pawan demands are fulfilled by TDP government పవన్ డిమాండ్లకు తలొగ్గిన సర్కార్.. యుద్దప్రాతిపదికన చర్యలు

Pawan kalyan demands are fulfilled by tdp government

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, pawan kalyan demands, pawan kalyan on youth skill development programs, pawan kalyan demands ap government, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, Pawan Kalyan uttatandhra yatra, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan who is in vishakapatnam as a part of uttarandhra porata yatra demand for skill development of local youth, is taken up andhra pradesh government

జనసేనాని డిమాండ్లకు తలొగ్గిన సర్కార్.. యుద్దప్రాతిపదికన చర్యలు

Posted: 07/10/2018 10:25 AM IST
Pawan kalyan demands are fulfilled by tdp government

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పోరాట యాత్రలో భాగంగా ప్రభుత్వ భాధ్యతలను గుర్తి చేయడంతో వాటిపై తెలుగుదేశం ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన స్పందిస్తుంది. నాలుగేళ్లుగా రాష్ట్రంలో వున్న ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన విమర్శలను పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం.. జనసేనాని పవన్ చేసిన విమర్శలపై మాత్రం యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. యువతను తమ వైపు తిప్పుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ప్రకటన నేపథ్యంలో జనసేనకు మంచి ఆదరణ లభిస్తుంది.

మరీ ముఖ్యంగా పవన్ పర్యటనలు.. ప్రభుత్వంపై ఆయన సంధిస్తున్న విమర్శలు.. అన్ని ప్రభుత్వ బాధ్యతలను గుర్తు చేసేలా వున్నాయని, ఇలాంటి నేత తప్పక రాజకీయాల్లో వుండాల్సిన అవసరం, అవశ్యకత వుందని యువత అలోచిస్తున్నారు. గత నాలుగేళ్లుగా కేవలం అమరావతి నామ జపం, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టు పేర్లు చెబుతూ కాలాన్ని గడిపేసిన ప్రభుత్వం.. పవన్ ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో సంధిస్తున్న విమర్శలను మాత్రం ఓ పక్క తిప్పికోట్టే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు పవన్ పార్టీ పట్ల యువత అకర్షిస్తున్న తీరును అధికార పార్టీని కలవర పెడుతుండటంతో ఆయన తెరపైకి తీసుకోస్తున్న డిమాండ్లను మాత్రం యుద్దప్రాతిపదికన పూర్తి చేసేందుకు సన్నాహాలను చేపట్టింది.

గత వారంలో జనసేనాని పవన్ కల్యాన్ విశాఖలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. తాను అరుకులోని ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ యువత గంజాయి తాగుతున్నారని, వారు వక్రమార్గం పడుతున్నారని అక్కడి నేతలు తనకు చెప్పారని, అయితే ఇందుకు బాధ్యత వహించాల్సింది కూడా ప్రభుత్వమేనని పవన్ అన్న విషయం తెలిసిందే. యువతకు ఉపాధి లేదు. ఉపాధి లేకపోవడానికి కారణం వారి వద్ద నైపుణ్య (టెక్నికల్ స్కిల్స్) లేవన్న సమాధానం. మరి యువతకు నైపుణాభివృద్ది చేయాల్సిన పభుత్వం.. చేతులెత్తేస్తే.. వారు ఖాళీగా వుంటూ వక్రమార్గం పట్టక ఏం చేస్తారని పవన్ ప్రశ్నించారు. దీంతో యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకున్న అధికార పార్టీ జాబ్ స్కిల్స్ పేరుతో శిక్షణ, నైపుణం కల్పించే చర్యలకు పూనుకుంది.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం యువతకు నైపుణ్యాభివృద్ది కల్పించాలన్న నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో అప్రెంటిస్ షిప్ సెల్ ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్రెంటిస్ షిప్ విధానాన్ని స్వల్పకాలిక కోర్సులు, శిక్షణతో అన్ని రంగాలకు అనుసంధానం చేయాలని, అందులో భాగంగా ‘ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అప్రెంటిస్ షిప్ స్కీమ్ ఇన్ ఏపీ’ పేరుతో విశాఖపట్నంలోని నొవాటెల్ లో ఈనెల 11వ తేదీన కాన్ఫరెన్స్ నిర్వహించబోతోంది. ఈ అప్రెంటిస్ షిప్ విధానాన్ని అమలు చేసే సంస్థలకు శిక్షణ కోసం ఒక్కొక్క అభ్యర్థికిగాను 1500 రూపాయల చొప్పున ప్రోత్సాహకంగా ప్రతినెలా మంజూరు చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles