IKEA's Hyderabad store gets huge response on day one 'ఐకియా' స్టోర్ మేనియా: తొలి రోజున స్పందన అదుర్స్..,

Ikea s sofas spoons in demand as 1st india store opens in hyderabad

Ikea, Ikea store, ikea india, ikea hyderabad, ikea first day, IKEA, IKEA India shopping cart, Ikea Swedish furniture shop, FDI, Jesper Brodin, CAGR, Euromonitor International, KPMG India, India Business News,

Ikea's first India store, which opened its doors to a huge response by customers on Thursday, offers a world of options for people looking to furnish their homes with good quality and yet affordable products.

'ఐకియా' స్టోర్ మేనియా: తొలి రోజున స్పందన అదుర్స్..,

Posted: 08/10/2018 11:06 AM IST
Ikea s sofas spoons in demand as 1st india store opens in hyderabad

స్వీడిష్ ఫర్నీచర్ దిగ్గజం ఐకియా హైదరాబాదులోని హైటెక్ సిటీ సమీపంలో తన భారత దేశంలోని తొలి స్టోర్ ను లాంచ్ చేయనుంది. ఐకియా రాక సిటీ జనానికి మరో నయా షాపింగ్ కేరాఫ్ అడ్డా మారనుంది. వాస్తవానికి దేశంలో ఐకియా స్టోర్లలో హైదరాబాదు నాల్గవ ప్రాజెక్టు. కానీ మిగిలిన మూడు ప్రాజెక్టులకు మించి వేగంగా నిర్మాణ పనులు ముగించుకుని అట్టహాసంగా ప్రారంభమైన దేశంలోని తొలి స్టోర్ స్థానం పొందింది. ఇక ఐకియా స్టోర్ ప్రారంభం రోజున హైదరాబాదీయుల నుంచి కనివినీ ఎరుగని రీతిలో స్పందన లభించింది. ఎంతలా అంటే ఆ స్టోర్ వున్న మార్గాలకు వెళ్లే రూట్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయంటే రెస్సాన్స్ ఏ రేంజిలో వుందో అర్థం చేసుకోవచ్చు.

బ్రాండ్ హైదరాబాద్‌కి ఇప్పుడిదో నయా బూస్టింగ్. సామాన్యుల షాపింగ్‌కి నయా కేరాఫ్. 'ఐకియా' రాకతో ప్రస్తుతం నగరవాసుల్లో వినిపిస్తోన్న అభిప్రాయం ఇది. అంతర్జాతీయ మార్కెట్‌లో అతిపెద్ద ఫర్నీచర్ దిగ్గజంగా ఉన్న ఐకియా నేడు హైదరాబాద్‌లో తమ స్టోర్‌ను లాంచ్ చేయనుంది. ఇండియాలో ఐకియా ఏర్పాటు చేయబోతున్న మొట్టమొదటి స్టోర్ కూడా ఇదే కావడం విశేషం. భారత్‌లో తమ మార్కెట్ విస్తృతికి పుష్కలమైన అవకాశాలు ఉండటంతో.. 2025నాటికి దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో దాదాపు 25 ఐకియా స్టోర్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐకియా ప్రత్యేకతలను ఒకసారి పరిశీలిద్దాం.

ఐకియా ప్రత్యేకతలు
* హైదరాబాద్ హైటెక్ సిటీ పరిధిలోని మైండ్ స్పేస్ ఎదురుగా ఉన్న 13ఎకరాల విస్తీర్ణంలో(4,00,000 చదరపు అడుగుల) ఐకియా స్టోర్‌ను ఏర్పాటు చేశారు.
* కస్టమర్ల షాపింగ్ కోసం దాదాపు 7500 వస్తువులను ఐకియా స్టోర్‌ డిస్ ప్లేలో ఉంచనున్నారు.
* అన్నింటికంటే ఎక్కువగా అందరిని ఆకర్షిస్తోన్న అంశం.. ఈ స్టోర్‌లో దాదాపు 1000 రకాల వస్తువులు రూ.200 లోపే కస్టమర్లకు అందుబాటులో ఉండటం.
* కేవలం షాపింగ్ మాత్రమే కాదు, ఒకేసారి 1000మంది కూర్చొని తినగలిగే రెస్టారెంట్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేశారు.

ఐకియా సిబ్బంది ప్రత్యేకతలు
* స్థానిక కస్టమర్ల అభిరుచిని వారి కొనుగోలు సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు.. ఐకియా తమ ప్రతినిధులను స్వయంగా రంగంలోకి దింపింది.
* దాదాపు 1000 ఇళ్లకు వెళ్లిన ఆ ప్రతినిధులు.. వాళ్లు ఏం కోరుకుంటున్నారు?, ఎటువంటి వస్తువులను ఎక్కువగా కొనాలనుకుంటున్నారు? వంటి అంశాలను తెలుసుకున్నారు.
* ఐకియా స్టోర్లో దాదాపు 950మంది ఉద్యోగులు పనిచేయనున్నారు. మరో విశేషమేంటంటే.. సంస్థ పాలసీ ప్రకారం ఇందులో సగం మంది మహిళలు ఉన్నారు.
* ఈ ఒక్క ఏడాదిలోనే ఐకియా దాదాపు 60లక్షల మంది కస్టమర్లను తమ స్టోర్‌కి రప్పించాలని అంచాన వేస్తోంది.
* ఐకియా విక్రయించే ఉత్పత్తుల కోసం ఐదేళ్ల పాటు స్థానిక ముడిసరుకులనే సుమారు 30శాతం వరకు వాడనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IKEA India shopping cart  FDI  Jesper Brodin  CAGR  Euromonitor International  KPMG India  

Other Articles