"caste based politics are quite alarming" ఓట్ల కోసం కుల ప్రాతిపదికన విభజన: పవన్ కల్యాన్

Caste based politics are quite alarming pawan kalyan

pawan kalyan, janasena, west godavari, family dynasty, two families, chandrababu naidu family, YS Jagan family, caste leaders, kapus, BC's, caste voting majaority, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, pawan kalyan west godavari, Pawan Kalyan kostandhra yatra, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan who is in west godavari, says he is affrightened by the division of people on the basis of caste by political parties in the state, he says it is quite alarming to follow divide and rule policy

ఓట్ల కోసం కుల ప్రాతిపదికన విభజన: పవన్ కల్యాన్

Posted: 08/09/2018 08:34 PM IST
Caste based politics are quite alarming pawan kalyan

మనుషులను మనుషులుగా చూడడం మానేసి.. కులాలుగా విడిపోయామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రాజకీయ పార్టీ.. ప్రజలను కులాలుగా విభజించి.. విభజించి పాలించు అన్న సిద్దాంతాలను ఫాలో అవుతున్నాయని ఆయన మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ పలు కుల సంఘాలతో సమావేశమయ్యారు. కుల ప్రాతిపదికన మనుషులను విభజించడం తప్పని.. మానవత్వంతో మనుషులను చూడటమే మంచిదని ఆయన సూచించారు.

రాష్ట్రంలో కేవలం రెండు కుటుంబాల చేతిలోనే రాజకీయం ఉందని.. వారే రాజకీయాలను శాసిస్తున్నారన్నారు. తమ స్వలాభాల కోసం.. అధికార కాంక్ష కోసం ఈ రెండు కుటుంబాలే ప్రజలను కులాల పేరుతో విడదీసి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు పెట్టుబడి పెట్టాం కాబట్టి, అధికారం వచ్చేయాలన్న ధ్యాసతోనే చూస్తున్నారని విమర్శించారు. ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా బుగ్గకారులో వెళ్లాలన్న కోరిక అందరికీ ఉందని, కానీ, ఓపికగా రాజకీయాలు చేసే టైమ్ వారికి లేదన్నారు. సమాజాన్ని మనుషులుగా కాకుండా కులాలుగా చూస్తుంటే బాధేస్తోందన్నారు.

రిజర్వేషన్ల పేరుతో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. సమాజాన్ని ఎన్నిరకాలుగా కావాలంటే అన్ని రకాలుగా విడగొడుతున్నారని విమర్శించారు. బోయలను, మత్స్యకారులను ఎస్టీల్లో చేరుస్తామనడంతో అనంతపురం, ఉత్తరాంధ్రలో గొడవలు జరుగుతున్న అంశాన్ని ప్రస్తావించారు. సమాజంలో గొడవలు పెట్టి కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయని అన్నారు. జనసేనకు అధికారం ఇస్తే మన బతుకులు బాగుపడతాయన్న నమ్మకం ఉంటేనే తమకు ఓటేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles