narayanadri express arrival point to be changed soon వావ్.! ఇక తిరుపతి విజయవాడలకు వీళ్లు నేరుగా వెళ్లచ్చు..

Narayanadri superfast express to start from lingampally instead of sec bad

narayanadri super fast express, narayanadri express, tirupati-secundrabad, secundrabad-tirupati, tirupati-lingampally, lingampally-tirupati, vijayawada intercity, railway officials, lingampally railway station, kakinada express, goutami express, trains samachar, trian news, latest train updates

narayanadri super fast express heading towards tirupati to start from lingampally instead of secundrabad junction soon says railway officials, Along with narayandri, vijayawada intercity and few more trains also begin from lingampally railway station.

త్వరలో.. నారాయణాద్రి సహా ఆరు రైళ్లు అక్కడి నుంచే..

Posted: 08/09/2018 05:11 PM IST
Narayanadri superfast express to start from lingampally instead of sec bad

రైల్వే శాఖ నగరవాసులకు మరో శుభవార్త అందించింది. ఇప్పటివరకు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లేందుకు ఆ ప్రాంత నగరవాసులకు కేవలం రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైలు మాత్రమే అందుబాటులో వుండేది. కానీ త్వరలోనే ఇక నారాయణాద్రి రైలు కూడా వారికి అందుబాటులోకి రానుంది. కేవలం నారాయణాద్రి మాత్రమే కాదు.. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి మరో రెండు రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు వెలువరించిన నేపథ్యంలో త్వరలో ఇక్కడి నుంచి కొత్త రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

దీంతో ఇప్పటివరకు సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి నడుస్తున్న నారాయణాద్రి ఎక్స్ ప్రెస్‌, ఇక త్వరలో లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించినుంది. దీంతో పాటు విజయవాడ వెళ్లే ఇంటర్‌ సిటీ ఎక్స్ ప్రెస్‌ రైలు కూడా త్వరలోనే లింగంపల్లి నుంచి ప్రారంభం కానుంది. ఇక విజయవాడకు వెళ్లే లింగంపల్లి, పటాన్ చెరు, చందానగర్, గచ్చిబౌలి సహా ఆయాప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటి వరకు సికింద్రాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఇతర రైళ్లను అశ్రయించి బెజవాడకు చేరుకుంటున్నారు. ఇకపై ఈ బాధ తీరిపోనుంది. అయితే ఈ రైళ్లు ఎప్పటి నుంచి ఆరంభం కానున్నాయనేది త్వరలో రైల్వే అధికారులు వెల్లడించనున్నారు.

లింగంపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద మెయింటెన్స్‌ డిపో ఏర్పాట చేసి ఇప్పటికే ఇక్కడి నుంచి గౌతమీ, కొకనాడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆరంభించిన అధికారులు మరికోన్ని రైళ్లను కూడా ఇక్కడి నుంచి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా నారాయణాద్రి, ఇంటర్‌ సిటీ రైళ్ల పొడిగింపునకు నిర్ణయం తీసుకున్నారు. మరో రెండు రైళ్లను కూడా ఇక్కడ నుంచి ప్రాంభించడానికి అవకాశముందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మెయింటెన్స్‌ డిపోలో రెండు ట్రాక్‌లను ఏర్పాటుచేశారు. కొత్తగా మరో ట్రాక్‌ పనులు ఆరంభించారు.

ఈ క్రమంలో మెయింటెన్స్‌ డిపోలో మూడు ట్రాక్‌లపై ఉదయం మూడు, సాయంత్రం మూడు రైళ్లను సిద్ధంచేసి నడపడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇలా ఆరు రైళ్లను లింగంపల్లి రైల్వేస్టేషన్ నుంచే  నడిపించాలని అధికారులు యోచిస్తున్నారు. 3, 5 ప్లాట్ ఫాంల పొడిగింపు పనులకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో మెయిటెన్స్‌ డిపోకి సంబంధించిన ట్రాక్‌, ప్లాట్ ఫాంల పొడిగింపు పూర్తయితే కొత్త రైళ్లు నడవడానికి, ప్రయాణికుల సమస్యలు తీరడానికి అవకాశముంది. దీంతో చందానగర్, మియాపూర్, కేపిహెచ్బీ కాలనీల వద్ద రాత్రివేళ్లలో అపే టూరిస్టు బస్సుల సంఖ్యతో పాటు ట్రాపిక్ జామ్ లకు కూడా చెక్ పడుతుందని అభిప్రాయాలు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles