Psycho Hulchul in Nellore, molests woman నెల్లూరు రైల్వేస్టేషన్లో సైకో వీరంగం.. మహిళపై అత్యాచారయత్నం

Psycho hulchul in nellore attack new couple molest woman

psycho, nellore, akkampeta railway station, molestation, newly married couple, akkampeta police, vijay kumar, uttar pradesh, railway police, andhra pradesh, crime

Psycho creates Hulchul in Nellore akkampet railway station, attacks new couple and attempts to molest woman, locals rushed to the spot caught psycho and handovered to police

ITEMVIDEOS: నెల్లూరు రైల్వేస్టేషన్లో సైకో వీరంగం.. మహిళపై అత్యాచారయత్నం

Posted: 05/24/2018 11:52 AM IST
Psycho hulchul in nellore attack new couple molest woman

నెల్లూరులో సైకో వీరంగం సృష్టించాడు. ఓ యువ జంటపై సైకో దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత యువకుడి పక్కనే వున్న మహిళపై అత్యాచార యత్నానికి కూడా పాల్పడ్డాడు. మహిళ అరుపులు, కేకలు విన్న స్థానికులు వచ్చి సైకోను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా అక్కంపేట రైల్వే స్టేసన్ లోకి వెళ్లిన ఓ యువజంట.. రైలు కోసం ఎదురుచూస్తే స్టేషన్లో కూర్చుంది. వారిని దూరం నుంచి గమనించిన సైకో.. ఆ జంటపై అకారణంగా దాడికి పాల్పడ్డాడు.

ముందుగా రైల్వే స్టేషన్లో వున్న యువకుడిపై కర్రతో దాడి చేశాడు. ఆ తరువాత మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. మహిళ అరుపులు, కేకలు వేయడంతో స్థానికులు సైకోను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సైకో దాడిలో యువకుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. కాగా, అత్యాచారయత్నానికి గురైన బాధిత మహిళను ప్రభుత్వ అసుపత్రికి తరలించిన పోలీసులు వైద్య చికిత్సను అందిస్తున్నారు. బాధిత యువకుడికి కూడా వైద్యం సాయాన్ని అందించారు. కాగా, యువజంటపై దాడికి పాల్పడిన నిందితుడిని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అజయ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles