Karnataka bandh evokes poor response across state కటకటా.. అధికులమన్నారు.. పరువుపోగొట్టుకున్నారు..

Bjp bandh evokes lukewarm response yeddyurappa calls it a success

BJP Bandh, BJP, BJP bandh, farmers, lukewarm response, h d kumaraswamy, B S Yeddyurappa, loan waiver, karnataka, politics

The bandh by the BJP, demanding farmers’ loans be waived by the Congress-JD(S) coalition government, evoked a lukewarm response which forced party activists, led by their MLAs, to take to the streets in many places to enforce shutdowns.

కటకటా.. అధికులమన్నారు.. పరువుపోగొట్టుకున్నారు..

Posted: 05/29/2018 07:14 PM IST
Bjp bandh evokes lukewarm response yeddyurappa calls it a success

కర్ణాటక ప్రజలు తమ పార్టీకే నైతికంగా అధికారాన్ని అప్పగించారని.. ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వం అనైతిక పోత్తుతో ఏర్పడిందని సాక్షత్తు బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గత ఎన్నికలలో బీజేపి అతిపెద్ద పార్టీగా అవిర్భవించిన లెక్కలను చూపుతూ చెసిన వ్యాఖ్యలివి. అయితే ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వానికి కనీసం ఊపిరి తీసుకునే వెసలుబాటు కూడా ఇవ్వకుండానే అనైతిక పోత్తులోని ప్రభుత్వం రైతుల రుణాలను తక్షణం మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపి రాష్ట్రశాఖ అప్పుడే బంద్ కు కూడా పిలుపునిచ్చింది.

రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కుమారస్వామి మాట తప్పారని ఆరోపిస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన కర్ణాటక బీజేపీ నేతలు ఇప్పుడు తీరిగ్గా చింతిస్తున్నారు. వారిచ్చిన బంద్ పిలుపునకు ప్రజల నుంచి ముఖ్యంగా రైతుల నుంచి లేశమాత్రమైనా స్పందన లేకపోవడం బీజేపీ నేతలకు తలకొట్టేసినట్టు అయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలను మాఫీ చేస్తానని కుమారస్వామి ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రోజులు గడుస్తున్నా రుణమాఫీ చేయడం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. రూ.53 వేల కోట్ల విలువైన రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ  సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.

స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలంటూ రైతులు, ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా బంద్ ప్రభావం కనిపించలేదు. స్కూళ్లు, కాలేజీలు, రవాణా వ్యవస్థలకు ఎక్కడా ఆటంకం కలగలేదు. బంద్ పిలుపులో రాజకీయ కోణం ఉందన్న కారణంతో చాలామంది రైతులు, కన్నడ సంస్థలు బంద్‌కు దూరంగా ఉన్నాయి. తామిచ్చిన బంద్ పిలుపు అట్టర్ ఫ్లాప్ కావడంతో ప్రతిపక్ష బీజేపీ నిరాశలో కూరుకుపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP Bandh  BJP  BJP bandh  farmers  lukewarm response  h d kumaraswamy  B S Yeddyurappa  loan waiver  karnataka  politics  

Other Articles