AP government to take up unemployment stipend నిరుద్యోగ యువతకు ఆసర.. భృతిపై ప్రభుత్వం కీలక ప్రకటన

Ap government to take up unemployment stipend

unemployment stipend, andrapradesh cabinet, AP government, online applications for stipend, election promise, chandrababu naidu, unemployed youth, YS Jagan, Pawan kalyan, tdp, ysrcp, jana sena, bjp, congress, andhra pradesh

Andhra pradesh government had finally take unemployment stipend, which was an election promise of the chandrababu naidu in the past elections, finally AP Cabinet took up the issue and impliment the scheme in the next couple of months.

నిరుద్యోగ యువతకు ఆసర.. భృతిపై ప్రభుత్వం కీలక ప్రకటన

Posted: 06/01/2018 10:23 AM IST
Ap government to take up unemployment stipend

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురును అందించింది. గత ఎన్నికలలో ఇచ్చిన హామీని కనీసం ఎన్నికలకు సమాయత్తమౌతున్న వేళైనా అమలు చేయాలని నిర్ణయిచింది. దీంతో మరోమారు యువత ఓట్లను తమ ఖాతాలోకి వేసుకోవాలన్న యోచనతో టీడీపీ ప్రభుత్వం ఈ చర్యలకు స్వీకారం చుట్టింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఓట్లను భృతి ప్రకటనతో తమ వైపు తిప్పుకోవడంలో గత ఎన్నికలలో సఫలమైన తెలుగుదేశం పార్టీ.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతిని మాత్రం కల్పించలేదు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగ భృతి కల్పించడం లేదని నిరుద్యోగులు అవేదన చెందారు. వారి తరపున ప్రతిపక్ష పార్టీ వైసీపి జనంలోకి వెళ్లి ప్రతీసారి ఎన్నికల హామీలను మరీ ముఖ్యంగా నిరుద్యోగ భృతి విషయమై ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ్ముళ్లు, చెల్లులు మీకు నిరుద్యోగ భృతి వచ్చిందా.? అంటూ ప్రశ్నించారు. ఇలా ఆయన చేస్తున్న ప్రచారం యువతలోకి మాత్రం చాలా వేగంగా వెళ్లింది. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న నిరుద్యోగ భృతి అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని 10 లక్షల మంది యువతకు నెలకు 1000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. డిగ్రీ లేక డిప్లొమా లేక ఆపైన చదివిన నిరుద్యోగులకు మాత్రమే నిరుద్యోగ భృతి పొందేందుకు అర్హులుగా పేర్కొంది. నిరుద్యోగ భృతి కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు గత బడ్జెట్ లో రూ.1000 కోట్లు కేటాయించిన నేపథ్యంలో వాటిని సక్రమంగా యువత బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లేట్లు చూడాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది.

ఈ విషయంపై అమరావతిలో మీడియాతో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ... నిరుద్యోగ భృతి అమలుపై తాము ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం 10 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిందని, ఆ తరువాత విధివిధానాలు రూపొందించామని అన్నారు. పరిమితి అన్నది లేకుండా కుటుంబంలో ఎంతమంది అర్హులున్నా అందరికీ వర్తిస్తుందని అన్నారు. అయితే, అభ్యర్థులు బీపీఎల్ (దారిద్ర్య రేఖకు దిగువున) కుటుంబానికి చెందిన వారై వుండి, తెల్ల రేషన్ కార్డు కలిగి వుండాలని.. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 22 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సులై వుండాలని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles