Rahul attacks Modi govt on several fronts అవిశ్వాస చర్చ: రాఫెల్ ప్రకంపనలు సృష్టించిన రాహుల్

Bjp s rakesh singh speaks in lok sabha on no confidence motion

no trust vote, no confidence motion, Raffle scam, Rahul gandhi, PM Modi, Sumitra Mahajan, BJP, france president, reliance, Rakesh Singh, congress, TDP, galla jayadev, kesineni nani, APSPS, special status, Andhra pradesh, NDA

Congress president Rahul Gandhi attacked PM Modi-led NDA government on several fronts including demonetisation, Goods and Services Tax (GST), unemployment, Rafale deal during a debate on the No-Confidence Motion in Lok Sabha

అవిశ్వాస చర్చ: రాఫెల్ ప్రకంపనలు సృష్టించిన రాహుల్ గాంధీ

Posted: 07/20/2018 03:20 PM IST
Bjp s rakesh singh speaks in lok sabha on no confidence motion

గుజరాత్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఊటంకిస్తూ.. ఇవాళ తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం నేపథ్యంలో ఆయనకు తగినంత సమయం లభిస్తుంది.. అయనెలా భూ ప్రకంపనలను సృష్టిస్తారన్నది వేచిచూస్తామని వ్యంగంగా వ్యాఖ్యానించిన బీజేపి ఎంపీల నోట్లో పచ్చి వెలక్కాయ పడేట్లు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు. మునెపెన్నడూ లేని విధంగా ఎన్డీయే ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం తనకు తాను మిస్టర్ క్లీన్ ప్రభుత్వంగా చెప్పుకుంటున్నా.. అవినీతి కుంభకోణాల అంశాలు వెలుగుచూసినా పట్టించుకోవడం లేదని నిండు సభలో అరోపణలు గుప్పించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహాదా కల్పించాలన్న డిమాండ్ తో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై చర్చ సందర్భంగా మాట్లాడిన రాహుల్.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగంలో అవేదన అర్థమయ్యిందని అదే సమయంలో బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ ల ప్రసంగం కూడా ఆసక్తికరంగా కొనసాగిందని అన్నారు. గల్లా ప్రసంగాన్ని జాగ్రత్తగా విన్నానని, ఆయన మాటల్లో ఆవేదన కనిపించిందని చెప్పారు. 21వ శతాబ్దపు రాజకీయ బాధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. అంధ్రప్రదేశ్ ప్రజలపై మోడీ ప్రభుత్వం.. 21వ శతాబ్దపు అత్యంత పదునైన అయుధంతో దాడి చేసిందని దాని పేరు జుమ్లా దాడి అని ఆయన విమర్శించారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఏపీ ప్రజలను మాత్రమే కాకుండా, దేశ ప్రజలందరినీ మోసం చేస్తోందని మండిపడ్డారు. లోక్ సభలో మాట్లాడుతూ, రాహుల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. మోదీలాంటి గారడీ మాటలతో దేశప్రజలందరినీ తన బుట్టలో వేసుకున్నారని.. ఇలాంటి గారఢి చేసే వ్యక్తి మరెవరూ లేరని విమర్శించారు. మోదీ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఆయన గారడీ దాడులతో దేశ రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని అరోపించారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకువచ్చి దేశప్రజల ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పి, మాట తప్పారని అన్నారు.

ఇక దేశంలోని యువతకు ప్రతీ ఏఢాది 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీని ఇచ్చి గత ఎన్నికల ముందు వారిని కూడా వాడుకున్న బీజేపి.. వారిని కూడా నిండా ముంచేసిందని రాహుల్ దుయ్యబట్టారు. నోట్ల రద్దుతో కేంద్రం తమను తీవ్రంగా గాయపర్చిందని స్వయంగా ప్రధాని సొంతరాష్ట్రం వ్యాపారులే తనతో చెప్పారని అన్నారు. ఏమాత్రం ఆలోచన లేకుండానే నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు. జీఎస్టీతో భారత అర్థిక వ్యవస్థకు లక్షల కోట్ల రూపాయాలలో నష్టం వాటిల్లగా, ప్రధాని అనాలోచిత, అతృతగా తీసుకున్న విధానం వల్ల భయటపడింది మాత్రం కేవలం 16 వేల కోట్ల రూపాయలేనని అన్నారు.

జీఎస్టీ విధానాన్ని తమ యూపిఏ ప్రభుత్వం హాయంలో అమలు పర్చేందుకు చర్యలు చేపట్టగా, అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఇప్పటి ప్రధాని నరేంద్రమోడీ.. దానిని తీవ్రంగా వ్యతిరేకించారని రాహుల్ చెప్పారు. కాగా, మోదీ అధికారంలోకి రాగానే జీఎస్టీపై ఎలాంటి అవగాహన లేకుండా ఏకంగా ఐదు జీఎస్టీలను తీసుకువచ్చి దేశప్రజలపై రుద్దారని విమర్శించారు. ఇక రాహుల్ తన ప్రసంగంలో రాఫెల్ కుంభకోణం అంశాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో బీజేపి సభ్యులు అడ్డుతగిలారు. దీంతో ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. నిజాలను విని భయపడకండి, పది, పదిహేను మంది వ్యాపారవేత్తల కోసం బ్యాంకుల ద్వారా రూ.2.5 లక్షల కోట్లు మాఫీ చేయించారని తీవ్ర ఆరోపణలు చేశారు.

రాఫెల్ కుంభకోణం విషయమై మాట్లాడుతూ.. ఈ విషయంలో అర్టీఐ కార్యకర్తలు వివరాలు కోరితే దేశ భద్రతకు సంబంధించిన అంశంలో పలు విషయాల్లో గోప్యత అవసరమని ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిందని.. అయితే ఇదే విషయాన్ని తాను స్వయంగా ఫ్రాన్స్ దేశాధ్యక్షుడితో చర్చించగా ఈ విషయంలో ఎలాంటి దాపరికం లేదని, అన్ని విషయాలను స్వేఛ్చగా దేశ ప్రజలకు చెప్పవచ్చునని అన్నారని రాహుల్ తెలిపారు. అయితే ఈ డీల్ లో కొందరు పారిశ్రామికవేత్తలకు లబ్ది చేకూర్చేందుకు తెరలేసిందని రాహుల్ అరోపించారు. అయితే దీనిపై రక్షణ శాఖా మంత్రి నిర్మాలా సీతారమన్ అక్షేపించారు.

దేశంలో మహిళలకు రక్షణ లేదని భారతదేశం గురించి తొలిసారి ప్రపంచం అనుకుంటోందని అన్నారు. సామూహిక అత్యాచారాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని, మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నామని, ప్రపంచం ముందు చులకనవుతున్నామని అన్నారు. ఇలాంటి పరిస్థితి దేశ చరిత్రలో ఎన్నడూ లేదని, దేశ ప్రజలు రక్షణ కోల్పోతున్నా ప్రధాని మోదీ భరోసా ఇవ్వలేరా? ఇన్ని జరుగుతున్నా ప్రధాని నోటి నుంచి ఒక్కమాట కూడా బయటకు రాదని మండిపడ్డారు.

ఎక్కడ, ఎటువైపు చూసినా దేశంలో ఎవరో ఒకరు అణచివేతకు గురవుతున్నారని, ఇలాంటి పరిణామాలు దేశానికి గౌరవాన్ని పెంచవని రాహుల్ అన్నారు. వీటన్నింటిపైనా మోదీ మనసులో ఏముందో ప్రజలకు చెప్పాలని, ప్రధాని, అమిత్ షా ఇద్దరూ ప్రత్యేక తరహాకు చెందిన రాజకీయ నాయకులేనన్న రాహుల్, తాము అధికారంలో ఉన్నా లేకున్నా ఉండగలం కానీ, అధికారం లేకపోతే ప్రధాని మాత్రం బతకలేరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షాలిద్దరూ ఇతరులెవరినీ మాట్లాడనీయరని, భయపెడతారని, ప్రతిపక్షంలో భయం లేదని, అధికార పక్షంలోనే భయం ఉందని వ్యాఖ్యానించారు.

మోదీ, ఆయన పరివారం ఓడిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రధాని, ఆర్ఎస్ఎస్ కలిసి దేశ ప్రజలకు కాంగ్రెస్ అవసరాన్ని మరింత పెంచారని, తామేమి చేయాలన్న అంశంపై మరింత స్పష్టత ఇచ్చారని, ఇంత గొప్ప సాయం చేసినందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీలకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నేనంటే మీకు ద్వేషం, కోపం, శత్రుత్వం వున్నాయి. నేను మీకు అసమర్ధుడిని, పప్పుని.. మీరేమైనా అనుకోండి. మీరేమైనా అనండి.. నాకు మీపై కించిత్తు ద్వేషం గానీ, అసూయ గానీ లేవు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles