Two held for cheating youngster in Hyderabad ఈజీ మనీ వేటలో అడ్డంగా బుక్కైన ఫీల్మ్ ఎడిటర్

Two held for trapping gullible on online chat and extorting money

online chat,cyber crime,Two held for trapping gullible on online chat,Two held for trapping,Naveen Reddy,K Naga Swathi, rachakonda police, telangana, crime

Cyber crime sleuths of Rachakonda on Friday arrested two persons for duping people after getting close to them through online sex chat. The accused are identified as S Naveen Reddy and K Naga Swathi from Chintal

ఈజీ మనీ వేటలో అడ్డంగా బుక్కైన ఫీల్మ్ ఎడిటర్

Posted: 06/02/2018 02:13 PM IST
Two held for trapping gullible on online chat and extorting money

తప్పులు చేయడం.. వాటిని సరిచేయడానికి ఈజీ మనీ కోసం వెంప్లరాడట.. అత్యాశపరులను నేరప్రవృత్తి వైపు బాటలు వేసేలా చేస్తుంది. ఫిల్మ్ ఎడిటర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి తన అదృష్టం దారిమళ్లితే.. పేరొందిన ప్రముఖ ఎడిటర్ గా మారే అవకాశాన్ని జారవిడుచుకుని తప్పులు చేసి.. తానిని సరి చేసుకునేందుకు మరో తప్పు చేసి.. ఇలా ఒకదానిపై మరోకటి చేస్తూ చివరకు పోలీసులకు చిక్కి కటకటాలను లెక్కబెడుతున్నాడు. సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి మోసాలకు పాల్పడి అమెకు కూడా అరదండాలు వేయించాడు.

రాచకొండ కమిషనరేట్ పోలీసుల కథనం ప్రకారం.. చింతల్‌కు చెందిన సలిమిడి నవీన్ రెడ్డి ఓ సంస్థలో ఫిలిం ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. వివాహమై ఇద్దరు పిల్లలున్నా, మరో మహిళతో సహజీవనం చేస్తూ అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. రెండు కుటుంబాలను పోషించడం కష్టంగా మారడంతో ఈజీ మనీ కోసం నవీన్ రెడ్డి వేట ప్రారంభించాడు. అతని బుర్రకు సైబర్ నేరాగాళ్లు ఎలా డబ్బులు సంపాదిస్తున్నారన్న ఐడియా తట్టింది.

సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి సోషల్ మీడియాలో చాటింగ్ చేసి అమాయకులను బుట్టలో పడేయడం ద్వారా డబ్బులు సంపాదించాలని పథకం వేశాడు. అదే సమయంలో ఓ చాట్ రూం వెబ్‌సైట్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ కనిపించడంతో రంగంలోకి దిగాడు. మహిళతో చాటింగ్ చేయించాడు. తర్వాత అతడి నెంబరు తీసుకుని వాట్సాప్‌లోనూ చాటింగ్ మొదలుపెట్టారు. ప్రేమగా మాట్లాడుతూ మొత్తానికి అతడిని బుట్టలో పడేశారు. ఈ క్రమంలో తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమయ్యాయని, రెండుమూడు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికి ఆమె రూ.20వేలు తీసుకుంది.

కొన్ని రోజుల తర్వాత తన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితుడు ఒత్తిడి తీసుకురావడంతో విజయవాడలో ఉన్న తన స్థలాన్ని విక్రయిస్తున్నానని, రిజిస్ట్రేషన్ కోసం రూ.2 లక్షలు అవసరముందని, ఆ డబ్బులు సర్దితే రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మొత్తం డబ్బులు ఇచ్చేస్తానని చెప్పింది. దీంతో రూ.1.80 లక్షలను ఆమె బ్యాంకు ఖాతాలో వేశాడు. ఆ తర్వాతి నుంచి ఆమె ఫోన్ నంబరు పనిచేయడం మానేసింది. దీంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : online chat  cyber crime  Naveen Reddy  K Naga Swathi  rachakonda police  telangana  crime  

Other Articles