Fire breaks out at Worli high-rise in Mumbai నటి దీపిక అపార్టుమెంటులో మంటలు.. ముంబైలో కలకలం

Fire erupts at beaumonde towers deepika among flat owners

fire in mumbai, fire in mumbai today, fire in mumbai worli, high rise in mumbai, fire at beaumonde, massive fire, fire at lower parel, fire in lower parel today, beau monde, fire at mumbai, fire in lower parel, worli fire, fire in worli, fire in mumbai today, mumbai high rise fire, fire in mumbai building today, fire in mumbai latest news, beaumonde towers, fire in mumbai, mumbai fire

A level-3 fire broke out at BeauMonde Towers in Mumbai’s Worli, 13 June. No casualties have been reported yet. The multi-storey building houses the residence and office of bollywood actress Deepika Padukone.

నటి దీపిక అపార్టుమెంటులో మంటలు.. ముంబైలో కలకలం

Posted: 06/13/2018 06:12 PM IST
Fire erupts at beaumonde towers deepika among flat owners

ముంబై సిటీలో ఒక్కసారిగా కలకలం. బాలీవుడ్ నటులు, పారిశ్రామికవేత్తలతో పాటు పలు రంగాలకు చెందిన వాణిజ్యవేత్తలు అత్యంత సంపన్నవర్గం వారు నివాసం ఉంటే వర్లీలోని ప్రభాదేవి ప్రాంతంలో అప్పాసాహేబ్ మరాఠీ మార్గ్ లోని భీమాండ్ స్కై టవర్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. 45 అంతస్తుల ఈ భవంతిలో.. చివరి ఫ్లోర్ లోని ఓ ప్లాట్ నుంచి మంటలు చెలరేగాయి. ఆ వెంటనే కింద ఉన్న రెండు ఫ్లోర్లకు వ్యాపించాయి.

అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో హుటాహుటిన 10 ఫైర్ ఇంజిన్స్, 5 జంబో ట్యాంకర్స్ స్పాట్ లోకి వచ్చాయి. మంటలను అదుపులోకి తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందు జాగ్రత్తగా ఈ బిల్డింగ్ నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే రెండు ప్లాట్లు పూర్తిగా కాలిపోయాయి. మిగతా అంతస్తులు, ప్లాట్లకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

45 అంతస్తుల భవనం కావటం.. అగ్నిప్రమాదంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో బిల్డింగ్ లో ఉండే వారు అత్యవసర మార్గం, మెట్ల మార్గం ద్వారా కిందకు వస్తున్నారు. ఇప్పటికే 100 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు ఫైర్ సిబ్బంది. ఈ 33 అంతస్తుల భీమాండి టవర్స్ లో కొన్ని ఆఫీసులు నడుస్తున్నాయి. కొంత మంది నివాసం కూడా ఉంటున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకునే కూడా ఈ బిల్డింగ్ లోనే నివాసం ఉంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Worli  fire  BeauMonde Towers  Appasaheb Marathe Marg. mumbai  deepika padukone  

Other Articles