galla jayadev comments objectionable:TRS అవిశ్వాసంపై చర్చ: టీఆర్ఎస్ సభ్యుల అభ్యంతరం

Trs object tdp mp galla jayadev comments on state bifurcation

TRS, galla jayadev, jitender reddy, ap special status, no confidence motion, congress, TDP, TRS, Sumitra Mahajan

TRS MPs objected TDP MP galla jayadev comments on state bifurcation, stating bifurfication is undemocratic

అవిశ్వాసంపై చర్చ: టీఆర్ఎస్ సభ్యుల అభ్యంతరం

Posted: 07/20/2018 01:12 PM IST
Trs object tdp mp galla jayadev comments on state bifurcation

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారంటూ లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. రాజ్యాంగ విరుద్ధంగా, అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన జరిగిందని గల్లా జయదేవ్ వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని ఈ వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో గల్లా వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, లోక్ సభ, రాజ్యసభలలో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపిలు కలసి రాష్ట్ర విభజన బిల్లు ఆమోదించాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని... ఈ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీని, బీజేపీని తాము ఒప్పించామని... తదనంతరం పార్లమెంటు ఉభయసభల్లో బిల్లు పాస్ అయిందని చెప్పారు. గల్లా జయదేవ్ వ్యాఖ్యలు పార్లమెంటు నిండు గౌరవాన్ని అభాసుపాలు చేసేలా వున్నాయని మండిపడ్డారు.

ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా, అశాస్త్రీయంగా జరిగిందని ఎలా అంటారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను డిమాండ్ చేశారు. 2014లో పార్లమెంట్ తలుపులు మూసేసి, నిర్దయగా విభజించారని గల్లా జయదేవ్ ఆరోపించారు. ఆ సమయంలో కాంగ్రెస్ సభ్యులు జయదేవ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయగా, స్పీకర్ వారించారు. ఆ సమయంలో టీఆర్ఎస్ సభ్యులు కూడా కాంగ్రెస్ ఎంపీలకు మద్దతు పలకడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. స్పీకర్ టీఆర్ఎస్ ఎంపీలకు తరువాత అవకాశం ఇస్తామని చెప్పడంతో సభ్యులు శాంతించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  galla jayadev  jitender reddy  ap special status  no confidence motion  congress  TDP  TRS  Sumitra Mahajan  

Other Articles