Trump and Kim Jong Un conclude the First Ever Summit ప్రపంచానికి శాంతిసందేశం.. శుభపరిణామం: డోనాల్డ్ ట్రంఫ్

Trump kim jong sign joint document after historic singapore summit

Donald Trump, Kim Jong Un, Singapore, North Korea, China, Trump Kim meeting, South Korea, North Korea missile, North Korea nuclear

U.S. President Donald Trump and North Korean leader Kim Jong Un pledged to work toward complete denuclearisation of the Korean peninsula while Washington committed to provide security guarantees for its new friend.

ప్రపంచానికి శాంతిసందేశం.. శుభపరిణామం: డోనాల్డ్ ట్రంఫ్

Posted: 06/12/2018 02:14 PM IST
Trump kim jong sign joint document after historic singapore summit

ప్రపంచ దేశాలకు ఆ రెండు దేశాల అధినేతలు ఓ శుభసంకేతాన్ని ఇచ్చారు. ఎంతో ఆసక్తి చోటుచేసుకున్న ఈ పరిణామం శుభపరిణామాంగా మారి ప్రపంచ దేశాలకు కూడా శాంతి సందేశాన్ని అందించింది. చారిత్రత్మకమైన ఈ సమావేశంలో ఇరు దేశాల అధినేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న ఉత్కంఠకు ఇక తెరపడింది. ఉందిలే మంచికాలం ముందుముందునా.. అంటూ ఇద్దరు కలసి ప్రపంచ దేశాలకు శుభసందేశాన్ని ఇచ్చారు. సానుకూల వాతావరణంలో చర్చలతో సమసిపోని సమస్యలే లేవని వారు చాటిచెప్పారు.

నిన్నమొన్నటి వరకు ఉభయకొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే.. భగ్గుమని మండేది. కాగా, ఉత్తరకొరియాకు చైనా, సహా పలు దేశాలు మద్దతునిస్తున్నాయని వార్తల నేపథ్యంలో దక్షిణ కొరియాకు అండగా అగ్రరాజ్యం నిలిచింది. దీంతొ ఆ రెండు దేశాలు.. కవ్వింపులకు, కాలుదువ్వడాలకు పోయి.. ఇక నువ్వా-నేనా అనే స్థాయి వరకు వెళ్లాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం ప్రపంచదేశాలను విస్మయానికి గురిచేసింది. ఇదే క్రమంలో ట్రంప్ అలోచనలను స్వాగతిస్తూ.. చారిత్రాత్మక సమావేశానికి తాను కూడా హాజరవుతానని.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సమ్మతించడం అభినందనీయమనే అంటున్నాయి ప్రపంచదేశాలు.

గత కొంతకాలంగా ఎదురు చూపిన శుభతరుణం రానే వచ్చింది. ఇవాళ సింగపూర్ లోని సెంటోసా ఐల్యాండ్ లో క్యాపెల్లా హెటల్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ లు  కీలక భేటీలో పాల్గోన్నారు. దాదాపుగా గంటన్నర పాటు ఇద్దరు ముఖాముఖి సమావేశంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఉభయుల మధ్య చర్చలు సాగగా, అణ్వాయుధాలను వీడాలన్న డిమాండ్ పైనే ప్రధానంగా ట్రంప్ మాట్లాడారు.

ఇక ఈ భేటీ అనంతరం ట్రంప్ స్పందిస్తూ, సహృద్భావ వాతావరణంలో కిమ్ తో చర్చలు సాగినట్టు వెల్లడించారు. ప్రపంచాన్ని భయపెడుతున్న ఓ పెద్ద సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతో తామిద్దరం కలిశామని, కిమ్ తో ఏకాంతంగా జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇస్తాయనే నమ్ముతున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉభయ కొరియా దేశాల మధ్య నిన్నటి ఉద్రిక్తతలు రేపటి యుద్దానికి దారి తీయరాదని భావించి తాను కిమ్ తో కలసి చారిత్రాత్మక చర్చలు జరిపానని అన్నారు. మార్పు సాధ్యమనే తామిద్దరం నిరూపించామని చెప్పారు.

యుద్దం ఎవరైనా చేస్తారని అయితే దాని వల్ల జరిగే నష్టాలను అంచానా వేసి.. ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకున్నా.. ఇక చివరిసారిగా చర్చల ప్రయత్నం చేయడం కేవలం సాహసం వున్నవాళ్లు మాత్రమే చేస్తారని.. శాంతిప్రక్రియకు స్వీకారం చుట్టడం అంత సులువైన పనికాదని ట్రంప్ అన్నారు. తమ చర్చలు అనుకున్న దానికన్నా చాలా సహృద్బావ వాతావరణంలో చక్కగా జరిగాయని అన్నారు. దీంతో ఉభయకొరియాల ప్రజలు శాంతియుతంగా సామరస్యంగా జీవిస్తారని, జీవించాలని తాను అకాంక్షిస్తున్నట్లు చెప్పారు. క్షిపణి ప్రయోగ కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేస్తామని కిమ్ హామి ఇచ్చారని చెప్పారు. దీంతో త్వరలోనే అణు నిరాయుధీకరణ జరుగుతుంది ఆయన అశాభావం వ్యక్తం చేశారు.

అయితే అణ్వాయుధాల నిర్వీర ప్రక్రియ చాలా క్లిష్టమైనది అని అన్నారు. మా శాంతి చర్చలు ప్రపంచ దేశాలకు అనందం కలిగించాయని ట్రంప్ అన్నారు. తాను కిమ్ ను శ్వేతసౌధానికి రావాల్సిందిగా కూడా అహ్వానించానని ట్రంప్ తెలిపారు. ఈ చారిత్రాత్మక సమావేశం నేపథ్యంలో తనకు కిమ్ తో చాలా ప్రత్యేకమైన బంధం ఏర్పడిందని ట్రంప్ పేర్కోన్నారు. ఇక ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాల వివరాలు కూడా త్వరలోనే తెలుస్తాయని చెప్పారు. ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడుతూ... ప్రపంచం పెద్ద మార్పును చూస్తుందని, తాను సమగ్ర ఒప్పందంపై సంతకం చేశానని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles