Nerella Venu Madhav Passes Away ప్రపంచ ప్రఖ్యాత అనుకరణకర్త నేరళ్ల వేణుమాదవ్ అస్తమయం

Famous mimicry artist nerella venu madhav no more

Nerella Venu Madhav, Mimicry, Nerella Venu Madhav passed away, Nerella Venu Madhav no more, world famous mimicry artist, nerella, Mattewada, Warangal

World Mimicry Artist Nerella Venu Madhav passed away few minutes ago in his Warangal residence. He has been treated for respiratory problems for the past few days. Nerella hails from Warangal district's Mattewada and became popular for his unique style of doing mimicry.

ITEMVIDEOS: ప్రపంచ ప్రఖ్యాత అనుకరణకర్త నేరళ్ల వేణుమాదవ్ అస్తమయం

Posted: 06/19/2018 12:19 PM IST
Famous mimicry artist nerella venu madhav no more

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, స్వరబ్రహ్మ నేరెళ్ల వేణుమాధవ్ ఇవాళ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొన్నిరోజులుగా వెంటిలేటర్ పై ఉండి చికిత్స పొందారు. మిమిక్రీ రంగంలో తన సొంత ఒరవడితో, తనదైన శైలితో స్వరబ్రహ్మగా వేణుమాధవ్‌ పేరుతెచ్చుకున్నారు. 1947లో పదహారేళ్ల వయస్సులోనే అనుకరణ రంగంలో తన కెరీర్ ప్రారంభించిన ఆయన ఐక్యరాజ్య సమితిలో మిమిక్రి ప్రదర్శన చేసిన తొలి తెలుగు వ్యక్తిగా ఘనత సాధించారు.

దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి అనేకమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆయన ఇవాళ కొత్తవాడలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, ఉర్దూల్లో మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చారు. ఈ రంగంపై ఆయనకు ఎంతో ప్రేమను కనబర్చిన ఆయన ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీపై డిప్లమా కోర్సులను ప్రవేశపెట్టి తనకు ఆ కళపై వున్న అసక్తిని కనబర్చారు నేరెళ్ల.

చిలకమర్తి ప్రహసనాల్లో నటించడం ద్వారా వేణుమాధవ్ ప్రత్యేక గుర్తింపు కూడా సంపాదించుకున్నారు. ఆయనకు కళారంగంపై వున్న అసక్తితో.. మరీ మఖ్యంగా అనుకరణ రంగంలో ఆయన చేసిన సేవలకు ఆయనకు కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించి గౌరవించింది. ఆంధ్రా యూనివర్సిటీ, కాకాతీయ యూనివర్సిటీ, ఇంధిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీల నుంచి ఆయన గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 1978లో ఏయూ నుంచి కళాప్రపూర్ణ అందుకున్నారు.

 నేరెళ్ల ప్రతిభకు మెచ్చిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ.. శివదర్పణం సంపుటిని అంకితం ఇచ్చారు. నేరెళ్లపై ఐవీ చలపతి రావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ పుస్తకాలు రాశారు. ప్రముఖ నిర్మాత బీఎన్ రెడ్డి ప్రోద్బలంతో సినిమాల్లో నటించారు నేరెళ్ల వేణుమాధవ్. దాదాపు పన్నెండు సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. పీవీ నర్సింహా రావు సీఎంగా ఉన్నప్పుడు ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. దీంతో ఆయన 1972 నుంచి 1978 వరకు ఎమ్మెల్సీగా సేవలందించారు. 1974లో ఆయన నాటక సంఘం సభ్యుడిగా కూడా వ్యవహరించారు.

హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని ఆడిటోరియానికి నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంగా నామకరణం చేశారు. కళారంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఇటీవల ఆయన పేరుతో పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేసింది. 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, అంతకుముందు శ్రీరాజలక్ష్మి ఫౌండేషన్‌ అవార్డును ఆయన అందుకున్నారు. ఆయన మృతిపై సర్వత్రా సంతాపం వ్యక్తమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nerella Venu Madhav  Mimicry  Nerella Venu Madhav passed away  Mattewada  Warangal  

Other Articles