pawan kalyan deeksha begins దీక్షకు ప్రారంభించిన పవన్ కల్యాణ్

Janasena chief pawan kalyan deeksha begins

pawan kalyan, janasena, Pawan Kalyan deeksha, uddanam kidney problem, health minister, bus Yatra, gangavaram, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, Pawan Kalyan gangapooja, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan begins his one day deeksha in srikakulam demanding immediate appointment of health minister in andhra pradesh, but the government seems to ignore janasena demand.

ITEMVIDEOS: నిరాహారదీక్షను ప్రారంభించిన జనసేనాని పవన్ కల్యాణ్

Posted: 05/25/2018 05:19 PM IST
Janasena chief pawan kalyan deeksha begins

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంలో ఒక రోజు దీక్షకు ప్రారంభించారు. రాష్ట్రంలో వైద్యఅరోగ్య శాఖ మంత్రిని నియమించాలన్న పవన్ డిమాండ్ పై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆయన ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి దీక్షకు పూనుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎస్ కోట ప్రాంతానికి చేరువలోని ఒక రిసార్టులో తాను బస చేస్తున్న చోటే పవన్ కల్యాణ్ ఈ దీక్షకు పూనుకున్నారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు రిసార్టులోనే పవన్ కల్యాణ్ దీక్షలో పాల్గోననున్నారు.

కాగా రేపు సాయంత్రం ఐదు గంటలకు తన దీక్ష పూర్తికానుంది. ఈ నేపథ్యంలో రేపు మాత్రం తన పోరాట యాత్ర యధావిధంగానే కొనసాగుతుందని, యాత్రలో వున్నా పవన్ ప్రజల మధ్యనే తన దీక్షను కొనసాగిస్తారని జనసేన వర్గాలు స్పష్టం చేశాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజల సమస్యలను తెలుసుకున్న తరువాత ఐదు గంటలకు పవన్ తన దీక్షను విరమిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. అయితే పవన్ దీక్షకు పోలీసుల నుంచి ఇంకా అనుమతి లభించలేదని తెలుస్తుంది. ఒకవేళ అనుమతి లభిస్తే.. పవన్ దీక్ష రేపు ఎన్టీయార్ మున్సిపల్ స్టేడియంలో కొనసాగుతుందని జనసేన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ధీక్షతో పవన్ కల్యాన్ టీడీపీ ప్రభుత్వంపై దెబ్బకు రెండు పిట్టలు అన్న విధంగా వ్యవహరిస్తున్నారని కూడా వార్తలు వినబడుతున్నాయి.

అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనారోగ్యం బారిన ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఆ శాఖకు మంత్రి లేకపోడం, ప్రజల దౌర్బాగ్యమని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రసంగిస్తూ చెప్పిన పవన్ కల్యాన్ తక్షణం ఆ శాఖకు మంత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఎంతో మంది ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, మరెందరో దీర్ఘకాలిక సమస్యను ఎదుర్కొంటున్నారని వారి సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన అరోగ్య మంత్రిత్వశాఖకు మంత్రే లేకపోవడం శోచనీయమన్నారు. ఈ సందర్బంగా 48 గంటల్లో చంద్రబాబు ప్రభుత్వ ఈ సమస్యపై స్పందించిన పక్షంలో తాను దీక్షకు పూనుకుంటానని కూడా చెప్పారు.

ఈ క్రమంలో 48 గంటల సమయం గడుస్తున్నా.. తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన దీక్షకు పూనుకున్నారు. దీక్షకు దిగేందుకు ముందు సామాజిక మాధ్యమం ద్వారా పలు డిమాండ్లను ప్రభుత్వం ఎదుట పెట్టారు పవన్. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను తక్షణం పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. అన్ని గ్రామాల్లో స్ర్కీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, కిడ్నీ వ్యాది నిర్థారణ పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించాలని.. డయాలసిస్ కేంద్రాలలో శిక్షణ పొందిన మెడికల్ స్టాప్ వుండాలన్న డిమాండ్లను ప్రభుత్వం ఎదుట పెట్టారు. ఆ డిమాండ్లు ఇవే..

*    ఉద్దానంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి.
*    ఉద్దానంలోని అన్ని గ్రామాల్లో మొబైల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు కిడ్నీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి.
*    అన్ని డయాలసిస్ కేంద్రంలో ట్రెయిన్డ్ స్టాప్, పారా మెడికల్ సిబ్బందిని నియమించాలి. వారానికి ఒకసారి డయాలసిస్ కేంద్రానికి నెఫ్రాలజిస్టు వెళ్లి చికిత్స అందించాలి.
*    డయాలసిస్ కేంద్రాలను పెంచాలి. ఈ కేంద్రాలకు అనుబంధంగా బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలి.
*    కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మందులను ఉచితంగా అందించాలి.
*    రాష్ట్రానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని వెంటనే నియమించాలి.
*    డయాలసిస్ చేయించుకునేవారికి... అన్ని స్టేజుల్లో ఉన్నవారందరికీ పింఛన్లు అందించాలి.
*    కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి.
*    శుద్ధి చేసిన నీటిని ప్రతి గడపకూ అందించాలి.
*    వ్యాధి ప్రబలడానికి మూలాలను అన్వేషించేందుకు పరిశోధన కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి.
*    ముఖ్యమంత్రి స్వయంగా ఉద్దానం కిడ్నీ సమస్య, నివారణ చర్యలను పర్యవేక్షించాలి. దీని కోసం స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేయాలి.

ఇక గతంలో జనసేనాని పవన్ కల్యాన్ లేవనెత్తిన డిమాండ్లను ప్రభుత్వం యుద్దప్రాతిపదికన తీసుకుని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలను తీసుకుంది. అయితే ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని పవన్ అరోపించిన నాటి నుంచి ప్రభుత్వం పవన్ డిమాండ్లపై అసలు స్పందించడం లేదు. అయితే తాను ప్రభుత్వంతో వున్నప్పుడు అఘమేఘాల మీద సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు విమర్శించగానే తాన ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన డిమాండ్లపై ఎలా కాలయాపన చేస్తూ.. స్పందించడం లేదో కూడా పవన్ చూపనున్నారని తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  one day deeksha  resort  srikakulam  porata yatra  bus yatra  andhra pradesh  politics  

Other Articles