'Will you marry me': Man proposes in plane సినిమా స్టైల్లో విమానంలో ప్రియురాలికి పెళ్లి ప్రతిపాదన..

Love in the air man proposes to girlfriend aboard indigo flight in filmy style

wedding proposal, indian wedding proposal, creative wedding proposal, IndiGo, Proposal, Marriage, relationship, Couple, Indore, Madhya Pradesh, Goa, Airport, Indore Airport, airplane, Aero Bridge

A video going viral captures the moment a man in Madhya Pradesh's Indore got down on one knee and proposed to his girlfriend on board an IndiGo flight to Goa.

ITEMVIDEOS: విమానంలో మ్యారేజ్ ప్రపోజల్.. ఒక్కటైన జంట

Posted: 05/23/2018 11:19 AM IST
Love in the air man proposes to girlfriend aboard indigo flight in filmy style

తన గర్ల్ ఫ్రెండ్ ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టాలనుకున్న ఆ యువకుడు.. వినూత్నంగా అలోచించాడు. మరో రకంగా చెప్పాలంటూ సినిమా స్టైల్లో అమె ఎదుట తన ప్రతిపాదనను పెట్టాడు. తొలుత అశ్చర్యానికి గురైన అతని గర్ల్ ప్రెండ్.. ఆ తరువాత అతన్ని అన అలింగనం చేసుకుని.. తన సమ్మతిని చెప్పింది. అయితే ఈ ప్రియుడి వినూత్న ప్రతిపాదనకు విమానసిబ్బంది కూడా పూర్తిగా సహకరించారు. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు.

తన గర్ల్ ఫ్రెండ్ గోవాకు వెళ్తుందన్న విషయాన్ని తెలుసుకున్న ప్రియుడు ఎప్పుడు, ఏ విమానంలో వెళ్తుందన్న వివరాలను కూడా తెలుసుకున్నాడు. దీంతో అమెకు తన పెళ్లి ప్రపోజల్ చెప్పాలకున్న తాను.. ఇందుకు విమానాన్ని వేదికగా చేసుకున్నాడు. అదే విమానంలో ప్రయాణించే టిక్కెట్ ను సంపాదించిన తాను.. సరిగ్గా అమె విమానం ఎక్కిన తనకు కేటాయించిన సీటులోకి వెళ్లి కూర్చున్న తరువాత.. మరో పదిహేను నిమిషాల్లో విమానం టేకాఫ్ అవుతుందన్న సమయంలో తన ప్లాన్ అమలు చేశాడు ప్రియుడు.

సీటులో కూర్చున్న గర్ల్ ఫ్రెండ్ కు అనూహ్యంగా ఇంటర్ కామ్ నుంచి ప్రియుడి గొంతు వినిపించింది. దీంతో అమె నడుచుకుంటూ విమానంలోకి ఎక్కే దారి వద్దకు చేరుకుంది. అంతలోనే.. ఎదురుగా మోకాళ్ల మీద కూర్చుని.. ‘‘నన్ను పెళ్లిచేసుకోవూ’’ అంటూ చేతిలో గులాబీ పట్టుకున్న ప్రియుడిని చూసి ఆశ్చర్యపోయింది. తన నెచ్చెలికి అతడిలా వినూత్నంగా చేసిన పెళ్లి ప్రతిపాదన ప్రయాణికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇండోర్‌ నుంచి గోవా వెళుతున్న ఇండిగో విమానంలో చోటు చేసుకుందీ అద్భుతం.

 

సరికొత్త రీతిలో పెళ్లి ప్రతిపాదన చేసిన ఆ ప్రియుడు నరేంద్ర ఆనందాని. తన ప్రేయసి నాగపూర్‌ నుంచి ఇండిగో విమానంలో గోవాకు వెళుతోందని తెలిసి.. ఆదివారం నాగపూర్‌ నుంచి వచ్చాడు. ఆమెకు తెలియకుండానే ఆ విమానం ఎక్కాడు. పెళ్లి ప్రతిపాదన చేసే విషయంలో నరేంద్ర ఆనందానికి విమాన సిబ్బంది పూర్తిగా సహకరించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం విశేషం. నరేంద్ర పెళ్లి ప్రతిపాదన తేగానే.. విమాన సిబ్బంది అంతా ‘‘విల్‌ యూ మ్యారీ మీ’’ అని అందమైన అక్షరాలతో తీర్చిదిద్దిన ప్లకార్డులను ప్రదర్శించారు. మరి.. ఈ స్థాయిలో పెళ్లి ప్రతిపాదన చేస్తే.. ఆ నెచ్చెలి ఓకే చెప్పకుండా ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IndiGo  Proposal  Marriage  relationship  Couple  Indore  Madhya Pradesh  Goa  Airport  Indore Airport  airplane  Aero Bridge  

Other Articles