Flood situation 'grave' in Kerala, 27 dead దేవుడు సొంత రాష్ట్రంలో వరుణుడి బీభత్సం..

Rescue operations continue in kerala as death toll reaches to 27

Idukki dam, Idukki reservoir, Periyar river, Heavy rain, landslides, floods, Idukki, Malappuram, Palghat, Kozhikode, Wayanad, Kannur, CM Pinarayi Vijayan, Ernakulam, PM Modi, Kerala

Heavy rain and landslides have killed at least 26 people in Kerala in the past two days. Chief Minister Pinarayi Vijayan has described the flood situation in the state as "very grim".

కేరళలో వరుణుడి బీభత్సం.. 27కు చేరిన మృతుల సంఖ్య

Posted: 08/10/2018 04:26 PM IST
Rescue operations continue in kerala as death toll reaches to 27

దేవుడే తన కోసం సృష్టించుకున్న రాష్ట్రం తమ కేరళ అని మళయాలీయులు గర్వంగా చెప్పుకుంటుంటారు. కానీ అలాంటి రాష్ట్రంలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఓ వైపు ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు.. మరోవైపు వరదలు.. ఇంకో వైపు కొండచరియలు విరిగిపడటంతో కేరళ వ్యాప్తంగా అతలాకుతళం అవుతుంది. ఇప్పటికే భారీ వర్షాలలో చిక్కుకున్న 27 మంది మృతి చెందగా, ఎందరో నిరాశ్రయులయ్యారు. దాదపుగా 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినా.. వరద బీభత్సం నానాటికీ పెరుగడంపై సీఎం పినరయి విజయన్ సహాయ బృందాలను రంగంలోకి దింపారు. సీఎంతో ఫోన్ లో సంభాషించిన ప్రధాని మోడీ..వరద బాధిత ప్రాంతాలకు కేంద్రం తరపున సాయం చేస్తామని తెలిపారు

కేరళ వ్యాప్తంగా ప్రకృతి ప్రళయకార రూపం దాల్చింది. కుండపోత వర్షాలతో వాగులు, నదులు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. రోడ్లు తెగిపోతున్నాయి. గ్రామాలు సరస్సులుగా మారిపోయాయి. తాగడానికి నీరు లేదు. ఉండడానికి గూడు లేదు. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ప్రజా రవాణా, సమాచార, వ్యవస్థలు కూడా స్థంభించాయి. వేలాది మంది నిరాశ్రయలయ్యారు. వారిని ఆదుకునేందుకు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షాలతో కొచ్చి విమానాశ్రయంలో విమానరాకపోకలు నిలిచిపోయాయి.

కేరళలోని  ఇడుక్కి, వయనాడ్, కోజికోడ్, మళప్పురం, పతానంతిట్ట, కన్నూర్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.  ఆలువ, ఎర్నాకుళం పట్టణాలు నీటమునిగాయి. వరదల నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. లోతట్లు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ఎన్డీఆర్ఎఫ్‌తో కోస్ట్‌గార్డ్, నేవీ, ఆర్మీ బృందాలు రంగంలోకి దిగాయి. ఒక్క ఇడుక్కి జిల్లాలోనే  12 మంది చనిపోయారు. ఇడుక్కిలో గురువారం 12.98 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. పెరియార్, చెరుతోని నదులు ఉప్పొంగుతున్నాయి.  భారీ వర్షాలకు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో 22 డ్యామ్‌ల గేట్లను ఎత్తి..దిగువకు నీరు వదులున్నారు.

భారీ వర్షాలకు ఇడుక్కి రిజర్వాయర్ డ్యామ్ నిండుకుండలా మారిపోయింది. గురువారం సాయంత్రం గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేశారు. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 2,403 అడుగులు కాగా..ప్రస్తుత నీటి మట్టం 2400కు చేరింది. మరోవైపు వరద ఉధృతి పెరుగుతుండడంతో గేట్లు ఎత్తారు అధికారు. ఐతే గత 26 ఏళ్లలో ఇడుక్కి గేట్లు తెరవడం ఇదే తొలిసారి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వంపైన ఆనకట్ట కలిగిన ప్రాజెక్టుగా ఇడుక్కి ప్రసిద్ధి చెందింది. కేరళకు  తమిళనాడు ప్రభుత్వం 5 కోట్ల విరాళం ప్రకటించింది. కేరళలోని నదులు ఉప్పొంగడంతో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలను సైతం కేంద్రం అప్రమత్తం చేసింది.

కేరళలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భారత్ లోని తమ పౌరులకు అమెరికా అడ్వైజరీ జారీచేసింది. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లకూడదని హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేరళకు వెళ్లకపోవడమే మంచిందని సూచించింది. ఇప్పటికే 24 మంది విదేశీ టూరిస్టులు మున్నార్‌లోని వరద ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  rains  floods  Idukki  Malappuram  Palghat  Kozhikode  Wayanad  Kannur  Idukki reservoir  

Other Articles