Woman hulchal at actor nagarjuna house ప్రముఖ నటుడి ఇంటివద్ద యువతి హంగామా..!

Adilabad woman hulchal at actor akkineni nagarjuna house

woman hulchul in jubilee hills, woman hulchul at nagarjunas house, nagarjuna vijaya rs 4 crore, actor, akkineni nagarjuna, vijaya, adialabad, RS.4 Cr, jubilee hills, hyderabad police, crime

A Woman, named Vijaya hulchal at Film star Nagarjuna house. The police said that she was suffering from a mental disability. Akkineni Nagarjuna is an Indian film actor and producer who works primarily in the Telugu Cinema.

ప్రముఖ నటుడు నాగార్జున ఇంటివద్ద యువతి హంగామా..!

Posted: 07/04/2018 11:28 AM IST
Adilabad woman hulchal at actor akkineni nagarjuna house

టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇంటి వద్ద ఓ యువతి నానా యాగీ చేసింది. నాగార్జున తనకు నాలుగు కోట్ల రూ‌పాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నానా రభస చేసింది. అయితే ఎందుకని ఇవ్వాలన్నది మాత్రం చెప్పలేదు. తనను లోపలికి పంపితే నాగార్జునే ఎందుకివ్వాలన్నది చెబుతారని ఎదురుచెప్పింది. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్‌కు చెందిన విజయ అనే మహిళ క్రితం రోజు రాత్రి జూబ్లీహిల్స్ కు చేరుకుంది. రోడ్డు నంబరు 51లో ఉన్న ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త అక్కినేని నాగార్జున ఇంటికి వెళ్లింది. తాను నాగార్జునను కలవాలని అనుకుంటున్నట్టు నాగార్జున వ్యక్తిగత కార్యదర్శికి చెప్పి లోపలికి పంపించాల్సిందిగా కోరింది. నాగార్జున లేదరని అయితే సార్ ను ఎందుకు కలవాలని అనుకుంటున్నారో చెబితే.. ఆయన వచ్చిన తరువాత చెప్పి.. నాగార్జున అనుమతితో మిమ్మల్ని సంప్రదిస్తామని ఫీఏ సమాధానం ఇచ్చారు.

అంతే విజయ నోటి వెంట వచ్చిన సమాధానం విన్న నాగార్జున పిఏ విస్తుపోయాడు. నాగార్జున తనకు రూ.4 కోట్లు ఇవ్వాలని చెప్పడంతో ఆశ్చర్యపోయాడు. నాగార్జున లేరని, తర్వాత రావాలని చెప్పినా ఆమె వినిపించుకోకుండా రోడ్డుపై హడావిడి చేసింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె మానసిక స్థితి బాగాలేదని తేల్చారు. బంధువులకు సమాచారం అందించి అప్పగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actor  akkineni nagarjuna  vijaya  adialabad  RS.4 Cr  jubilee hills  hyderabad police  crime  

Other Articles