ramana deekshitulu meets ys jagan at lotus pond జగన్ తో రమణ దీక్షితులు భేటీ.. టీటీడీపై విసుర్లు..

Ramana deekshitulu meets ys jagan at lotus pond

tirumala tirupati devasthanam, former chief priest, ramana deekshitulu, YSR congress party, YS Jagan, lotus pond, TTD board, andhra pradesh, politics

tirumala tirupati devasthanam former chief priest ramana deekshitulu met YSR congress party chief YS Jagan at lotus pond and explained how TTD board expelled him from duties,

జగన్ తో రమణ దీక్షితులు భేటీ.. టీటీడీపై విసుర్లు..

Posted: 06/07/2018 04:32 PM IST
Ramana deekshitulu meets ys jagan at lotus pond

తనను అకారణంగా విధుల నుంచి అకస్మాత్తుగా తప్పించారని గత నెల రోజులుగా రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారిన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇవాళ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. టీటీడీ పాలక మండలి అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చినందుకే.. వయో పరిమితి నిబంధనను టీటీడీ కమిటీ భేటీలో అకస్మాత్తుగా చేర్చి.. దానిపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని అమోదించారని, ఇలా అమోదించగానే దానిని తక్షణం అమల్లోకి తీసుకువచ్చారని ఆయన తన అవేదనను జగన్ కు వివరించారు.

హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లోని  జగన్‌ నివాసానికి వచ్చిన రమణ దీక్షితులు ఆయనతో భేటీ అయ్యి పలు విషయాలపై చర్చించినట్ల సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డుపై రమణ దీక్షితులు తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు.  రహస్య తవ్వకాలతో పాటు శ్రీవారికి చెందిన పింక్‌ వజ్రం గురించి ఆయన  లేవనెత్తిన పలు అంశాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. రమణ దీక్షితులపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలాగే టీటీడీ బోర్డు కూడా రమణ దీక్షితుల వైఖరిని ఖండిచడమే గాకుండా... న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జగన్ ను రమణ దీక్షితులు భేటీ కావడం సంచలనం రేపుతోంది.

ఆ తరువాత రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ... "మా కష్టాలు చెప్పుకోవడానికి వచ్చాను.. ఈ చట్టాల వల్ల టీటీడీలో చాలా కష్టపడుతున్నాము.. మాకు ఉన్న సౌకర్యాలన్నింటినీ తీసేశారు. మమ్మల్ని హింసిస్తున్నారు. ఈ విషయాన్ని చెప్పుకోవడానికే వచ్చాను. మా కష్టాలు చెప్పుకోవడానికి కూడా కొందరు అవకాశం ఇవ్వలేదు. చాలా సార్లు విజయవాడకు వెళ్లి వచ్చాము.. మా కష్టాలు వినలేదు.. ఆకలిగా ఉన్నవాడు ఎవరు అన్నం పెడుతున్నారనేది చూడడు.. అన్నం పెడుతున్నాడా? లేడా? అన్నదే చూస్తాడు. మా కష్టాలు తీర్చేవారే కావాలి.. సీఎం చంద్రబాబును మా కష్టాలు తీర్చమనండి.. ఆయన ఫొటోను మా ఇంట్లో పెట్టుకుంటాము. మాకు కావాల్సింది ప్రశాంతంగా స్వామి వారి పూజ చేసుకోవడం. స్వామి వారి సొత్తును, పవిత్రతను కాపాడడం నాకు జన్మతః వచ్చిన హక్కు అది.. నేను పోరాడుతూనే ఉంటాను" అని వ్యాఖ్యానించారు.    

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles