boat accident in pulicat lake, passengers narrow escape పులికాట్ సరస్సులో తృటిలో తప్పిన పడవ ప్రమాదం..

Boat accident in pulicat lake passengers narrow escape

pulicat lake, godess poniyamma, poniyamma devotees narrow escape, boat accident in pulicat lake, nellore, bhavani islands, krishna river, godavari river, viral news, social media

Even after the boat accidents in krishna and godavari rivers the officials, had not responded to poniyamma devotees plea, which resulted in boat accident pulicat lake in nellore district, but passengers had a narrow escape

పులికాట్ సరస్సులో తృటిలో తప్పిన పడవ ప్రమాదం..

Posted: 06/07/2018 10:27 AM IST
Boat accident in pulicat lake passengers narrow escape

ఆంధ్రప్రదేశ్ లో వరుసగా పడవ ప్రమాదాలు సంభవిస్తూ.. పడవ మాత్రమే రావాణా వున్న ప్రాంతాల్లోని ప్రయాణికులను బెంబేలెత్తిస్తుంది. అనేక మంది ప్రాణాలను నదీమ తల్లులు బలిగొంటున్నాయి. అయితే ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగానే మరణాలు సంభవిస్తున్నాయని విమర్శలు వస్తున్నా ప్రభుత్వ అధికారులలో మాత్రం చలనం లేకపోవడం.. వారే పనిగట్టుకుని ప్రభుత్వానికి అప్రతిష్టను తీసుకురావాలని యత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా పులికాట్‌లో మరో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది.

నెల్లూరు జిల్లా తడ మండలం ఇరకం దీవిలో జరుగుతోన్న పొన్నియమ్మ రథోత్సవాలను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇరకం దీవికి వెళ్లాలంటే పడవ ప్రయాణాలు తప్ప మరో మార్గం లేదు. దీంతో భీములవారిపాళెం నుంచి ఇరకం దీవికి మత్స్యకారులు పలు పడవలు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరకం దీవి నుంచి బుధవారం సాయంత్రం 30 మంది భక్తులతో భీములవారిపాళెం రేవుకు వస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. గమ్యస్థానానికి కొద్ది దూరంలో పడవలోకి నీళ్లు చేరడంతో అది మునిగిపోయింది.

అయితే చిన్న పడవలో ఎక్కువ మంది భక్తులు ఎక్కడంతో అది మునిగిందని స్థానికులు చెబుతున్నా.. ఓ ఆలయంలో రథోత్సవం జరుగుతున్నా.. అక్కడి అధికారులు అన్ని ఏర్పాట్లను చేశామని భావిస్తున్నారే తప్ప.. భక్తులు వచ్చేందుకు తగు రవాణ వ్యవస్థను మాత్రం ఏర్పాటు చేయడంలో ఏళ్లుగా విఫలం అవుతూనే వున్నారన్న విమర్శలు వున్నాయి. ఈ సారి కూడా భక్తులు అధికారులకు పడవ ఏర్పాట్లు విషయమై విన్నవించుకున్నా అది చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే అయ్యింది. రాష్ట్రంలో వరుస పడవ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని భక్తులు అరోపిస్తున్నారు.

దీంతో ఒక్కసారిగా పడవలోకి నీళ్లు చేరి, ఒడ్డుకు సమీపం కావడంతో నేలకు అనింది. దీన్ని గమనించిన అక్కడివారు తక్షణమే మరో పడవను తీసుకెళ్లి వాళ్లందరినీ ఒడ్డుకు తరలించారు. పడవ నీటిలో మునిగిపోవడంతో భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఊహించని ఈ ప్రమాదానికి నిశ్చేష్టులయ్యారు. కాగా ఇదే ప్రమాదం సరస్సు మధ్యలో జరిగుంటే మళ్లీ అమాయక ప్రాణాలు ఎన్నో గాల్లో కలిసేవని, భక్తులు భయాందోళన వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపమే ఈ ఘటనకు కారణమని కూడా వారు విమర్శిస్తున్నారు.

భవానీ ద్వీపం వద్ద పడవ మునిగి 20 మంది దాక మృత్యువాత పడ్డారు. గోదావరిలో లాంచి మునకతో అమాయక ప్రాణాలు గాల్లో కలిశాయి. అయినా అధికారుల్లో మాత్రం చలనం కరువైంది. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే అధికారులు.. తామున్నది ప్రజలకు వసతులను ఏర్పాటు చేసేందుకేనన్న విషయం మరిచారు. పులికాట్‌ సరస్సులో పడవల్లో ప్రయాణించే వారికోసం ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టలేదు. ప్రమాదం జరిగితే కానీ అధికారులు కదలరా అన్న అనుమానం అందరిలో నెలకొంది. డిసెంబరు 2011లో పులికాట్‌లో జరిగిన పడవ ప్రమాదం సంభవించి 22 మంది మృతిచెందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles