపారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సంచారజాతుల వారి స్థితిగతులు, సంస్కృతులు, జీవన విధానలపై అధ్యయనం చేసి.. పుస్తకాన్ని రచించిన హెచ్‌‌సీయూ ప్రొఫెసర్ ఎన్.సుధాకర్ రావుకు సన్మానం చేశారు. సుధాకర్ రావు పదవీ విరమణ సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమాన్నికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అక్కడి అహుతులను, ప్రేక్షకులను, సభికులతో పాటు అందరినీ అశ్చర్యంలో ముంచిన పవన్ కల్యాణ్.. అందరి సమక్షంలో సుధాకర్ రావుకు పాదాభివందనం చేశారు. అంతకుముందు జనసేనాని ఆయనను గూర్చి మాట్లాడుతూ.. సుధాకర్ రావును గూర్చి మాట్లాడేందుకు తనకు ప్రస్తుతం అర్హత లేదని అన్నారు. ఆయనకు ఉన్న మేధస్సు కానీ, తపన కానీ తనకు లేవన్న ఆయన.. తనకు అన్ని వర్గాల స్థితిగతులను తెలుసుకోవాలన్న తపన ఎంతో వుందని, అన్నింటినీ క్రమంగా నేర్చుకుంటున్నానని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం తాను పనిచేస్తున్నట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  east godavari  congress  pantham Nanaji  HCU  sudhakar rao  nomadic tribes  ethnography  

Other Articles