telaprolu sarpunch alleges threat from her husband మహిళా సర్పంచ్ కు తప్పని గృహహింస..

Telaprolu sarpanch alleges police not taking action on her complaint

harini kumari, gannavaram, vijayawada, telaprolu sarpanch, police, husband torture, rama krishna, domestic voilence, physical assault, mental torture, andhra pradesh government, andhra pradesh, politics, crime

Telaprolu sarpanch hirini kumari alleges that is has a threat for life from her husband rama krishna, who is a tdp leader. she also alleges that police are not taking action on her complaint.

మహిళా సర్పంచ్ కు తప్పని గృహహింస.. పట్టించుకోని పోలీసులు.?

Posted: 06/25/2018 02:35 PM IST
Telaprolu sarpanch alleges police not taking action on her complaint

నవ్యాంధ్ర రాజధానికి చేరువలో వున్న ప్రాంతంలోని అధికార టీడీపీ మహిళా సర్పంచ్ కే రక్షణ కరువైంది. అయితే ఆమె స్వయంగా ఈ విషయమై పోలీసులకు పిర్యాదు చేసినా.. వారు పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారని సదరు బాధితురాలు అరోపిస్తున్నారు. గ్రామ ప్రధమ పౌరురాలిగా అమె తన గ్రామంలో ఏ కుటుంబంలోనైనా.. భార్యభర్తల కలహాలు వస్తే వారికి సర్థిచెప్పి.. కలసివుండాలని.. ఇకపై తప్పులు పునరావృతం కాకూడదని చెబుతారు. అప్పటికీ కాకపోతే తప్పు ఎవరిపక్షాన వుంటే వారికి వ్యతిరేకంగా పోలీసులకు పిర్యాదు చేయాల్సిందిగా సూచిస్తారు.

అయితే ఇక్కడ మాత్రం సీన్ వేరేగా వుంది. ఏకంగా సర్పంచ్ గా వున్న తనకే రక్షణ కరువైందని ఓ మహిళా సర్పంచ్ పోలీసులను అశ్రయించింది. తన భర్త తనను ఏడాది కాలంగా శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని కృష్ణా జిల్లా తేలాప్రోలు సర్పంచ్‌ హరిణికుమారి తీవ్ర ఆరోపణలు చేశారు. తనను ప్రాణాలతో ఉండనిస్తాడనే ఆశ కూడా లేదని అమె అందోళన వ్యక్తం చేశారు. తనకు తన భర్తచేతిలో ప్రాణహాని వుందని అరోపించారు.

ఈ మేరకు ఇవాళ ఫేస్ బుక్‌ ద్వారా తన గోడును వెళ్లబోసుకున్నారు. శరీరంపై గాయాలున్న ఫొటోలను పోస్ట్‌ చేశారు. తన భర్త, టీడీపీ నేత యతేంద్ర రామకృష్ణ.. తనను హింసిస్తున్నాడని, గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని హరిణికుమారి వాపోయారు. మరొకరికి ఇటువంటి దుస్థితి రాకూడదనే ఉద్దేశంతో మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles