Rajya Sabha passes amendments to anti-graft law అవినీతి వ్యతిరేక సవరణ బిల్లుకు రాజ్యసభ అమోదం

Rajya sabha passes amendments to anti graft law that would make giving bribes an offence

Rajya Sabha, Prevention of Corruption Act, Corruption, government officials, bribe givers, BJP, amendment bill, India, nation

The Rajya Sabha passed amendments to the Prevention of Corruption Act, 1988, which will make giving bribes to a public servant an offence. The amendment bill had been first floated in 2013, by the Congress-led government at the Centre

ప్రభుత్వాధికారులకు లంచం ఇవ్వజూపినా ఏడేళ్ల జైలు..!

Posted: 07/20/2018 10:59 AM IST
Rajya sabha passes amendments to anti graft law that would make giving bribes an offence

ప్రభుత్వ కార్యాలయాల్లో తమ పనులు చకచకా జరుకునేందుకు కొందరు అక్రమార్కులు బల్ల కింద చేయ్యి పెట్టే అలవాటు వున్న కొందరు అధికారులకు నిర్మోహమాటంగా కాసులను అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విధానాలు చెల్లాయి కానీ.. ఇకపై మాత్రం చెల్లవు. ఎందుకంటారా.. ఇప్పటి వరకు ప్రభుత్వాధికారులు లంచం పుచ్చుకోవడం మాత్రమే నేరం. కానీ ఇప్పుడు లంచం ఇవ్వడం కూడా నేరమే. ఈ మేరకు అవినీతి నిరోధక చట్టానికి చేసిన సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.

అవినీతి నిరోధక చట్టంలో కొన్ని నిబంధనలను సవరిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభ మూజువాణి పద్ధతిలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. సవరించిన చట్టం ప్రకారం.. ఇకపై లంచం ఇచ్చే వారిని కూడా నేరస్తులుగానే పరిగణిస్తారు. గరిష్టంగా ఏడేళ్లు, కనిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. వ్యక్తులు, సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. అవినీతి కేసుల్లో సత్వర విచారణతోపాటు, దుర్బుద్ధితోచేసే ఫిర్యాదుల నుంచి పదవీ విరమణ చేసిన అధికారులకు రక్షణ కల్పించేందుకు బిల్లులో కొన్ని సవరణలు చేశారు.

లంచం ఇచ్చే విషయంలోనూ కొన్ని మినహాయింపులు ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో లంచం ఇవ్వాల్సి వస్తే, అది జరిగిన ఏడు రోజుల లోపు విచారణ సంస్థలకు సమాచారం అందించవచ్చు. తద్వారా శిక్ష నుంచి బయటపడవచ్చు. ఈ గడువును మరింత పెంచాలని కేంద్రం యోచిస్తోంది. కాగా, బిల్లుకు ఆమోద ముద్రపడిన అనంతరం కేంద్రమంత్రి జితేంద్రసింగ్ మాట్లాడుతూ దీనినో చారిత్రక బిల్లుగా అభివర్ణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajya Sabha  Prevention of Corruption Act  Corruption  bribe givers  BJP  amendment bill  India  nation  

Other Articles