Mother India lost most famous and beloved son: Sheikh Hasina అటల్ జీ మృతిపై స్పందించిన వివిధ దేశాలు..

Subcontinent has lost visionary political figure says pakistan

Amit Shah, Imran khan, America, Bangladesh, China, Mike Pompeo, Imran Khan, Sheik Hasina, atal bihari vajayee funeral, Atal Bihari Vajpayee, BJP, krishna menon marg, Mohan Bhagwat, Narendra Modi, Vajpayee, vajpayee death

Atal Bihari Vajpayee was a tall political personality of the subcontinent. His attempts for the betterment of India-Pak relationship will always be remembered. Mr Vajpayee,as a foreign minister, took responsibility of improving India-Pak ties: Pak PM designate Imran Khan

అటల్ జీ మృతిపై స్పందించిన వివిధ దేశాలు..

Posted: 08/17/2018 11:45 AM IST
Subcontinent has lost visionary political figure says pakistan

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతి పట్ల పలు ప్రపంచ దేశాలు స్పందించాయి. మరీ ముఖ్యంగా ఆయన చేసిన సేవలను.. ఆయన భారత విదేశాంగ శాఖ మంత్రిగా కొనసాగిన తరుణంలో నుంచి ప్రధానమంత్రి వరకు కొనసాగిన హయాంలో తీసుకున్న చర్యలు.. ద్వైపాక్షిక సంబంధాలు బలపడేందుకు ఆయన ఎంచుకున్న వ్యూహాలు, ప్రతివ్యూహాలను కూడా కొనియాడాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా మహానేత వాజ్ పేయికి ఘన నివాళులు అర్పించింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో స్పందిస్తూ.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడేందుకు వాజ్ పాయ్ తీసుకున్న నిర్ణయాలే కారణమని కొనియాడారు.

అప్పటి వరకు అగ్రరాజ్యంతో అంతంతమాత్రంగానే వున్న బంధాలు వాజ్ పేయి హయాం నుండి ధృడంగా తయారయ్యాయని చెప్పారు. రాజకీయా మహార్షి అస్తమించారన్న వార్తతో తాము దిగ్ర్భాంతికి గురయ్యామని, భారత దేశంలో ఓ మహానేతను కోల్పోయిందని తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బ్రిటన్ హై కమీషనర్ కూడా వాజ్ పేయి మృతికి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. డొమినిక్ అస్క్యూత్ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ భారత్ దేశం ఓ గోప్ప నేతను కొల్పోయిందని అన్నారు. ఆయనకు తమ దేశంలో ఒక రాజకీయ జ్ఞానిగా గౌరవం లభించిందని గుర్తు చేసుకున్నారు.

అటు దాయాధి దేశం పాకిస్థాన్ కూడా మాజీ ప్రధాని అటల్ జీకి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. అసుపత్రిలో గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన పరమపదించారన్న వార్త తమను విషాదంలో ముంచిందని తెలిపింది. అటల్ జీ ఓ గోప్ప రాజకీయ యోధుడని, పోరుగురాష్ట్రాలతో మరీ ముఖ్యంగా పాకిస్తాన్ తో సంబంధాలను మెరుగుపర్చేందుకు ఆయన చేసిన కృషి శ్లాఘంచింది. సార్క్ దేశాల సదస్సులో కీలక మద్దతును కూడగట్టడంతో పాటు ప్రాంతీయ అభివృద్దికి సహకారాన్ని అందించడంలో వాజ్ పేయి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది.

పాకిస్తాన్ కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా భారత్ మాజీ ప్రధాని మహానేత అటల్ బిహారీ వాజ్ పేయి మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాల బలోపేతానికి వాజ్‌పేయి చేసిన కృషి, పడిన తపన ఎప్పటికీ గుర్తుంటాయన్నారు. వాజ్‌పేయి ఉప ఖండంలోనే గొప్ప నేత అని ఇమ్రాన్ కొనియాడారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినా కూడా వాజ్ పేయి మృతికి సంతాపాన్ని ప్రకటించారు. భారత దేశం ఓ గొప్ప బిడ్డను కొల్పోయిందని పేర్కోన్నారు. సుపరిపాలన, సామాన్యుల సంక్షేమం, ప్రాంతీయ దేశాల మధ్య శాంతి సామరస్యం, ప్రగతి విరబూయడానికి ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమైనది అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Atal Bihari Vajpayee  Amit Shah  Imran khan  America  Bangladesh  China  Mike Pompeo  Imran Khan  Sheik Hasina  

Other Articles