TRS leaders wanted action against D Srinivas టీఆర్ఎస్ సీనియర్ నేత డీఎస్ పై క్రమశిక్షణా చర్యలకు డిమాండ్..

Nizamabad trs leaders seek action against d srinivas

TRs leaders, D Srinivas, nizambad, disciplinary action, BJP, Son, d arvind, d srinivas, ds, k chandrashekhar rao, k kavitha, TRS advisor, rajya sabha member, politics

Nizamabad TRS leaders including MP, MLAs and others demanded Chief Minister and Party Chief K Chandrashekar Rao to take disciplinary action against the Rajya Sabha member D Srinivas for anti party activities.

టీఆర్ఎస్ సీనియర్ నేత డీఎస్ పై క్రమశిక్షణా చర్యలకు డిమాండ్..

Posted: 06/27/2018 11:55 AM IST
Nizamabad trs leaders seek action against d srinivas

నిజామాబాద్‌ టీఆర్ఎస్ లో లుకలుకలు వెలుగుచూశాయి. సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ టీఆర్ఎస్ నేతలు అరోపిస్తున్నారు. గత మూడు రోజులుగా ఆయన హస్తినలో మాకాం వేసిన నేపథ్యంలో ఆయన తన తనయుడి మాదిరిగానే కాషాయపార్టీ తీర్థం తీసుకోనున్నారా..? లేక మళ్లీ తన మాత్రపార్టీ కాంగ్రెస్ లో చేరనున్నారా.? అన్న వార్తలు వస్తున్న వేళ.. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు హుటాహుటిన భేటీ అయ్యి.. ఆయనను పార్టీ నుంచి తప్పించడమే కాకుండా క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ మేరకు ఎంపీ కవిత నేతృత్వంలో, అమె నివాసంలో జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు  ప్రజాప్రతినిధులు భేటీ అయ్యి డీఎస్‌ వ్యవహారశైలిపై చర్చించారు. డి.శ్రీనివాస్‌ కుమారుడు ఇటీవల బీజేపిలో చేరడంతో ఆయన కూడా ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. జిల్లాలో సీనియర్‌ రాజకీయ నేతగా ఉన్న డీఎస్‌ పార్టీలోకి వస్తానంటే సీఎం కేసీఆర్‌ సాదరంగా ఆహ్వానించి.. ఆయన పెద్దరికాన్ని గౌరవించి.. అంతర్రాష్ట్ర సలహాదారుగా కూడా నియమించి కేబినెట్ హోదా కల్పించారని చెప్పారు. ఆ తరువాత ఆయనకు రాజ్యసభ కూడా పంపారని అన్నారు.  

సీఎం ఆదేశాల మేరకు జిల్లా నేతలంతా ఆయనకు సముచిత గౌరవం ఇస్తూ వచ్చారు. అన్ని ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ఆయనను అహ్వానిస్తూ వచ్చినా.. ఆయన మాత్రం ఆ పెద్దరికం నిలుపుకోలేక పోయారని.. తన కుమారుడు బీజేపిలో చేరిననాటి నుంచి ఆయనలో మార్పు వచ్చిందని.. దీంతో బీజేపికి అనుకూలంగా పనిచేయాలంటూ ఆరేడు నెలలుగా డీఎస్‌ టీఆర్ఎస్ కార్యకర్తలను ఒత్తిడి చేస్తున్నారని అరోపించారు. ఈ విషయాన్ని పలువురు కార్యకర్తలు తమ దృష్టికి తీసుకొచ్చారని.. దీంతోనే తాము బయటకు రావాల్సివచ్చిందని అమె అన్నారు.

పార్టీకి వ్యతిరేకంగా డీఎస్ వ్యవహరిస్తున్న తీరును అధిష్ఠానానికి తెలియజేయాల్సిందిగా నిజామాబాద్‌ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు తుల ఉమకు విజ్ఞప్తి చేశామని.. ఇప్పటికే తమ ఆవేదనను తెలియజేస్తూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశామని చెప్పారు. పార్టీలో ఇలాంటి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తేనే వచ్చే ఎన్నికల్లోనూ నిజామాబాద్‌ జిల్లా మొత్తం టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుందని ఆమె అశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ క్రమశిక్షణ కలిగిన పార్టీ. పార్టీలో ఎంతటి నాయకులైనా సరే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించవద్దని అధినేతను కోరుతున్నాం’ అని కవిత అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRs leaders  D Srinivas  nizambad  disciplinary action  BJP  d arvind  k chandrashekhar rao  k kavitha  politics  

Other Articles