Narrow escape for man as he crosses metro track యువకుడికి వెంట్రెకవాసిలో తప్పిన రైలు ప్రమాదం

Delhi metro driver saves 21 year old man while he was crossing tracks

Shastri Nagar Metro station, Mayur Patel, fine, narrow escape, Rohini, Delhi Metro, CCTV, New Delhi, Metro police

A 21-year-old man had a narrow escape when he tried to cross the track at Shastri Nagar Metro station just when the train had started leaving the station. Mayur Patel, who was travelling by the Metro for the first time, was later fined by authorities.

ITEMVIDEOS: ఈ యువకుడికి భూమ్మిద నూకలున్నాయ్..!

Posted: 05/23/2018 10:41 AM IST
Delhi metro driver saves 21 year old man while he was crossing tracks

నీకు ఇంకా భూమ్మిత నూకలు బాకీ వున్నాయిరా..? అంటూ పాతకాలపు పెద్దలు ఎవరైనా వుంటూ ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే అదే మాట అంటారు. ఎందుకంటలే రైలు ఢీ కొట్టిన తరువాత కూడా ప్రాణాలతో బతికి బయటపడ్డాడంటే అశ్చర్యపడక తప్పదు కదా. దేశ రాజధానిలో జరిగిన ఈ తరహా ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సిసిటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైయ్యాయి. అవికాస్తా సోషల్ మీడియాలో పోస్టు కావడంతో.. నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

ఓ యువకుడు.. మెట్రో రైల్ ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడ ఓ రైలు ప్రయాణానికి సిద్దంగా వుంది. అయినా ఫర్వాలేదులే.. రోజు వుండేదేగా.. దాని ముందు నుంచి వెళ్దాం.. అనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా.. మెట్రో రైలు పట్టాలను దాటుకుంటూ సరిగ్గా రైలు ముందుకు వెళ్లాడు. ఇక తీరా రైలు ఫ్లాట్ ఫారం ఎక్కే సమయంలో రైలు కాస్తా ముందుకు కదిలింది. యువకుడిని కూడా ఢీకొన్నింది. అదే సమయంలో వ్యక్తి వున్న విషయాన్ని గుర్తించిన మెట్రో రైలు పైలెట్.. సడన్ బ్రేక్ వేయడంతో.. యువకుడు బతికి బయటపడ్డాడు.

ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలోని శాస్త్రీనగర్ మెట్రో రైల్వే స్టేషన్‌లో జరిగింది. మయూర్ పటేల్ అనే 21 ఏళ్ల యువకుడు.. రైల్వే ట్రాక్ దాటకూడదన్న నిబంధనలను మర్చి.. తేలిగ్గా అవతలి వైపు చేరుకునేందుకు చేసిన ఈ చర్యతో రైల్వే అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చదువుకున్న వారే ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని.. కాసింత అలస్యమైతే ఏం జరిగేదన్న పరిణామాలను కూడా అలోచించాలని క్లాస్ తీసుకున్న అధికారులు.. యువకుడు తనది తప్పేనని అంగీకరించిన తరువాత.. అతనికి జరిమానా విధించి వదిలిపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shastri Nagar Metro station  Mayur Patel  fine  narrow escape  Rohini  Delhi Metro  CCTV  New Delhi  Metro police  

Other Articles