NCW lauds Maneka's proposal on PAN card option మంత్రి ప్రతిపాదనను స్వాగతించిన జాతీయ మహిళా కమీషన్

Ncw lauds maneka gandhi s proposal on pan card option for single mothers

children of single parents,finance ministry,Income Tax Department,India,Maneka Gandhi,Ministry for Woman and Children Development,Ministry of External Affairs,Ministry of Human Resource Development, PAN card,Permanent account number,Piyush Goyal,Prakash Javadekar,Priyanka Gupta,Single mothers,Single parents,sushma swaraj

The NCW and several women activists today welcomed the Women and Child Development (WCD) Ministry's proposal letting children of single mothers apply for a PAN card without mentioning the name of their fathers.

మేనకాగాంధీ ప్రతిపాదనను స్వాగతించిన జాతీయ మహిళా కమీషన్

Posted: 07/11/2018 02:49 PM IST
Ncw lauds maneka gandhi s proposal on pan card option for single mothers

తల్లి మాత్రమే ఉన్న పిల్లలకు పాస్ పోర్టు తరహాలోనే పాన్‌ కార్డుకు కూడా నిబంధనలు తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. తండ్రి పేరు నమోదు చేయకుండానే ఒంటరి తల్లుల పిల్లలు పాన్‌ కార్డును దరఖాస్తు చేసుకునేలా మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహిళా కార్యకర్తలు, జాతీయ మహిళా కమిషన్‌ స్వాగతించాయి. ఈ మేరకు ఆ శాఖ మంత్రి మేనకా గాంధీ.. తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్ కు లేఖ రాసినట్టు సమాచారం.

విడాకులు తీసుకున్న తల్లులు లేదా బిడ్డలను దత్తత తీసుకున్న ఒంటరి తల్లుల విషయంలో పాన్‌ కార్డులో తండ్రి పేరు తొలిగించే అవకాశాన్ని కల్పించాలని ఆమె కోరారు. జూలై 6న గోయల్ కు లేఖ రాశారు. ఒంటరి తల్లుల విషయంలో సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, పలు ప్రభుత్వ అథారిటీల ముందు సమర్పించే దరఖాస్తుల్లో వారి మాజీ భర్తల పేర్లను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా అవకాశం కల్పించడం ఎంతో ముఖ్యమని మేనకా గాంధీ చెప్పారు. అంతేకాక తల్లులు దత్తత తీసుకుని పెంచే పిల్లలకు తండ్రి ఉండరని, అలాంటి కేసుల్లో కూడా తండ్రి పేరు అవసరం లేకుండా పాన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

మహిళల్లో సాధికారికత కల్పించడానికి దీన్ని ముందస్తుగానే అమలు చేయాల్సి ఉందని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌‌పర్సన్‌ రేఖా శర్మ అన్నారు. ఇది చాలా ప్రగతిశీలమైనదన్నారు. ప్రస్తుతం ఇది చాలా మంచి నిర్ణయమని శర్మ అభివర్ణించారు. ఓ పురుషుడితో మహిళలు తమను తాము గుర్తింపు పొందాల్సిన అవసరం లేదని, వారికి సాధికారత కల్పించే విషయాన్ని ఎంతగానో స్వాగతించాల్సిన విషయమని పేర్కొన్నారు.

సీనియర్‌ సీపీఐ లీడర్‌, సామాజిక కార్యకర్త అన్నీ రాజా కూడా ఈ ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేశారు. పాన్‌ కార్డు పొందడానికి ఇబ్బందులు పడుతున్న చాలా మంది పిల్లలకు ఇది ఎంతో సహకరిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పాన్‌ కార్డు దరఖాస్తు చేసుకునేటప్పుడు తండ్రి పేరు నమోదు చేయడం తప్పనిసరి. దీన్నే గుర్తింపు కార్డుగా కూడా భావిస్తున్నారు. తండ్రి పేరు నమోదు చేయడంపై వెసులుబాటు కల్పిస్తే.. ఒంటరి తల్లులు ఎదుర్కొనే చాలా సమస్యలను ఇది పరిష్కరిస్తుందని మహిళా హక్కుల కార్యకర్త మరియం ధవాలే చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maneka Gandhi  Women's Commission  NCW. PAN card  single mothers  fathers name  

Other Articles