తన పనుల్లో తాను నిమగ్నమై వుండగా, ఓ వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి జారుకుంటున్న నేపథ్యంలో అతడికి ఎదురొడ్డి నిలచి అటాకాయించి బుద్దిచెప్పిన మహిళ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి ప్రశంసలను అందుకుంటుంది. ఆమె ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. తాము గౌరివించినంత సేపే మహిళమని, ఎదురుతిరుగితే అపర కాళీకాదేవీలం అవుతామని ఓ మహిళ చూపించిన ధైర్యసాహసాలు…. ఆడవాళ్లను టచ్ చేయాలనుకునే వారి గుండెళ్లో గుబులు పుట్టిస్తుంది.
అమెరాకాలోని ఓ రెస్టారెంట్ లో జరిగిన ఓ ఘటన తాలుకు దృష్యాలు అక్కడే వున్న సీసీటీవీలలో నిక్షిప్తమయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది.? ఎప్పుడు.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని సావన్నాలో విన్నీ వాన్ గోగో రెస్టారెంట్ లో ఓ వెయిట్రెస్ కస్టమర్లకు సర్వ్ చేస్తున్న సమయంలో ఓ కస్టమర్ ఉద్దేశ్యపూర్వకంగానే వెయిట్రస్ వెనుక టచ్ చేసుకుంటూ వెళ్లాడు. ఎదో తాకినట్లు అనిపించిన అమె వెంటనే వెనక్కు తిరిగి చూసింది. ఒక వ్యక్తం రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్తూ.. అమెను తాకరాని చోట తాకినట్లు గుర్తించింది.
వెంటనే స్పందించిన అమె.. ఏమీ జరగనట్టు బయటకు వెళ్లిపోతున్న ఆయనవెళ్లి అతడి వెనక్కి లాగి కిందపడేసి చితక్కొట్టింది. చేసేందేం లేక ఆమె చేతిలో దెబ్బలు తింటూ చూస్తూ ఉండిపోయాడు ఆ వ్యక్తి. ఆ సమయంలో అతడి భార్యా, పిల్లలు కూడా రెస్టారెంట్ లో ఉన్నారు. పక్కనే భార్యా, పిల్లలను పెట్టుకొని కూడా ఇంత నీచంగా ప్రవర్తిస్తావా అంటూ అక్కడున్న వారందరూ కూడా అతడిని తిట్టిపోశారు. జూన్-30, 2018న జరిగిన ఈ ఘటనంతా రెస్టారెంట్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. సీసీ పుటేజి ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆ యువతి దైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more