Paripoornananda Swami house arrest స్వామి పరిపూర్ణానంద గృహనిర్భంధం..

Swami paripoornananda s house arrest ahead of yatra

paripoornanada swamy house arrest, paripoornanada swami kathi mahesh, paripoornanada swami dharmagraha yatra, kathi mahesh hyderabad police, kathi mahesh paripoornanada swamy, kathi mahesh bigboss, kathi mahesh controversial remarks, kathi mahesh twitter, paripoornanada swamy, kathi mahesh, rachakonda police, law and order, controversial remarks

Hindu saint Swami Paripoornananda, who announced a Dharmagraha Yatra to protest against Kathi Mahesh's recent remarks against Sri Rama, is under house arrest. police have rounded up his Jubilee Hills residence in order to prevent him from taking up the Yatra.

స్వామి పరిపూర్ణానంద గృహనిర్భంధం.. ధర్మాగ్రహయాత్రకు బ్రేక్..

Posted: 07/09/2018 11:42 AM IST
Swami paripoornananda s house arrest ahead of yatra

శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ పోలీసులు గృహనిర్భంధంలో వుంచారు. ఆయన ఇవాళ తలపెట్టిన ధర్మాగ్రహ యాత్రకు అనుమతిని నిరాకరించిన పోలీసులు.. ఆయన హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు తలపెట్టిన యాత్రకు కూడా బ్రేకులు వేశారు. అటు రాచకోండ పోలీసులు కూడా ఆయన యాత్రకు అనుమతి లభించని నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుని రహదారులపై పికెట్లు ఏర్పాటు చేశారు.

హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దేశద్రోహిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ధర్మాగ్రహ యాత్రను చేపట్టనున్న విషయం తెలిసిందే. స్వామీజీ యాత్రకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. స్వామిజీని గృహనిర్భంధించిన పోలీసులు, బయటకు రాకుండా ఏర్పాట్లు చేశారు. దీంతో సోమవారం ప్రారంభం కావాల్సిన యాత్రకు ఆటంకం ఏర్పడింది. బషీర్‌బాగ్‌లోని భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ధర్మాగ్రహ యాత్రను మొదలుపెట్టాలని భావించారు.

స్వామి పరిపూర్ణానంద ఆదివారం నాడు మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి రెండు రోజుల పాటు నడిచి యాదాద్రికి చేరుకుని లక్ష్మీ నరసింహస్వామికి తమ గోడును వెళ్లబోసుకోంటామని తెలిపారు. 'ధర్మాగ్రహం' పేరిట యాత్ర జరుగుతుందని, ప్రతి హిందువూ ఇందులో భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. తాను యాదాద్రికి చేరుకునేలోపు కత్తి మహేష్‌పై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే తన భవిష్యత్తు కార్యాచరణను అక్కడే ప్రకటిస్తానని స్వామిజీ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles