parties confident to proove majority బలనిరూపణలో గెలుస్తాం.. ఎవరి ధీమా వారిదే

Will proove majortiy in assembly bjp congress confident

supreme court, congress mlas, mukhul rothagni, abhishek manu singhvi, karnataka assembly, assembly speaker, speaker election, congress mlas, jds mlas, BS Yeddyurappa, governor, vajubhai wala, Congress, BJP, JDS, Kumara Swamy, hyderabad, kochi, Siddaramaiah, PM Modi, Amit shah, karnataka, politics

After the Supreme Court ordered a Karnataka Assembly floor test on Saturday, Chief Minister B.S. Yeddyurappa on Friday said he is confident of winning the required majority.

బలనిరూపణలో గెలుస్తాం.. ఎవరి ధీమా వారిదే

Posted: 05/18/2018 12:43 PM IST
Will proove majortiy in assembly bjp congress confident

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశాల నేపథ్యంలో కర్ణాటకలోని రెండు ప్రధాన కూటములు అదేశాలను స్వాగతిస్తూనే తాము ఈ బలనిరూపణలో నెగ్గుకోస్తామని ధీమా వ్యక్తం చేశాయి. అటు బీజేపి ఇటు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి తామంటే తామే గెలుస్తామని ధీమాను ప్రకటించడంతో ఇటీవల ఎన్నికలు ముగిసిన రాష్ట్రంలో రాజకీయం మరింత రసకందాయంగా మారింది. ఇక దీనికి తోడు ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన తరువాత కూడా ప్రభుత్వ ఏర్పాటు.. మనుగడ సాధించే అంశంలో నెలకోన్న ఉత్కంఠకు మాత్రం బ్రేక్ పడలేదు.

ఈ క్రమంలో కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప తమకు తగినంత సంఖ్యాబలం వుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యున్నత న్యాయస్థానం అదేశాల ప్రకారం శనివారం కర్ణాటక అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి తమ బలాన్ని నిరూపించుకుంటామని తెలిపారు. రేపు జరగనున్న విశ్వాస పరీక్షలో తాము నెగ్గుకోస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల పూర్తికాలం తాను కర్ణాటమ ముఖ్యమంత్రిగా భాధ్యతలు చేపడతానని క్రితంరోజునే చెప్పిన యడ్యూరప్ప.. తమకు మొత్తంగా 120 మంది ఎమ్మెల్యే మద్దతు వుందని కూడా చెప్పడం గమనార్హం.

ఇక దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన బీజేపి బలపరీక్షలో నెగ్గుతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. తమకు తగిన సంఖ్యా బలం ఉందని ప్రకటించింది. జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న విషయం వారికి తెలుసునని, అది రేపు ప్రపంచానికి తెలుస్తుందని పేర్కొంది. మా బలంపై సందేహం ఉన్న వారికి చెప్పేదొకటే, 'వేచి చూడండని' అని పోస్ట్ లో పేర్కొంది. ఆరు కోట్ల మంది కన్నడిగుల ఆశీర్వచనాలు తమకు ఉన్నాయని, వారి దీవెనలను గౌరవిస్తామని,  వారి ఆకాంక్షలను నెరవేరుస్తామని ప్రకటించింది.

సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును స్వాగతించిన కాంగ్రెస్ ఇది ప్రజాస్వామ్యాన్ని కోరుకునే దేశప్రజలందరూ స్వాగతించాల్సిన శుభపరిణామామని పేర్కోంది. ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసి తమదే పైచేయిగా నెగ్గాలనుకునే పార్టీలకు ఇది చెంపపెట్టులాంటి తీర్పుని పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పు మరోమారు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేలా తీర్పును వెలువరించిందని కాంగ్రెస్ నేత అశ్వని కుమార్ తెలిపారు.  న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సుప్రీంకోర్టు మరోసారి నిలబెట్టుకుందని చెప్పారు. అనైతిక విధానాలతో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి సుప్రీం అదేశాలు చెంపపెట్టులాంటిదని అన్నారు. రేపు జరగబోయే బలపరీక్షలో యడ్యూరప్పకు, బీజేపీకి పరాభవం తప్పదని చెప్పారు. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాలు ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ కూటమి బలపరీక్షలో గెలుపొంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  congress mlas  jds mlas  BJP  Yeddyurappa  Congress  JDS  karnataka  politics  

Other Articles