HC to hear PIL on missing jewellery of Tirumala టీటీడీపై హైకోర్టు విచారణ.. నోటీసులు జారీ

Hyderabad hc to hear pil on missing jewellery of tirumala

ttd, Tirumala Tirupati Devasthanam, tirumala tirupati controversy, High Court of Hyderabad, High Court, Ramana deekshitulu

The High Court of Hyderabad (for Andhra Pradesh and Telangana) on Tuesday served notices to the Tirumala Tirupati Devasthanams (TTD) and Andhra Pradesh government to furnish details within three weeks on the alleged excavations for treasure in the Potu and the missing jewelry.

టీటీడీపై హైకోర్టు విచారణ.. నోటీసులు జారీ

Posted: 07/03/2018 07:09 PM IST
Hyderabad hc to hear pil on missing jewellery of tirumala

తిరుమల తిరుపతి దేవస్థానంలో నెలకొన్న వివాదాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. నగల మాయం, ఆదాయ వ్యయాలు, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారన్న అభియోగాలపై సీబీఐతో విచారణకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిల్ పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. మూడు వారాల్లోగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని టీటీడీని ఆదేశించింది. ఈ మేరకు టీటీడీ సీఈవోతో పాటు, రాష్ట్ర దేవాదాయ శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గుజరాత్‌కు చెందిన భూపేందర్‌ గోస్వామి, గుంటూరు జిల్లాకు చెందిన అనిల్‌ కుమార్‌ అనే భక్తులు తిరుమల వివాదంపై గతంలో హైకోర్టును ఆశ్రయించారు. తిరుమల వివాదంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని వారు పిటిషన్‌లో కోరారు.

గత కొన్నాళ్లుగా ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు రేపిన తిరుమల తిరుపతి వివాదం హైకోర్టుకు చేరకోవడం చర్చనీయంగా మారింది. టీటీడీ పరిపాలన కమిటీ అధ్యక్షుడిగా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం జరిగినప్పటి నుంచి వివాదాలకు నెలవుగా మారిన పవిత్ర పుణ్యక్షేత్రం.. అరోపణలకు ప్రత్యారోపణలకు కేంద్రంగా కూడా మరింది. ఉద్యోగులు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలపడం వంటి అనేక ఘటనకు కూడా చోటుకల్పించింది. నిత్యం అధ్యాత్మిక భావంతో నిండుకోవాల్సిన ఈ కలియుగ శ్రీవారి నిలయం కయ్యాలకు నెలవుగా మరింది.

ఈ తరుణంలో భక్తులు మనోభావాలకు కూడా గాయం అవుతుంది. ఎందరో భక్తులు అనేక వ్యయప్రయాలకోర్చి వెంకన్న దర్శనానికి వెళ్తే.. అక్కడ ఆలయ పవిత్రను, ప్రతిష్టను దెబ్బతీసేలా వాతావరణం అలుముకోవడం.. భక్తులను అవేదనకు గురిచేసింది. దీంతో తాజాగా నగల మాయం, ఆలయం లోపల తవ్వకాలపై సీబీఐ విచారణ జరిపించాలని, వారసత్వ సంపద (హెరిటేజ్ ప్రాపర్టీ)ను కాపాడాలంటూ ఇద్దరు భక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుప్త నిధుల కోసం ఆలయం లోపల తవ్వకాలు జరుపుతున్నారని పిటిషనర్ కోర్టుకు తెలపగా.. గుడి లోపల ఎలాంటి తవ్వకాలు జరపలేదని, కేవలం మరమ్మతులు మాత్రమే చేశామని కోర్టుకు టీటీడీ తెలిపింది.

టీటీడీ చెబుతున్నట్లు ప్రస్తుతం నిర్మిస్తున్న గుడి గోపురం బంగారంతో కూడినది కాదని పిటిషనర్ వాదించారు. అయితే.. గోపురం నిర్మాణంలో బంగారమే వాడుతున్నామని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలలో జరుగుతున్న అక్రమాలపై పత్రికలో వచ్చిన కథనాలను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. అయితే.. పత్రికల్లో వచ్చిన కథనాలను పరిగణించబోమని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles