24 MLAs, 1 MLC get Cabinet berths in kumaraswamy govt కర్ణాటక క్యాబినెట్.. 24 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఛాన్స్..

Karnataka ministry expansion 24 mlas 1 mlc get cabinet berths

Vajubhai Vala, Kumara Swamy, Congress, JD(S), karnataka assembly, congress mlas, jds mlas, shivakumar, Siddaramaiah, karnataka governor, Raj Bhavan, Congress, JDS, karnataka, politics

Karnataka chief minister HD Kumaraswamy carried out the first expansion of his cabinet, including nine leaders from the Janata Dal (Secular) or JD (S) and 14 of the Congress in the coalition government.

కర్ణాటక క్యాబినెట్.. 24 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఛాన్స్..

Posted: 06/06/2018 05:03 PM IST
Karnataka ministry expansion 24 mlas 1 mlc get cabinet berths

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకరం చేసి పక్షం రోజులు అయిన తరువాత ఆ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఇవాళ జరిగింది. రాజ్ భవన్ లోని గ్లాస్ హాల్లో ఈ కార్యక్రమం కాంగ్రెస్, జేడీఎస్ కూటమి వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యుల మధ్య కొనసాగింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి బలనిరూపణ చేసిన తరువాత.. అటు బీజేపి, ఇటు రాజకీమ విమర్శకులు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం.. ప్రజలకు పాలనాసౌలభ్యాన్ని అందించకపోవడంపై విమర్శలు చేసిన అనంతరం ఇవాళ క్యాబినెట్ మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.

రాజ్ భవన్ లో కర్ణాటక గవర్నర్‌ వాజుభాయి వాలా మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా డీకే శివకుమార్‌, బండెప్ప కాశంపూర్‌, హెచ్‌ డీ రేవణ్ణ, ఆర్‌వీ దేశ్‌పాండే, జీటీ దేవెగౌడ, కేజే జార్జ్ లతో పాటు బీఎస్పీ, కేజీపి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్‌ మద్దతుతో ఇటీవలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీఎస్‌.. మంత్రివర్గ విస్తరణపై చాలా సమయం తీసుకుని.. చర్చోపచర్చలు జరిపిన అనంతరం ఇవాళ మంత్రివర్గ కూర్పుపై ఎట్టకేలకు తుది నిర్ణయం తీసుకుంది.

కాంగ్రెస్ నుంచి 14 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా, జేడీఎస్ నుంచి తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బీఎస్పీ, కేపీజేపి నుంచి చెరో ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బీఎస్సీ నుంచి మహేష్, కర్ణాటక ప్రజా జనతా పక్ష పార్టీ నుంచి శంకర్ లు ప్రమాణస్వీకారం చేశారు. ఇక మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారి పూర్తి జాబితా ఇదే..

1     D K శివకుమార్     కాంగ్రెస్
2      R V దేశ్పాండే      కాంగ్రెస్
3      KJ జార్జ్              కాంగ్రెస్
4      కృష్ణ బైర్ గౌడ       కాంగ్రెస్
5      రాజశేఖర్ పాటిల్   కాంగ్రెస్
6      శివానంద్ పాటిల్   కాంగ్రెస్
7      ప్రియాంకా ఖార్గే     కాంగ్రెస్
8      U T ఖదర్          కాంగ్రెస్
9      జామిర్ అహ్మద్ ఖాన్     కాంగ్రెస్
10     పుట్టరంగా షెట్టి   కాంగ్రెస్
11     శివశంకర రెడ్డి     కాంగ్రెస్
12     జయమల         కాంగ్రెస్
13     రమేష్ జార్కిహోలీ  కాంగ్రెస్
14     వెంకటరామనప్ప     కాంగ్రెస్
15     H D రెవణ్ణ         జెడి (ఎస్)
16     G T దేవేగౌడ     జెడి (ఎస్)
17     బంధపా కాశంపూర్     జెడి (ఎస్)
18     సి ఎస్ పుతరాజు     జెడి (ఎస్)
19     వెంకటరావు నాదగౌడ     జెడి (ఎస్)
20     SA RA మహేష్     జెడి (ఎస్)
21     DC తమన్నా     జెడి (ఎస్)
22     MC మనాగులి     జెడి (ఎస్)
23     SR శ్రీనివాస్     జెడి (ఎస్)
24     R శంకర్        కేపీజేపి
25     మహేష్         బిఎస్పి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HD kumara swamy  shiva kumar  vajubhai vala  raj bhavan  cabinet  Congress  JD(S)  karnataka  politics  

Other Articles