HD Kumaraswamy wins floor test in Karnataka విశ్వాస పరీక్షలో నెగ్గిన కూటమి ప్రభుత్వం..

Hd kumaraswamy wins karnataka floor test after bjp walkout

AR Ramesh kumar, karnataka speaker, Kumara Swamy, trust vote, bjp, walkout, vidhana soudha, karnataka assembly, vidhana soudha, Siddaramaiah, Congress, BJP, JDS, B.S. Yeddyurappa, BJP, Congress, JD(S), karnataka assembly, K G. Bopaiah, assembly speaker, speaker election, congress mlas, jds mlas, karnataka, politics

HD Kumaraswamy has won the trust vote in the Karnataka assembly, ending the 10-day political uncertainty in the state.

విశ్వాస పరీక్షలో నెగ్గిన కూటమి ప్రభుత్వం..

Posted: 05/25/2018 06:03 PM IST
Hd kumaraswamy wins karnataka floor test after bjp walkout

కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈనెల 23న బీజేపీయేతర పార్టీల ప్రముఖల సమక్షంలో అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేసిన హెచ్‌డీ కుమారస్వామి ఇవాళ అసెంబ్లీలో తన ప్రభుత్వం తరుపున స్పీకర్ ఏఆర్ రమేష్ కుమార్ ను కూడా అదే స్ట్రాటెజీతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేసింది కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం. చివరాఖరు వరకు పోటీలో తమ అభ్యర్థి సురేష్ కుమార్ ను బరిలో వుంచిన బీజేపి.. తాము అశించినట్లుగా అసంతృప్తులు ఏవరూ నిరసన గళం విప్పకపోవడంతో.. తమ ఆశలపై నీళ్లు పడ్డాయని భావించింది. ఇక వరుసగా పోతున్న పరువును కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా స్పీకర్ బరి నుంచి తమ అభ్యర్థిని తప్పించి.. రమేష్ కుమార్ ఎన్నికను ఏకగ్రీవం చేసింది.

శుక్రవారం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గారు. ఆయనకు అనుకూలంగా 117 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దీంతో బలపరీక్షలో కుమారస్వామి నెగ్గినట్టు స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. అంతకుముందు, సభలో విశ్వాస తీర్మానాన్ని కుమారస్వామి ప్రవేశపెట్టారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్-జీడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందని, సుస్ధిర ప్రభుత్వాన్ని తాము అందిస్తామని చర్చ సందర్భంగా కుమారస్వామి సభకి తెలిపారు. కర్నాటకలో ఈ సారి ఓటరు తీర్పు ఏ పార్టీకీ అనుకూలంగా లేదని.. ఈ పరిస్థితుల్లో ప్రజలకు మేలైన ప్రజాప్రభుత్వం అందించేందుకు తమ నిర్ణయం దోహదపడిందన్నారు,

అయితే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము కాంగ్రెస్ తో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ క్రమంలో తాను తనకు లభించిన ముఖ్యమంత్రి పదవిపై సంతృప్తిగా లేనన్న ఆయన బీజేపి లాంటి మతతత్వ పార్టీలు అధికారంలోకి వస్తే.. ప్రశాంతంగా వున్న కార్ణటక.. అరాచకాలు జరగుతాయని, ఈ క్రమంలో సెక్యూలర్ పార్టీలన్నీ కలసి బీజేపిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంతో తాము కాంగ్రస్ తో పొత్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు.

బీజేపీ నేత యడ్యూరప్ప మాట్లాడుతూ, 24 గంటల్లోగా రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. గౌడ కుటుంబసభ్యులపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీని గతంలో కాంగ్రెస్, జేడీఎస్ వంచించాయని, వారికీ అదే గతి పడుతుందంటూ మండిపడ్డారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలంతా సభ నుంచి వాకౌట్ చేయడం ద్వారా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అనంతరం మూజువాణి ఓటుతో హెచ్‌డీ కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కాగా ఈ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత శివకుమార్ స్పందిస్తూ.. తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యయుత ధోరణిలో తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి వున్నామని, ఎవరికీ ఎలాంటి అసంతృప్తులు లేవని మరోమారు స్పష్టమైందని అన్నారు. అయితే రైతు రుణాలను తక్షణం మాఫీ చేయాలని బీజేపి చేస్తున్న బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తాము పూర్తిగా వ్యతిరేకమన్నారు. తమ పార్టీ మానిఫెస్టోలు తాము అమలు చేస్తామన్నారు. ఇక బీజేపి అశలను తమ ప్రభుత్వం ఎలా నెరవేస్తుందని కూడా ప్రశ్నించారు.

రైతు రుణాలను మాఫీ చేయాలంటే.. కేంద్రంలో వున్న తమ ప్రభుత్వంతో మాట్లాడి యావత్ దేశంలో వున్న రైతుల రుణాలన్నింటినీ ఒకే సంతకంతో కేంద్రం మాఫీ చేయవచ్చుకదా అని అడిగారు. యడ్యూరప్ప తమ పార్టీని పొగుడుతూ, కుమారస్వామిని తూలనాడుతూ చేసిన ప్రసంగం కూడా బీజేపి ఎత్తుగడలో భాగమనే అని వ్యాఖ్యానించిన ఆయన బీజేపి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తాము లొంగబోమని స్పష్టం చేశారు. కూటమిలోని రెండు పార్టీలకు కామన్ మినిమమ్ ప్రోగామ్ ఏర్పాటు చేసుకుని దానిద్వారా ప్రజలకిచ్చిన అన్ని హామీలను నెరవేస్తామని శివకుమార్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trust vote  bjp  walkout  vidhana soudha  Kumara Swamy  SM krishna  Siddaramaiah  karnataka  politics  

Other Articles