another call money case in vijayawada విజయవాడలో మళ్లీ బుసకొట్టిన ‘‘కాల్ మనీ’’ విషనాగు

Another call money case borrower hospitalised after lender demands high interest

vijayawada, call money case, canteen nagar, israiel, soma gopala krishna murthy, money lender, vijayawada police commissioner, ajithsingh nagar police station, crime

another call money case shocks localites as barrower hospitalised suffering cardiac arrest, after lender demanding 500 times interest and principle amount.

విజయవాడలో మళ్లీ బుసకొట్టిన ‘‘కాల్ మనీ’’ విషనాగు

Posted: 07/16/2018 12:49 PM IST
Another call money case borrower hospitalised after lender demands high interest

అంధ్రప్రదేశ్ లో మరోమారు కాల్ మనీ రక్కసి బుసలుకొట్టింది. అధికారుల లెక్కలు అడిగినప్పుడు.. లేక అదాయశాఖకు లెక్కలు చూపినప్పుడో తమది ధర్మ వ్యాపారమని కట్టుకధలు చెప్పే కాల్ మనీ కేటుగాళ్లు.. తమ వద్ద డబ్బును అప్పుగా తీసుకున్న వారిపై మాత్రం అమాంతం భారీగా వడ్డీ వేసి.. అది కట్టినా.. ఏదో ఒక సాకు చెప్పి.. చక్రవడ్డీ, దానిపై మరో వడ్డీ ఇలా వడ్డీలపై వడ్డీలు వేస్తూ తామిచ్చిన సొమ్ముకు పది నుంచి పదిహేను వందల శాతం అధికంగా ధనాన్ని రాబుడుతున్నారు.

ఇక పేదలు ఎలాగో తమ వడ్డీ రేట్లకు గిలగిలలాడిపోవడం సహజమని తెలిసిన వడ్డీ వ్యాపారులు వారి ఇళ్లు, పోలాలపై గురిపెట్టి వాటిని అప్పనంగా కాజేయాలని చూస్తూనే ఇలాంటి ఎత్తులు వేస్తున్నారు. తాజాగా విజయవాడలో వడ్డీ వ్యాపారి ఓ వృద్ద దంపతులపై దాడి చేసిన నేపథ్యంలో వడ్డీని తీసుకున్న ఇజ్రాయిల్ అనే వ్యక్తి గుండెపోటుకు గురై ప్రైవేటు అస్పత్రిలో చికిత్స పోందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని క్యాంటీన్ నగర్ పరిథిలో నివసరించే ఇజ్రాయిల్ దంపతులు స్థానికంగా నివసించే సామ గోపాలకృష్ణ మూర్తి అనే వడ్డీ వ్యాపారి వద్ద 2009లో రెండు లక్షల రూపాయలను పది రూపాయల వడ్డీకి అప్పుతీసుకున్నారు.

ఆ తరువాత నుంచి ప్రతీ నెలా వడ్డీ కడుతూవస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఇజ్రాయిల్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో వడ్డీ సక్రమంగా కట్టలేకపోయాడు. దీంతో వడ్డీ వ్యాపారి మూర్తి నేరుగా వృద్ద దంపతుల ఇంటికి వచ్చి వారిని డబ్బులు కట్టాలని బెదిరించి దాడికి కూడా పాల్పడాడని బాధిత ఇజ్రాయిల్ భార్య అరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వారు ఏకంగా పోలీస్ కమీషనర్ కార్యాలయానికి వెళ్లి పిర్యాదు చేయగా, వారు అక్కడి నుంచి అజీత్ నగర్ పోలిస్ స్టేషన్ కు పిర్యాదును దర్యాప్తు చేయాల్సిందే అదేశాలిస్తూ బాధిత దంపతులను అక్కడికి పంపారు.

అయితే అజీజ్ నగర్ పోలీసులు మాత్రం వృద్ద దంపతుల పిర్యాదుపై సక్రమంగా స్పందించలేదని కూడా బాధిత మహిళ అరోపిస్తున్నారు. వడ్డీ వ్యాపారితో రాజీ కుదుర్చుకోవాలని పోలీసులు తమకు సముదాయించే ప్రయత్నం చేశారే తప్ప.. అతనిపై కేసు పెట్టే పనులు చేయలేదని, దీంతో తీవ్ర మనోవేదనకు గురైన తన భర్త గుండెపొటుకు గురై ప్రస్తుతం అసుపత్రిలో చికిత్స పోందుతున్నాడని బాధిత మహిళ చెప్పారు. కాల్ మనీపై ఉక్కుపాదం మోపుతామన్న పోలీసులు.. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. వడ్డీ వ్యాపారులు పేదల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijayawada  call money case  canteen nagar  israiel  soma gopala krishna murthy  money lender  crime  

Other Articles