"It has Rained in TN only as Amit Shah Visiting Chennai అమిత్ షా మైండ్ బ్లాక్ చేసిన తమిళనాడు యువత

Gobackamitshah trending in twitter as amit shah goes visiting chennai

amit shah trolled by tamil youth, twitter, bjp, tn, amit shah, bjp national president, tamil youth, #GobackAmitShah, terrorist, democracy gambler, demonetisation scamster, twitter, latest politics news,politics, latest news, tamil nadu politics, tamil nadu, politics

Even before BJP National president Amit Shah is to land up in Chennai to attend party’s 2019 Lok Sabha Preparation meeting, Twitter was agog with the hashtag #GobackAmitShah greeting his visit to the cultural capital of India.

అమిత్ షా మైండ్ బ్లాక్ చేసిన తమిళనాడు యువత

Posted: 07/11/2018 10:37 AM IST
Gobackamitshah trending in twitter as amit shah goes visiting chennai

కేంద్రంతో పాటు దేశంలోని అధిక రాష్ట్రాల్లో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు తమిళలో మాత్రం చుక్కెదురైంది. తమిళనాడులో కూడా తాము అధికారంలోకి రావాలన్న వ్యూహాలకు పదను పెట్టిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా.. ఈ సందర్భంగా తమిళనాడు రాజధాని చెన్నైలో అడుగుపెట్టిన సందర్భంగా అక్కడి యువత తడాఖా చూపించింది. ఒక రోజు పర్యటన నిమిత్తం చెన్నై వచ్చిన ఆయనపై ‘గో బ్యాక్’ అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. సామాజిక మాధ్యమాల నిండా నిరసనలు వెల్లువెత్తడంతో బీజేపీ కంగుతింది.

చెన్నై మహానగరంలో అడుగుపెట్టిన అమిత్ షా పర్యటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన నెటిజన్లు  ‘గో బ్యాక్‌ అమిత్‌ షా’ హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాలను హోరెత్తించారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఆయనకు ఎక్కడా ఎదురవ్వని పరాభవం తమిళనాట ఎదురైంది. తమిళనాడు యువత ‘గో బ్యాక్ అమిత్ షా’ హ్యాష్ ట్యాగ్ ట్వీట్లు, రీట్వీట్లతో విరుచుకుపడింది దీంతో అమిత్ షాను ఇన్నాళ్లుగా మోసిన ట్విట్టర్ లోనే ఆయన ఒక్కసారిగా విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ అనూహ్య పరిస్థితులు ఉత్పన్నం కావడంతో బీజేపీ శ్రేణులకు ఏం చేయాలో పాలుపోలేదు.

అమిత్ షా రాకను అడ్డుకునేలా ఏకంగా 1.29 లక్షల మంది వ్యతిరేకిస్తూ ట్యాగ్ చేశారు. ఫలితంగా ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతున్న వాటిలోనే ఆయన ఏకంగా రెండో స్థానంలో నిలిచారు. తమిళ గడ్డపైకి అమిత్ షా లాంటి ఉగ్రవాదిని అడుగుపెట్టనీయబోమని కొందరు హెచ్చరించారు. ఇది తమిళనాడు అన్న సంగతిని ఆయన గుర్తుంచుకుంటే మంచిదని కొందరు, ప్రజాస్వామ్య గ్యాంబ్లర్ ను తాము అంగీకరించబోమని మరికొందరు కామెంట్ చేశారు. నోట్ల రద్దు స్కామ్‌ స్టార్‌ గో బ్యాక్‌ అని ఇంకొందరు అమిత్ షాపై విరుచుకుపడ్డారు. తూత్తుకూడి మారణహోమం నేపథ్యంలో ట్వీట్ చేయని అమిత్ షా ఇప్పుడెందుకు వస్తున్నారని ఇంకోందరు.. ఇలా లక్షలాదిమంది అమిత్ షాకు వ్యతిరేకంగా గళమెత్తడాన్ని రాష్ట్ర పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles