Tamil boozers throng liquor shops in nellore కరుణానిధి మరణంతో.. రైలెక్కిన తమిళ తంబీలు..

Tamil nadu boozers throng liquor shops in border mandals of ap

Tamil Nadu, Karunanidhi, Last Rites, boozers, TNSMCL, Liquor Shops, Nellore, Tada, Sullurpet, buses, trains, Excise officials, Andhra Pradesh

Even as last rites were being conducted in Chennai to the departed DMK Chief M Karunanidhi, liquor shops were closed in the state and thousands of boozers thronged border mandals of Andhra Pradesh such as Tada and Sullurpet

ఆయన మరణంతో.. ‘కరుణ’ లేక కొందరు.. ఇలా రైలెక్కి

Posted: 08/09/2018 03:39 PM IST
Tamil nadu boozers throng liquor shops in border mandals of ap

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం పరమపదించారు. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న ప్రభుత్వం ప్రజలు ఎలాంటి అందోళనకు, ఉద్వేగానికి గురికాకుండా.. ఎలాంటి విపరీత చర్యలకు పాల్పడకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా మద్యం దుకాణాలను మూసివేయాలని అదేశాలను జారీ చేస్తూ.. ఈ అదేశాలను తక్షణం అమలుపర్చాలని అటు పోలీసు ఇటు ఎక్సైజ్ శాఖలకు అదేశాలిచ్చింది. దీంతో కరుణానిధి మరణంతో తమిళ తంబీలు రైలు, బస్సులలో తరలివచ్చారు.

చెన్నైలోని మెరినా బీచ్ అనుకుంటే పొరబాటే.. తమిళనాడు సరిహద్దులో వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోకి వచ్చారు. కరుణానిధి అంత్యక్రియలు బుధవారం జరుగుతున్న క్రమంలో వారు రైళ్లనున, బస్సులను ఆశ్రయించి ఏపీకి వచ్చారు. ఎందుకంటే.. మాజీ సీఎం కరుణానిధి మరణంతో అక్కడి మధ్యం దుకాణాలన్నీ రెండు రోజుల పాటు బంద్ చేశారు. దీంతో పిడుగులాంటి వార్తను జీర్ణం చేసుకోవాలంటే మద్యం పడాల్సిందేనంటూ కొందరు కరుణనిధి అస్తమించిన ధుఖంలో మద్యం సేవించారు.

ఇక మరికోందరు మాత్రం కరుణానిధి అంశాన్ని పక్కనబెట్టి.. మందులేనిదే వుండలేమని.. చుక్క పడకపోతే పూట గడవదన్నట్లుగా నెల్లూరుకు బారులు తీరారు. తమిళ తంబిల రాకతో జిల్లాలోని తడ, సూళ్లూరుపేట మద్యం షాపులకు పండగే అయ్యింది.  దీంతో సూళ్లూరుపేట, తడలోని మద్యంషాపులన్నీ కిటకిటలాడిపోయాయి. అంతేకాదు వీరి రాకతో చెన్నై నుంచి సూళ్లూరుపేటకు వచ్చే ప్రతి సబర్బన్‌ రైలు మందుబాబులతో కిటకిటలాడిపోయింది.

చెంగాళమ్మ తిరునాళ్లకు వచ్చినట్లు తమిళనాడు నుంచి రైళ్లల్లో మందుబాబులు విచ్చేయడం విశేషం. దీంతో మద్యం దుకాణాల వద్ద ఏమి జరుగుతుందోనని  ప్రజలు చర్చించుకున్నారు. అయితే మద్యం ప్రియులు దానిని అస్వాదించడం కోసం ఎక్కడికైనా వెళ్తారనేందుకు ఇదే ఉదాహరణ. అలాగే తమిళనాడులో హోటళ్లు సైతం మూసివేయటంతో గుమ్మిడిపూడి నుంచి లారీల్లో జనం తడలోని హోటళ్లకు ఎగబడ్డారు. తొలుత మద్యం షాపులు, హోటళ్ల ముందు సందడిని చూసి ఆశ్చర్యపోయిన ప్రజలు చివరికి విషయం తెలుసుకుని నవ్వుకున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  Karunanidhi  Last Rites  boozers  TNSMCL  Liquor Shops  Nellore  Tada  Sullurpet  buses  trains  Excise officials  AP  

Other Articles