Cell Phone driving leads to accident in Bahadurpura వైరల్ వీడియో: డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్.. వద్దు

Caught on cam cell phone driving leads to a major mishap

Cell Phone driving leads to accident, Caught on cam, cell phone driving, khaja mohinuddin, traffic rules violation, helmet, major mishap, accident, trauma, brain dead, smart phone, bahadurpura, hyderabad, viral video, video viral, crime

A 35-year-old man riding a two-wheeler crashed into another two-wheeler in bahadurpura of Hyderabad. The incident took place, when he was trying to move his motorcycle on to the wrong side of the road while talking on cell phone, who have declared brain dead.

ITEMVIDEOS: వైరల్ వీడియో: డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్.. వద్దు

Posted: 07/11/2018 11:03 AM IST
Caught on cam cell phone driving leads to a major mishap

డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడకూడదని అటు పోలీసుల, ఇటు పెద్దలు అనేక పర్యాయాలు చెబుతూనే వుంటారు. అయినా నిత్యం చేసే పనేగా కొత్తగా ఏం చేస్తున్నామంటూ పెద్దల మాటలను, పోలీసుల హెచ్చరికలను పెడచెవిన పెడుతుంటారు యువత. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ మోగ్రినా తీయకపోవడమే మంచిదని, ఫోన్ లో సంబాషించిన తరువాతే డ్రైవింగ్ చేస్తే బాగుంటుందని కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఎంత అప్రమత్తంగా వ్యవహరించినా.. ప్రమాదమన్నది చెప్పిరాదన్న పెద్దల మాట.. ఈ ఘటన ద్వారా నిరూపితమైంది.

సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి నిర్లక్ష్యం ప్రాణాలున్నా నిర్జీవిని చేసింది. స్థానికంగా వున్న సీసీటీవీల్లో నిక్షిప్తమైన ఈ ఘటన దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఫోన్ మాట్లలాుడతూ.. రాంగ్ రూట్ లో వెళ్లిన వ్యక్తి ప్రమాదానికి గురై బ్రెయిన్‌ డెడ్ అయ్యింది. అధికారులు, పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా తగిన జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం ఏ రూపంలో పొంచి ఉంటుందో చెప్పలేం. సరిగ్గా హైదరాబాద్‌లో ఇలాంటి విషాదం ఒకటి చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఖాజా మొహినుద్దీన్‌(35) నగరంలోని బహదుర్‌పురలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ పని మీద బయటకు వెళ్లాడు. తొలుత నో పార్కింగ్‌ ప్లేస్‌లో బైక్‌ పార్క్‌ చేసిన ఖాజా ఆపై ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడుపుతున్నాడు. సెల్‌ఫోన్లో మాట్లాడుతున్న అతడు బహదుర్‌పురా నాలా సమీపంలో రాంగ్‌రూట్‌లో రోడ్డు క్రాస్‌ చేసేందుకు చూడగా ఖాజా బైక్‌ను మరో బైక్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఖాజా తల నేరుగా రోడ్డుకి గట్టిగా తాకడంలో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే బ్రెయిన్‌ డెడ్‌ అయిందని వైద్యులు తెలిపారు. హెల్మెట్‌ ధరించక పోవడంతో పాటు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనం నడపటం వల్లే ఖాజాకు బ్రెయిన్‌ డెడ్‌ అయిందని పోలీసులు తెలిపారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles