Vajpayee noticeable protest against China చైనా దౌత్య కార్యాలయానికి గొర్రెలను పంపిన వాజ్ పాయ్.. ఎందుకు.?

Why vajpayee took flock of sheep to chinese embassy

china, atal bihari vajpayee, beijing, sikkim border face-off, Atal Bihari Vajpayee death, Atal Bihari Vajpayee dead, Atal Bihari Vajpayee career, Atal Bihari Vajpayee china, Atal Chinese protests, BJP Atal Bihari Vajpayee, third world war, sheep and yak, china embassy, noticeable protest, indian troops, Indian government, eat me but save the world

Atal Bihari Vajpayee, the legend among the present politicians, waw also knew how to make a noticeable protest. So when China made allegations that we stole sheep, the former PM took a flock to the embassy.

చైనా దౌత్య కార్యాలయానికి గొర్రెలను పంపిన వాజ్ పాయ్.. ఎందుకు.?

Posted: 08/18/2018 12:36 PM IST
Why vajpayee took flock of sheep to chinese embassy

భారత దేశంపై విరుచుకుపడిన ఘటన తాలుకూ గాయాలు మదిని తొలుస్తున్న క్రమంలో చైనాపై 1967వ ఏడాది చివరిలో యుద్దానికి వెళ్లి డ్రాగన్ దేశానికి చుక్కులు చూపించి విజయగర్వంతో వచ్చిన భారత దళాలు తమ ఘనతను చాటుకున్నాయి. అయితే అంతకుముందు మన భారత సైనికులు మనోధైర్యం దెబ్బతినేలా..  చైనా కుతంత్రాలు పన్నింది. భారత సైనికులపై దొంగతనం.. మనుషులు అపహరించారన్న అరోపణలు చేసింది. ఈ క్రమంలో అప్పట్లో ఎంపీగా కొనసాగుతున్న భారత ముద్దుబిడ్డ అటల్ బిహారీ వాజ్ పేయి.. చైనాకు దిమ్మదిరిగేలా.. ఎప్పటికీ గుర్తండిపోయేలా షాక్ ఇచ్చారు.

సిక్కిం విషయంలో భారత్-చైనా మధ్య వివాదం మొదలైంది. అదే సమయంలో టిబెట్‌కు చెందిన ఓ పశువుల కాపరి వద్ద నుంచి భారత దళాలు 800 గొర్రెలు, 49 జడల బర్రెలను దొంగిలించారని చైనా ఆరోపించింది. వెంటనే వాటిని తిరిగి ఇవ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. ఆ తరువాత వినూత్న రీతిలో భారత్ పార్లమెంటు సభ్యుడు అటల్ బిహారీ వాజ్ పేయి తెలిపిన నిరసన నేపథ్యంలో చైనా అగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మరో లేఖకు భారత ప్రభుత్వానికి రాసింది. చైనా ఆరోపణలను ఖండిస్తూ.. వాజ్ పేయి చేపట్టిన నిరసన ఏమిటి.. చైనాకు అంత కోపం ఎందుకు వచ్చిందీ అంటే..

గొర్రెల పేరుతో చైనా మూడో ప్రపంచ యుద్ధానికి కాలు దువ్వుతోందని ఆరోపించిన ఆయన డ్రాగన్ కంట్రీపై వాజ్ పేయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని చైనా ఎంబసీకి ఏకంగా 800 గొర్రెలను తోలుకెళ్లి నిరసన తెలిపారు.  ‘మమ్మల్ని తినండి.. ప్రపంచాన్ని మాత్రం కాపాడండి’ అంటూ రాసున్న ప్లకార్డులను వాటిపై ప్రదర్శించారు. వాజ్ పేయి చేసిన పనికి చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. వాజ్ పేయి వెనుక భారత ప్రభుత్వం వుందని అగ్రహంతో ఓ లేఖను కూడా రాసింది. అయితే వాజ్ పేయి నిరసనతో తమకు సంబంధం లేదని పేర్కోన్న భారత ప్రభుత్వం.. గోర్రెలు, గేదల అపహరణకు సంబంధించిన సమాచారం కూడా తమకు తెలియదని పేర్కోంది. ఇక నలుగురు టిబెటన్లను అపహరణ వార్త అవాస్తవమని పేర్కోంటూ చైనాకు లేఖను రాసింది. 1965లో జరిగిందీ ఘటన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles