Ex-Cricketer Joins Jana Sena Party జనసేనలోకి టీమిండియా మాజీ క్రికెటర్..

Team india ex cricketer from andhra joins jana sena party

pawan kalyan, janasena, Cricketer, Venugopal Rao, Cricketer Venugopal Rao, vishakapatnam, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, andhra pradesh, politics

Cricketer Venugopal Rao who hails from Andhra Pradesh joined Jana Sena Party. Pawan Kalyan has been in Visakha since couple of days as part of his Uttar Andhra Tour. Venugopal Rao joined Jana Sena in the presence of Powerstar.

జనసేనలోకి టీమిండియా మాజీ క్రికెటర్.. అహ్వానించిన పవన్

Posted: 06/28/2018 03:57 PM IST
Team india ex cricketer from andhra joins jana sena party

మూడు రోజుల క్రితం అంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్.. జనసేన అధినేతతో భేటీ కావడం చర్చనీయాంశంగగా మారింది. తాజాగా.. మధ్యతరగతి విద్యావంతులు, మేధావులు, క్రీడాకారులు రాజకీయాల్లోకి రావాలని పవన్ కల్యాన్ ఇచ్చిన పిలుపుతో ఆయా వర్గ ప్రజల్లో కదలిక మొదలైంది. ఇవాళ  జనసేన పార్టీలోకి టీమిండియా మాజీ ఆటగాడు, ఆంధ్ర క్రికెటర్ వేణుగోపాలరావు చేరారు. ఆయనను పవన్ కల్యాన్ పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి అహ్వానించారు.

వేణుగోపాలరావుతో పాటు మరికొంతమంది నాయకులు విశాఖపట్నంలో అధినేత పవన్ కళ్యాణ్ అధ్వర్యంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేనలో చేరినవారిలో వేణుగోపాల్‌రావు‌తో పాటు బీసీ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ కోన తాతారావు (గాజువాక), అనకాపల్లికి చెందిన వ్యాపారవేత్త కొణతాల సీతారాం, విశాఖ నగరానికి చెందిన బాలాజీ స్కూల్స్ అధినేత మండవ రవికుమార్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రామచంద్రరావు ఉన్నారు. ఈ నాయకులతో పాటు వారి అనుచరులు కూడా జనసేనలో చేరారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘2019లో సరికొత్త రాజకీయ వ్యవస్థ రాబోతోంది. ప్రతి నియోజకవర్గంలో జనసేన జెండా రెపరెపలాడుతుంది. జనసేన పార్టీకి జీవం జనసైనికులే. నాయకులు ఉండొచ్చు, వెళ్లిపోవచ్చు.. కానీ, జనసైనికులు ఎప్పుడూ నాతోనే ఉంటారు. టీడీపీ, వైసీపీలకు డబ్బులిస్తే జనం వస్తారు. జనసేనకు మాత్రం స్వచ్ఛందంగా, ప్రేమతో వస్తారు. జనసైనికులు డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తులు కాదు. జనసేన పార్టీలో చేరిన నాయకులు జనసైనికుల్ని గౌరవించాలి. వారిని గౌరవిస్తే.. నన్ను గౌరవించినట్లే. ఇన్ని సంవత్సరాలు ఇంత ప్రేమను పంచిన మీకు.. నా తుది శ్వాస వరకు వెన్నంటే ఉంటాను. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాను’ అని చెప్పారు.

ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం కాదని, వెనక్కి నెట్టివేసిన ప్రాంతమని పవన్ కల్యాణ్ అన్నారు. ఉత్తరాంధ్ర యాస, భాష, కళలతో పాటు ఆత్మను అర్థం చేసుకున్న ఏకైక పార్టీ జనసేన మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత స్వరూపాన్ని, స్వభావాన్ని అర్థం చేసుకున్న స్థానిక నాయకులకే జనసేన పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. ‘ఇవాళ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. 2003లో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకన్నా. 2009లో పోటీ చేయకపోవడానికి ముఖ్య కారణం సమస్యలను అర్థం చేసుకోవడం కోసమే. 2014లో సుస్థిరత కోసం టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు ఇచ్చాను. రాజకీయాల్లో లబ్ధి పొందాలనుకుంటే ఆనాడే కేంద్ర మంత్రి పదవి అడిగేవాడిని. టీడీపీకి మద్దతు ఇచ్చినందుకు బేరసారాలు ఆడేవాడిని. కానీ దేశ రాజకీయాల్లో విలువలు బతికే ఉన్నాయని చెప్పడానకి అవేవీ ఆశించకుండా మద్దతు పలికాను’ అని పవన్ వెల్లడించారు.

జనసైనికుల కోసం జులై 2 నుంచి జనసేన శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయని జనసేనాని ప్రకటించారు. ప్రతి జిల్లా నుంచి మూడు వేల మందిని శిక్షణ కోసం ఎంపిక చేశామన్నారు. ‘ఎవరైనా రాజకీయాల్లోకి రాగానే పదవిని కోరుకుంటున్నారు. నేను మాత్రం సమస్యలకు పరిష్కారం వెకతడం కోసం వచ్చాను. ఈ పనిని ఉద్దానం నుంచే మొదలుపెట్టాను. త్రికరణ శుద్ధితో చాలా సహనంతో రాజకీయాల్లో ఉంటున్నా. నాకు చాలా ఓపిక ఎక్కువ. ఎంత ఓపిక అంటే ఒక సినిమా హిట్ కోసం 12 ఏళ్లు ఎదురుచూశా. 2019లో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. అందులో భాగంగానే మన నాయకులంతా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. మేధావుల సలహాలు, సంప్రదింపులతో జనసేన మ్యానిఫెస్టో రూపుదిద్దుకుంటోంది’ అని పవన్ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Cricketer  Venugopal Rao  porata yatra  vishakapatnam  andhra pradesh  politics  

Other Articles