kidnap case against actress anjali is not true నటి అంజలి నన్ను కిడ్నాప్ చేయలేదు

Kidnap case against actress anjali is not true

hyderabad police, sr nagar police, arya samaj, love marriage, actress anjali, divya, venkatesh, divya parents, viral news, social media

hyderabad sanjeevareddy nagar police who got a complaint against actress anjali in a kidnap case is not true says the girl who eloped and married a guy to the police

నటి అంజలి నన్ను కిడ్నాప్ చేయలేదు: బాధిత యువతి

Posted: 05/18/2018 10:36 AM IST
Kidnap case against actress anjali is not true

టీవీ, సినీ నటి అంజలిపై యువతిని కిడ్నీప్ చేసిందన్న అరోపణలు, పిర్యాదులలో నిజం లేదన్న ట్విస్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ప్రేమ పెళ్లిని తమ పెద్దలు అంగీకరించరని ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్న ఓ యువ జంట ఎస్సార్ నగర్‌ పోలీసుల ఎదుటకు వచ్చి తమ తరపున వాంగ్మూలం ఇవ్వడంతో.. ఇది ప్రేమవివాహ నేపథ్యంలో వచ్చిన పిర్యాదని భావించిన పోలీసులు.. యువతికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినా యువతి తన ఇష్టపూర్వకంగానే తాను వివాహం చేసుకున్నానని, ఇందులో నటి అంజలికి ఎలాంటి ప్రమేయం లేదని పోలీసులకు వివరణ ఇచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. బుల్లితెర, సినీ నటి అంజలి సోదరుడు వెంకటేశ్, దివ్వ అనే యువతిని ప్రేమించాడు. ఈ విషయం దివ్య తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఈ పెళ్లికి నిరాకరించి వేరొకరితో పెళ్లి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో దివ్య, వెంకటేశ్ లు పెద్దలకు చెప్పకుండా బల్కంపేటలోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. దీంతో తమ కూతురు కనిపించడం లేదని ఆమెను టీవీ, సినిమా నటి అంజలి, మరికొంతమంది కలిసి కిడ్నాప్‌ చేశారంటూ దివ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు నటి అంజలితో పాటు చేరుకున్న ప్రేమజంట.. పోలీసులకు తమ వివరణ ఇచ్చారు. తమ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని, తమను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని పోలీసుల ముందు చెప్పారు. ఇన్‌స్పెక్టర్‌ వహీదుద్దీన్‌ మాట్లాడుతూ... ప్రేమ పెళ్లి చేసుకున్న యువతీ, యువకులిద్దరూ యుక్త వయస్సు వచ్చినవారని, వారి ఇష్టప్రకారం పెళ్లి చేసుకునే హక్కు మేజర్లకు ఉంటుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles