Bombay High court pulls up FinMin over DRT కేంద్ర విత్త మంత్రి నిద్రపోతున్నారా.? బాంబే హైకోర్టు అక్షింతలు

Drt office is union finmin sleeping asks bombay high court

Bombay High Court, Debts Recovery Tribunal, DRT case, Union Finance Minister, Scindia House, Ballard Estate, Abhay Oka, Riyaz Chagla, financial capital, Union Government, South Mumbai, Navi Mumbai

The Bombay high court rapped the Union Finance Minister over not providing an alternative office space to the Debts Recovery Tribunal (DRT), which was shifted following a fire that broke out in its office located at Scindia House in Ballard Estate earlier in June.

కేంద్ర విత్త మంత్రి నిద్రపోతున్నారా.? బాంబే హైకోర్టు అక్షింతలు

Posted: 07/24/2018 10:14 AM IST
Drt office is union finmin sleeping asks bombay high court

ఇప్పటికే అప్పుగా ఇచ్చిన రుణాలను పోందిన బడాబాబులు దేశం దాటి వెళ్లిపోతున్న నేపథ్యంలో.. వారు విదేశాలకు ఎలా తరలివెళ్తున్నారన్న విమర్శల వెల్లువెత్తి కేంద్ర ప్రభుత్వం అప్రతిష్టను మూటగట్టుకుంటుంది. ఈ తరుణంలో రుణాలను రికవరీ చేసే ట్రిబ్యూనల్ గత జూన్ నెల నుంచి పనిచేయకపోవడంతో దాఖలైన పిటీషన్ ను విచారించిన బాంబే హైకోర్టు కేంద్రం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దేశంలో అసలు అర్థిక మంత్రి ఉన్నారా.. ఉంటే ఆయన నిద్రపోతున్నారా? అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది.

జూన్ 2న‌ ద‌క్షిణ ముంబైలోని బ‌లార్డ్ ఎస్టేట్ వ‌ద్ద ఉన్న ఓ భ‌వ‌నంలో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. డీఆర్ టీ కార్యాల‌యం కూడా ఈ భ‌వ‌నంలోనే ఉంది. అగ్నిప్ర‌మాదం కార‌ణంగా డీఆర్ టీని మూసివేశారు. అప్ప‌టినుంచి కేంద్రం డీఆర్ టీకీ మ‌రో భ‌వ‌న‌మేదీ కేటాయించ‌లేదు. దీనిపై డీఆర్ టీ బార్ అసోసియేష‌న్ బాంబే హైకోర్టును ఆశ్ర‌యించింది. ద‌క్షిణ ముంబైలో ట్రిబ్యున‌ల్ కు  మ‌రో భ‌వ‌నం కేటాయించేలా కేంద్రానికి ఆదేశాలివ్వాల‌ని త‌న పిటిష‌న్ లో కోరింది. ఈ పిటిష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన జ‌స్టిస్ ఏ ఎస్ ఓకా, జ‌స్టిస్ రియాజ్ చాగ్లాతో కూడిన ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

డీఆర్ టీ కోసం ప్ర‌త్యామ్నాయ భ‌వనాన్ని కేంద్ర‌ప్ర‌భుత్వం ఎప్పుడు గుర్తిస్తుందో తెలుసుకోవాల‌నుకుంటున్నామ‌ని వ్యాఖ్యానించింది. స‌మ‌స్య త‌మ దృష్టికి రాక‌ముందే, ఆదేశాలు ఇవ్వ‌క‌ముందే.. కేంద్ర‌ప్ర‌భుత్వం తనకు తానుగా ఈ ప‌నిచేసి ఉండాల్సింద‌ని జ‌స్టిస్ ఓకా అన్నారు. దేశ ఆర్ధిక రాజ‌ధానిలో రుణాల రిక‌వ‌రీ ట్రైబ్యున‌ల్ కార్యాల‌యం మూసి ఉందంటే ఆర్ధిక మంత్రి నిద్రపోతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 25కు వాయిదా వేసిన హైకోర్టు అప్ప‌టిలోగా ట్రైబ్యున‌ల్ కు మ‌రో భ‌వ‌నం కేటాయించాల‌ని ఆదేశించింది. బ్యాంకులు, ఇత‌ర ఆర్థిక సంస్థ‌ల నుంచి రుణాల ఎగవేతదారులకు సంబంధించిన ఫిర్యాదులను డీఆర్ టీ ప‌రిశీలిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles