Mob attack police personnel at Nellore పోలీసు స్టేషన్ పై స్థానికుల దాడి.. ఎసైకి గాయాలు..

Locals attack police station in andhra pradesh s nellore

Nellore, Rapuru Police Station, B Lakshman, locals thrash police, andhra pradesh, crime

A sub-inspector along with other police personnel were beaten up by locals inside the police station in Andhra Pradesh's Nellore district for allegedly torturing a youth who was in custody.

ITEMVIDEOS: పోలీసు స్టేషన్ పై స్థానికుల దాడి.. ఎసైకి గాయాలు..

Posted: 08/02/2018 11:30 AM IST
Locals attack police station in andhra pradesh s nellore

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు స్టేషన్లపై స్థానికులు దాడి చేయడం సాధారణంగా మారిందా.? అంటే అవునన్న సంకేతాలే వినబడుతున్నాయి. మొన్న గుంటూరు జిల్లాలోని రిక్లా కార్మికుడు పసిపాపపై అత్యాచారం చేసిన ఘటనతో పాటు అలాంటి ఘటనలోనే మరోచోట కూడా ఇలాంటి దాడులు చవిచూశఆయి. ఇక తాజాగా నెల్లూరు జిల్లా రాపూర్ పోలీస్ స్టేషన్ పై స్థానికులు దాడి చేశారు. అయితే ఈ కేసులో పోలీసుల అతి వుందని కొందరు వాదిస్తుండగా, మరికోందరు మాత్రం స్థానికులదే తప్పని అంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా రాపూరులో పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ లో రమేష్ అనే యువకుడు పట్టుపడ్డాడు. అయితే కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పోలీసులు సదరు యువకుడి కొట్టడంపై అతని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. స్టేషన్లో ఉన్న ఎస్సై లక్ష్మణరావుతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ల పైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రాణభయంతో సెల్ లో దాక్కున్న ఎస్ఐను బయటకు లాక్కొచ్చి మరీ దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణరావును, కానిస్టేబుళ్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా, పోలీసులు తనను కొట్టడాన్ని అవమానంగా భావించిన రమేష్, ఈ విషయాన్ని తమ బంధువులకు, స్నేహితులకు, గ్రామస్తులకు చెప్పడంతో వాళ్లందరూ కలిసి స్టేషన్ పై దాడికి పాల్పడ్డారని సమాచారం. సుమారు మూడు వందల మందికి పైగా స్టేషన్ పై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ సమాచారం తెలుసుకున్న ఉన్నత పోలీస్ అధికారులు అదనపు పోలీస్ బలగాలను రాపూర్ పోలీస్ స్టేషన్ వద్దకు పంపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nellore  Rapuru Police Station  B Lakshman  locals thrash police  andhra pradesh  crime  

Other Articles