BJP withdraws support to PDP government in J&K రాష్ట్రపతి పాలన దిశగా జమ్మూకాశ్మీర్.. తెగిన కూటమి బంధం..

Jammu and kashmit heading toward president s rule as cm resigns

PM Modi, amit shah, jammu and kashmir, Mehbooba Mufti, Governor, NN Vohra, resignation, BJP president Amit Shah, Ram Madhav, politics

BJP has ended its alliance with PDP in Jammu and Kashmir, following the pullout, BJP has sent a letter to the Governor, NN Vohra expressing their decision. Governor's rule is a major possibility after today's breakup.

రాష్ట్రపతి పాలన దిశగా జమ్మూకాశ్మీర్.. తెగిన కూటమి బంధం..

Posted: 06/19/2018 04:17 PM IST
Jammu and kashmit heading toward president s rule as cm resigns

జమ్ముకశ్మీర్ లో తాము అధికార పీడిపీ పార్టీతో ఏర్పర్చుకున్న కూటమికి బీజేపి ముగింపు పలికింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో రాష్ట్ర సీనియర్ నేతలతో ఏర్పాటైన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వెనువెంటనే తమ నిర్ణయాన్ని గవర్నర్ వోహ్రాకు కూడా బీజేపి తెలియజేసింది. దీంతో జమ్మూకాశ్మీర్ లో రాజకీయాలు ఒక్కసారిగా అత్యంత వేగంగా మారిపోయాయి. ఈ క్రమంలో తమ మిత్రుడు బంధాన్ని తెంచుకోవడంతో తన ప్రభుత్వం మైనారిటీలో పడిందని భావించిన ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేశారు. సినట్టు తెలుస్తోంది.

సంకీర్ణ బంధాన్ని బీజేపీ తెగతెంపులు చేసుకుని పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ)కి త్రిఫుల్ కటీఫ్ చెప్పింది. దీంతో, మైనార్టీలోకి పడిపోయిన ముఫ్తీ ప్రభుత్వం.. కింకర్తవ్యంలో కాలయాపన చేయలేదు. ఆ వెంటనే మెహబూబా రాజీనామా చేశారు. దీంతో జమ్ముకశ్మీర్ మరోసారి రాష్ట్రపతి పాలన కొనసాగే అవకాశాలే మెండుగా వున్నాయి. మరోవైపు పీడీపీ రాజీనామా అనంతరం జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముప్తీ మాట్లాడుతూ.. తాము దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపితో జట్టుకట్టామని చెప్పారు.

పాకిస్థాన్ తో శాంతి చర్చలు పునరుద్దరణను తాము కోరుకున్నట్లు చెప్పారు. శాంతి ఏర్పడేందుకు తొలి అడుగువేయాలనే కాల్పుల విరమణను కొనసాగించాలని కోరుకున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా బాగుండాలన్నదే తమ అభిమతమని ఆ దిశగానే తాము అన్ని ప్రయత్నాలు సాగించామని, బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని నడిపేందుకు తాము అన్ని విధాలా ప్రయత్నించామని... కానీ, అది జరగలేదని చెప్పారు. బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకోబోతోందని ఊహించలేకపోయామని అన్నారు.

కాగా, జమ్మూకాశ్మీర్ లో పీడీపీతో తమ బంధం వీడిపోయిందని అంతకుముందే బీజేపీ అధికారికంగా ప్రకటన చేసింది. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ మీడియాతో మాట్లాడుతూ... పీడీపీతో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగించే పరిస్థితులు ఇకలేవని స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రపతి పాలనకు తాము డిమాండ్ చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం, హింస, తిరుగుబాట్లు అధికమయ్యాయని, అక్కడి పౌరుల ప్రాథమిక హక్కులు కూడా ప్రమాదంలో పడ్డాయని, ఇటీవల పత్రికా సంపాదకుడు షుజాత్‌ బుఖారిని హత్య చేయడమే అందుకు ఉదాహరణని అన్నారు.

తాము జమ్ముకశ్మీర్‌లో శాంతి స్థాపనకు కృషి చేశామని, అభివృద్ధి కోసం ప్రయత్నం చేశామని రామ్ మాధవ్‌ అన్నారు. అయితే, జమ్ము, లడఖ్ లో అభివృద్ధి పనులు జరిపే క్రమంలో తమ నాయకులు ఇబ్బందులు ఎదుర్కున్నారని చెప్పారు. కాగా, అమర్ నాథ్ యాత్రకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సెర్చ్ ఆపరేషన్‌ నిలిపేశామని చెప్పారు. ఈ క్రమంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా గవర్నర్ వోహ్రాను కలిశారు. అయితే ప్రజలకు ప్రజాస్వామ్యంపై వున్న నమ్మకం నేపథ్యంలో త్వరగా ఎన్నికలకు వెళ్లాలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles